Pancha Prayaga Information Route Map | Hindu Temples Guide

పంచప్రయాగలు, ఉత్తరాఖండ్ :
రిషీకేశ్ నుండి బదరీనాథ్ వెళ్ళేదారిలో భక్తులు ఐదు ప్రయాగ లను చూస్తారు. లోగడ నేను పంచకేదార్ లను వివరించడం జరిగింది. ఇపుడు పంచప్రయాగలను చూద్దాము. రిషీకేశ్ నుండి బయలుదేరగానే 1. దేవప్రయాగ  2.రుద్రప్రయాగ 3.నందప్రయాగ  4. కర్ణప్రయాగ 5. విష్ణుప్రయాగ లు వరుసగా వస్తాయి. రిషీకేశ్ నుండి వాటి దూరాలు
1. దేవప్రయాగ  :  70 కి.మీ.

2. రుద్రప్రయాగ  : 140 కి.మీ.

3. కర్ణప్రయాగ    :  169 కి.మీ.

4. నందప్రయాగ :  190 కి.మీ.

5. విష్ణుప్రయాగ  :  256 కి.మీ.

1. దేవప్రయాగ : కుబేరుని పట్టణమైన అలకాపురి నుండి వచ్చే అలకనంద మరియు  గంగోత్రినుండి వచ్చే భాగీరథీ నదుల సంగమం. ఇక్కడ రఘునాథ్ మందిరమున్నది. దీనిని విధిగా దర్శించాలి. శ్రీరాముడు ఇక్కడ అశ్వమేధయాగం చేసిన ప్రదేశం.

2. రుద్రప్రయాగ  : మందాకినీ , అలకనందా నదులసంగమం. ఇక్కడ రుద్రనాథమందిరం, చాముండాదేవి ఆలయం ఉన్నాయి. శంకరుడు నారదునకు సంగీతం నేర్పిన ప్రదేశమిది. శంకరుడు వీణానాదాన్ని( రుద్రవీణ) ఆలపించిన చోటు.
3. కర్ణప్రయాగ : అలకనంద మరియు పిండారీ నదులసంగమం. కర్ణుడు తపమాచరించి శంకరుని ప్రసన్నం చేసుకున్న ప్రదేశం. స్వామివివేకానంద ఇక్కడ 18రోజులు తపమాచరించాడు. ఇక్కడ ఉమాదేవి ఆలయము ఉన్నది.

4. నందప్రయాగ  : అలకనంద మరియు నందాకినీ నదులసంగమం. నందుడు యజ్ఞమాచరించిన ప్రదేశం. నందగోపాలుని మందిరమిక్కడ ఉన్నది. కణ్వాశ్రమము ఇక్కడనే ఉండెడిది. దుష్యంతుడు, శకుంతలల వివాహస్థలమిదియే. శ్రీకృష్ణుడు పెరిగిన నందుని ఊరు ఇదియే.

5. విష్ణుప్రయాగ : అలకనంద మరియు ధౌళిగంగ ల సంగమమిదియే. నారదుడు విష్ణు భగవానునికై తపమాచరించిన ప్రదేశమిది. ఇచట విష్ణ్వాలయము మరియు సంగమం వద్ద విష్ణు కుండము ఉన్నాయి.

- Bhattacharya:

Keywords : Pancha Prayag, Rudhra prayaga, nanda prayaga, vishnu prayaga, deva prayagan, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS