Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am ***జనవరి 2023 నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు ఆన్లైన్ లో 12.12.2022 10:00 AM.విడుదల చేస్తున్నారు.**డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Lord Siva Special Temples | ప్రపంచం లో ఈ ఒక్క ఆలయం లోనే పరశివుడు


ప్రపంచం లో ఈ ఒక్క ఆలయం లోనే పరశివుడు ఈ విధంగా దర్శనం ఇస్తాడు.  శివుడు  లింగ రూపం లోనే పూజలు అందుకుంటున్న .. శివుడు సాకార రూపం లో భక్తులకు దర్శనం ఇచ్చే క్షేత్రాలు చాల అరుదు. శివునికి నీల కంటేశ్వర అనే నామం కలదు. నీలకంఠుడు అనే పేరు రావడానికి చాల చరిత్రే ఉంది. ఇప్పుడు మనం దర్శించ బోయే ఈ  అద్భుత క్షేత్ర స్థలపురాణం . నీల కంటేశ్వర అనే నామం వెనుక జరిగిన సంఘటనే కారణం . చరిత్ర చెప్పుకోయే ముందు ఈ క్షేత్రం లో స్వామి వారు ఏ విధంగా దర్శనం ఇస్తారో తెల్సుకుందాం. ఇక్కడ స్వామి వారు సాకార రూపం లో దర్శన మివ్వడమే కాకుండా విష్ణు మూర్తి దర్శనం ఇచ్చినట్టు  శయన భంగిమలో  పార్వతి అమ్మవారి ఒడిలో నిద్రిస్తున్నట్టు మనకు కనిపిస్తారు. భక్తులు ఆశ్చర్యంగా చెప్పుకుంటూ  ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేస్కుని వెళ్తుంటారు. 
శ్రీ సర్వమంగళ సమేత  పల్లె కొండేశ్వర స్వామి దేవస్థానం - సురుటు పల్లి 
ఇక్కడ స్వామి వారి పేరు పల్లెకొండేశ్వరుడు ..  అమ్మవారి పేరు సర్వమంగళ . వేల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన 12 అడుగుల సుద్ద విగ్రహం కావడం విశేషం . ఈ క్షేత్రం తమిళ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండటం వల్ల స్వామి వారి పేరు లో కూడా తమిళం వచ్చి చేరింది. తమిళం లో పల్లెకొండ అంటే పడుకుని ఉండుట అని అర్ధం . పడుకున్న ఈ ఈశ్వరుడు అని స్వామి వారి ఆలయానికి పేరు వచ్చింది. కంచి కామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని గా పేర్గాంచిన శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి వారు ఈ క్షేత్రాన్నీ దర్శించి  అద్భుతంగా ఉంది .. పడుకునే ఉండే విష్ణు మూర్తి లేచి నిలబడ్డాడు . నిలబడే ఉండే శంకరుడు నిద్రిస్తున్నట్టు ఉన్నాడు అని చెప్పారు. 
ఆలయ చరిత్ర 
పల్లి కొండేశ్వర స్వామి ఆలయం 1344 వ సంవత్సరం లో శ్రీవారి హర  బుగ్గరాయలు కాలంలో నిర్మించబడినది. అమృతం కోసం దేవతలు , రాక్షసులు కలిసి మందర పర్వతము , వాసుకి అనే సర్పము సాయంతో క్షీర సాగర మధనానికి పూనుకున్నారు . పాలసముద్రము చిలికే సమయం లో భయంకరమైన కాలకూట విషం బయటపడింది. పద్నాలుగు లోకాలు దహించడానికి సిద్దమైన ఆ కాలకూట విష ప్రభావం నుంచి రక్షించమని సుర , అసురులు శంకరున్నీ ప్రార్ధించారు . చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకూట విషాన్ని చేత భూని అమాంతం మ్రింగేస్తాడు . ఆ హాలాహలాన్ని శివుని గర్భం లోకి పోనివ్వకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా , ఆ విషం కంఠం వద్దే నిలిచిపోయి స్వామిని నీలకంఠుణ్ణి చేసింది. భయంకరమైన ఆ కాలకూట విషం మహాశివుణ్ణి సైతం కాసేపు మత్తెక్కిస్తోంది. 

విషప్రభావానికి గురైన శివుడు కాసేపు ఈ క్షేత్రం లో విశ్రమించాడని , శివుడు శయనించిన క్షేత్రం కనుక దీనిని శయన క్షేత్రం అంటరాని స్కంద పురాణం ద్వారా తెలియవస్తుంది. శివుడు హాలాహలం భక్షించి విశ్రమించినందున దీనిని కాలకూట శయన క్షేత్రమని అంటారు . విషం మత్తులో పార్వతి దేవి ఒడిపై తల వంచి పవళించి వున్న గరళ కంఠుని విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్ధన చేస్తున్న  బ్రహ్మ , మహా విష్ణువు ,  దేవేంద్రుడు , చంద్రుడు , సూర్యుడు , కుబేరుడు , నారదుడు , తుంబురుడు , మార్కండేవుడు మొదలైన వారి విగ్రహాలు కలవు. 
 చేరుకునే విధానం : 
తిరుపతి నుంచి సురుటుపల్లికి డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి . తిరుపతి నుంచి చెన్నె వెళ్లే బస్సు లు ఈ క్షేత్రం లో ఆగుతాయి . తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి కళ్యాణం జరిగిన ప్రదేశం నారాయణ వనం , వతారం లో విష్ణు మూర్తి దర్శనం ఇచ్చే క్షేత్రం నాగులా పురం . ఈ రెండు క్షేత్రాలు సురుటుపల్లి కి దగ్గర్లోనే ఉన్నాయి . 
తిరుపతి నుంచి ఈ విధంగా ప్లాన్ చేయండి : 
మీరు తిరుపతి నుంచి ముందుగా సురుటుపల్లి దర్శించి అక్కడ నుంచి నాగలాపురం , నారాయణ వనం చూసుకుని తిరుపతి చేరుకోవచ్చు . లేదా మీరు తిరుపతి నుంచి నారాయణ వనం , నాగలాపురం , సురుటుపల్లి , తిరుత్తన్ని  ( సుబ్రహ్మణ్యస్వామి ఆలయం , ఆరుపడైవీడు క్షేత్రాలలో ఒకటి ) , కాంచీపురం వెళ్ళవచ్చు . 
తిరుపతి ఎంతెంత దూరం లో ఉన్నాయ్ అంటే : 
తిరుపతి నుంచి నారాయణ వనం - 40 కిమీ నారాయణ వనం నుంచి నాగలాపురం - 25 కిమీ నాగలాపురం నుంచి సురుటుపల్లి  - 11 కిమీ దూరం సురుటుపల్లి నుంచి తిరుత్తన్ని - 50 కిమీ తిరుత్తన్ని నుంచి కాంచీపురం - 50 కిమీ దూరం . 

                

SURUTUPALLI PALLIKONDESWARA SWAMY TEMPLE, FAMOUS TEMPLES IN CHITTOR DISTRICT , UNKNOWN LORD SIVA TEMPLES,   

Comments

Popular Posts