Drop Down Menus

How to Perform Thulabaram at Tirumala Venkateswara Swamy Temple

తులాభారం అనగానే మనకు శ్రీ కృష్ణుడు గుర్తుకు రావడం సహజం. శ్రీ కృష్ణ తులాభారం విని చూసి తరించాం కూడా.. చాలామంది భక్తులు తమ పిల్లలకు తులాభారం వేస్తుంటారు. 

భక్తులు ఎవరు ఎలా మొక్కుకుంటే మొక్కుకున్నవి పిల్లవాడు ఎంత బరువు ఉంటే అంత దేవాలయానికి ఇస్తుంటారు. తులాభారం ఇచ్చే వాటిలో ఎక్కువగా డబ్బులు,పటిక బెల్లం, పంచదార .. ఆలా చాలానే ఉన్నాయి. అన్ని ఒక ఎత్తైతే  వాటిలో రూపాయి కాసులు మొక్కు కున్నవారు చాలానే ఇబ్బంది పడతారు ఎందుకంటే చిల్లర కోసం.. నెల రోజులు నుంచి రూపాయి కాసులు పోగుచేసి కోవడం పనిలో ఉంటారు. మీరు కూడా అలానే చేసారా ?  సరే తిరుమలలో తులాభారం ఎక్కడ వేయించాలి? టికెట్ ఎక్కడ తీసుకోవాలి? మీరు పెద్దగా కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే తిరుమలలో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడే ప్రధాన ద్వారం కుడివైపు తులాభారం వేయబడును అని బోర్డు పెట్టి ఉంటుంది. పిల్లవాణ్ణి బరువు చూసి వారు మీకు చెబుతారు ఎంత అమౌంట్ చెల్లించాలి అని.. మీరు డబ్బులు వారికీ ఇవ్వనవసరం లేదు మీరే స్వయంగా హుండీలో వెయ్యవచ్చు. మీరు మొక్కుకున్న వాటి ధర బట్టి మీరు వేస్తె సరిపోతుంది. ఇంకా సమాచారం కావాలంటే కామెంట్ చెయ్యండి. 


No need to do anything. We have to do that while going to Darshan itself. They will tell the amount according to weight and item we like to offer ( like sugar, candy, rice etc ) And they will ask us to put that amount in Srivari Hundi Directly.

Tirumala Related Articles: 
మీకు కావలసిన సమాచారం పై క్లిక్ చేయడం ద్వారా అవి ఓపెన్ అవుతాయి. 

అలిపిరి మెట్లమార్గం లో వెళ్దాం రండి

శ్రీవారు నడిచిన మెట్టే శ్రీవారి మెట్టు 

తిరుమల కొండపైన ఏమేమి చూడాలి?

తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమిటి?

తిరుమల లో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా?

తిరుమల స్వామి వారి అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా?

credits: Sandeep
tirumala information, tirumala information in telugu, how to perform thulabharam at tirumala, thulabharam timings, tirumala venkateswara swamy temple, tirumala tirupati, tirupathi,tirumala e books, tirumala seva online, tirumala tirupathi rooms information , tirumala venkateswara swamy, how to Perform tirumala puja, tirumala accommodation information, tirumala bus stand , tirumala route map. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.