Drop Down Menus

Nitya Parayana Slokas in Telugu | నిత్యపారాయణ శ్లోకాలు | Sakaladevata Stotras

నిత్యపారాయణ శ్లోకాలు

హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం ..  ఇక్కడ నిత్యపారాయణ శ్లోకాలు ఇవ్వడం జరిగింది. నిద్రలేవగానే చదవాల్సిన చదవాల్సిన శ్లోకాలు ..సూర్యనిదర్శిస్తు .. తులసి మాతకు నమస్కరిస్తూ .. భోజనం చేసేటప్పుడు .. దారిద్య దుఃఖ నివారణకు .. నిద్రపోయే ముందు చదవాల్సిన శ్లోకాలు .   ఆపద నివారణకు .. చెడు కల వచ్చినప్పుడు చదవాల్సిన శ్లోకాలు వరసగా ఇవ్వడం జరిగినది . 
(నిద్రలేవగానే)
కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ |
కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనమ్ ||
సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే ||

నవగ్రహ శ్లోకం :
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారీ |

భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ ||
గురుశ్చ శుక్రః శని రాహు కేతవః |
కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ ||

కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే |

ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః ||

(స్నానం చేయునపుడు)

గంగే చ యమునే కృష్ణే గోదవరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్ |
స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణీం |
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ ||
గంగే మాం పునీహి |

(సూర్యుని దర్శించునపుడు)

బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ |
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ ||
(విదియ [ద్వితీయ] చంద్రుని దర్శించునపుడు)
క్షీరసాగర సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర |
హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోఽస్తు తే ||

(తులసీమాతకు నమస్కరిస్తూ)

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః |
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ ||
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే |
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని ||

(తులసి దళములు గ్రహించునపుడు)

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే |
కేశవార్థం చినోమి త్వాం క్షమస్వ హరివల్లభే

(అశ్వత్థవృక్షమునకు నమస్కరించునపుడు)

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ తే నమః ||

(భోజనమునకు ముందు)

అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||

(ఏకశ్లోకీ రామాయణం)

ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనమ్ |
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ ||
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ |
పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ ||

(ఏకశ్లోకీ భాగవతం)

ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం |
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్ ||
కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం |
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్ ||

(ఏకశ్లోకీ భారతం)

ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహేదాహనం |
ద్యూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనమ్ ||
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం |
భీష్మద్రోణసుయోధనాదిమథనం హ్యేతన్మహాభారతమ్ ||

(నాగస్తోత్రం)

నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర |
నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోఽస్తు తే ||

(యజ్ఞేశ్వర ప్రార్థన)

నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన |
నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః ||

(ఔషధమును సేవించునపుడు)

అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్ |
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ||
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే |
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః ||

(ప్రయాణమునకు బయలుదేరునపుడు)

యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా |
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్ ||
నారాయణ నారాయణ నారాయణ ||

(దీపం వెలిగించిన పిదప)

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోఽపహమ్ |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోఽస్తు తే ||
శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్ |
శత్రుబుద్ధివినాశం చ దీప జ్యోతిర్నమోఽస్తు తే ||

(నిద్రకు ఉపక్రమించినపుడు)

రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరమ్ |
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి ||
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ||
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః |
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ||

(చెడు కల వచ్చినపుడు)

బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్ |
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి ||

(కలిదోష నివారణం)

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్ ||

(శమీ వృక్షమును దర్శించునపుడు)

శమీ శమయతే పాపం శమీ శతృవినాశినీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||

(దారిద్య  దుఃఖ నివారణకు)

దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః |
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి ||
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా |
సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా ||

(ఆపద నివారణకు)

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||

(కలికల్మషనాశన మహామంత్రము)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే |
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Keywords : nitya paranayana slokas, navagraha slokas , daily useful slokas, slokas in telugu, stotras daily , telugu stotras, nava graha slokas, temples guide slokas. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.