Accommodation in Varanasi | Andhra Ashramam Cycle Swamy Kanchi muth Phone Numbers

Mutts & Ashrams In Varanasi


వారాణసి లో యాత్రికుల కోసం రూమ్స్ చాలానే ఉన్నాయి. కాస్త అటు ఇటు లో దేవాలయానికి దగ్గర్లోనే ఉన్నాయి. దేవాలయం చుట్టూ సుమారు 2 కిమీ వరకు విధులన్నీ చాల ఇరుకుగా ఉంటాయి. మొదటి సారి వెళ్లినవారికి దారి వెతకడం కష్టం గానే ఉంటుంది. ఎక్కుమందితో యాత్ర చేస్తున్నట్లయితే అందరు వస్తున్నారో లేదో ఎప్పడికప్పుడు గమనిస్తూ ఉండాలి. తెలుగు వాళ్ళకోసం  ఆశ్రమాలు / సత్రాలు ఉన్నాయి. మీరు కనుక రైల్వే స్టేషన్ నుంచి మన తెలుగు వాళ్ళ ఉన్న ప్లేస్ కి వచ్చారంటే సగం కాశి ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. 
ఈ వీడియో చూడండి :
అక్కడ మన భాష రాని వారికంటే తెలుగు వచ్చిన వారితోనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెబుతున్నాను అంటే కాశి లో ఆంధ్ర ఆశ్రమం ఒకటుంది. ఒక్కటే ఉంది. అదే పేరుతో తెలుగు తెలిసిన మేధావులు గంగ యోగి లాడ్జ్ వాళ్ళు  శ్రీ రామ ఆంధ్ర ఆశ్రమం ని పేరు మార్చి , ఆటో వాళ్లతో బేరాలు కూదుర్చుకుని తెలుగు వాళ్ళు రాగానే ఆంధ్ర ఆశ్రమం తీస్కుని వెళ్తాం అని ఈ లాడ్జ్ కి తీస్కుని వస్తారు. కొత్తవారికి ఏమి తెలుస్తూంది. తెలివిగా వీళ్ళు ఎన్ని రోజులు ఉండబోతున్నారో తెల్సుకుని అన్ని రోజుల అద్దె ముందే తీస్కుంటారు. 

ఆంధ్ర ఆశ్రమం అసలు పేరు శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం , మీరు చూస్తున్నది అసలైన ఆంధ్ర ఆశ్రమం . ఇక్కడ ముందుగా రూమ్స్ బుక్ చేస్కోవడానికి వీలు లేదు, 80% వరకు రూమ్ దొరుకుతుంది. 100 -500 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ , రూమ్స్ బాగున్నాయి. ఎక్కువ మంది వచ్చేనట్లితే మీకు హాలు కూడా ఇస్తారు. a/c రూమ్స్ కూడా ఉన్నాయి. కాశి లో ఆశ్రమాల్లో మధ్యాహ్నం భోజనం రాత్రి పూట ఫలహారం ఎటువంటి ఛార్జ్ లేకుండానే పెడతారు. కాకపోతే మీరు ముందుగా పేరు నమోదు చేస్కోవాలి తప్పకుండ హాజరు కావాలి. 

మీకు ఇక్కడ రూమ్స్ దొరకకపోయినా ప్రక్కనే సైకిల్ బాబా ఆశ్రమం ఉంది.  ఒకరోజుకు 400 నుంచి రెంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆశ్రమం కూడా తెలుగు వాళ్ళదే . 
రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్ర ఆశ్రమం తీస్కుని రావడానికి 150 - 200 వరకు ఛార్జ్ చేస్తున్నారు. 7 కిమీ దూరం ఉంటుంది. మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి బేరామాడుకుంటే తగ్గే అవకాసం ఉంది. 
Sri Ramataraka Andhra Ashramam Address:
Sri Rama Taraka Andhra Ashram
B 14/92, Varanasi H O, 
Varanasi - 221002, 
Manasorovar
+(91)-542-2450418
----
Sri Sringeri Shnkar Math,
B-14/111 Kedargrghat,
Varanasi, Uttar Pradesh
PIN Code - 221 001
Telephone No 0542- 2452768

Branch in charge : Ramakrishna Prasad
--
Sri Kanchi Kamakoti Peetam Sri Sankara Mutt
Varanasi Branch, 
B 4/7, Hanuman Ghat, 
Varanasi - 221001

Kumara Swamy Mutt
Near Kedar Ghat 
Tel No. 0542 2454064

Click Here For :
కాశి కోసం ఇతర పోస్ట్ లను చూడండి .. 
Accommodation in Varanasi
Varanasi Yatra Video 
Varanasi Local Temples
Varanasi Surrounding Temples 
మీ యాత్ర అనుభవాలను , లేదా మీకు కావాల్సిన సమాచారం కామెంట్ చేయండి.

varanasi information in telugu, accommodation in varanasi, telugu ashramam in varanasi, andhra ashramam rooms booking in varanasi. kashi information in telugu.

21 Comments

  1. thanks for your valuable info brother

    ReplyDelete
  2. chaala chakkati upayogakaramaina samacharaanni isthunnaru meeku dhanyavaadamulu ivi kottha variki yentho upayogam

    ReplyDelete
  3. I know the place in Uttar Pradesh, India. It's very respected place for Hindus as prayer place.

    ReplyDelete
  4. Thanq , very good info ,very useful.

    ReplyDelete
  5. please any satram in advance booking facility

    ReplyDelete
  6. Click here for Phone numbers of various Satras, Choultries, Associations, Accommodation etc
    http://aryavysyas.srisms.com/phone.numbers.pdf

    ReplyDelete
  7. జూలైనెలాఖర్లో వెళ్ళాలి కాశీకి.ఆంధ్రా రామతారక ఆశ్రమంలో కంటే సైకిల్ స్వామి ఆశ్రమంలో ఆదరణ బాగుంది.మొదటగా రైలు దిగగానే ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసేవాశ్రమ్ లో గది తీసుకున్నాము. తరువాతస్థిమితంగా రిక్షా మాట్లాడుకుని ఆంధ్రాఆశ్రమానికి వెళ్ళాం.అయితే అక్కడ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తితో మీ ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చామని గది కావాలని అడగగా పుణ్యానికి తిండి దొరుకుతుందని వెతుక్కుంటూ వచ్చామని చులకనగా మాట్లాడినాడు. మాకు బాధగా అనిపించి దగ్గర లోనే ఉన్న సైకిల్ స్వామి ఆశ్రమాన్ని వెళ్ళాం. వారు మర్యాద గా పలకరించి ఎంతమంది వచ్చారు? ఎన్నిరోజులుంటారు? అని అడిగి గది ఇచ్చారు.మళ్ళీవారే భోజనము గురించి ఇబ్బంది పడవద్దని మధ్యాహ్నం భోజనం,సాయంత్రం ఉపాహారం ఉంటుందని ఉచితంగానే విచారణ చేస్తారని చెప్పారు.అంతేగాక చూడవలసిన ప్రదేశము లిస్టు ఇచ్చి ఆటోకూడా మాట్లాడినా పంపించారు.నిజంగా తెలుగువారు కాశీకి వెళితే తప్పనిసరిగా సైకిల్ స్వామి ఆశ్రమాన్ని దర్శించండి.It is perfect place for pilgrims in kasi.మ ుఖ్యంగా తెలుగు వారికి...జై విశ్వనాథ.

    ReplyDelete
    Replies
    1. తెలుగు తెలిసి అన్ని తిప్పి చూపించే గైడ్ లు ఉన్నారా

      Delete
  8. జూలైనెలాఖర్లో వెళ్ళాలి కాశీకి.ఆంధ్రా రామతారక ఆశ్రమంలో కంటే సైకిల్ స్వామి ఆశ్రమంలో ఆదరణ బాగుంది.మొదటగా రైలు దిగగానే ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసేవాశ్రమ్ లో గది తీసుకున్నాము. తరువాతస్థిమితంగా రిక్షా మాట్లాడుకుని ఆంధ్రాఆశ్రమానికి వెళ్ళాం.అయితే అక్కడ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తితో మీ ఆశ్రమాన్ని వెతుక్కుంటూ వచ్చామని గది కావాలని అడగగా పుణ్యానికి తిండి దొరుకుతుందని వెతుక్కుంటూ వచ్చామని చులకనగా మాట్లాడినాడు. మాకు బాధగా అనిపించి దగ్గర లోనే ఉన్న సైకిల్ స్వామి ఆశ్రమాన్ని వెళ్ళాం. వారు మర్యాద గా పలకరించి ఎంతమంది వచ్చారు? ఎన్నిరోజులుంటారు? అని అడిగి గది ఇచ్చారు.మళ్ళీవారే భోజనము గురించి ఇబ్బంది పడవద్దని మధ్యాహ్నం భోజనం,సాయంత్రం ఉపాహారం ఉంటుందని ఉచితంగానే విచారణ చేస్తారని చెప్పారు.అంతేగాక చూడవలసిన ప్రదేశము లిస్టు ఇచ్చి ఆటోకూడా మాట్లాడినా పంపించారు.నిజంగా తెలుగువారు కాశీకి వెళితే తప్పనిసరిగా సైకిల్ స్వామి ఆశ్రమాన్ని దర్శించండి.It is perfect place for pilgrims in kasi.మ ుఖ్యంగా తెలుగు వారికి...జై విశ్వనాథ.

    ReplyDelete
    Replies
    1. sykil swamy asramam lo roju ku entha amount thisukunnaru

      Delete
  9. Perugu Balasubramanyam want to share some more information.Shree kashi vishwanatha aalayam "dasha ashwamedha" Ghat ki daggaralo undi meeru benaras Lodge ani oke sri sai vishwanatha ashramam ramakrishnaiah ane athanu nadupouthunnaru "godalia" junction daggara. rojusuki manishikiRs 200 theesukuntunnaru rendu pootasla aaharam guda adorukuthundi (eemadhya aaharam ruchi adugantindi). Mukhyanga vyovruddulu nadavalenivaaru ee ashramam nundi 250 meters nadavagalaru Gate number one daggare nadi kuda daggare.09918275939,9616791139 contact numbers "Manam undedi 9 rojulu edaina ibbandi unte sardukuni vishwanadhunu darshanam chesukovachhu Jai hind
    Perugu Balasubramanyam

    ReplyDelete
  10. Thank you to all people who shared their experiences
    these are very useful to us

    ReplyDelete
  11. Sri Rama tharaka Andhra asramam.its really good. Daily 50 per person and food free.even at Annapurna Devi sathram it's abosutely free and tasty. Every near to Temple and ganga ghats.

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS