Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Veerabhadra Swamy Temple Rayachoti - Timings, History, Pooja Details

ఇల కైలాసం.. వీరభద్రుని సన్నిధానం :
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో రాయచోటి వీరభద్రాలయం ఒకటి. వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై భక్తుల కోర్కెలను తీర్చే స్వామి గా పూజలందుకుంటున్నాడు. రాచవీడు కాలక్రమేణా రాయచోటిగా మారింది.   రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.

10, 11వ శతాబ్దంలో రాజాధిరాజచోళుడు ప్రశాంత వాతావరణం కోసం అప్పటి మాండవ్యనదీ పరివాహక ప్రాంతంపై ఆయన దృష్టి వెళ్లింది. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. సెలయేటి ఇసుక తిన్నెల నదీ పరివాహక ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొన్నారు. రాజు వెంట వచ్చిన మంది మార్భలంతో ఒక ఊరుగా ఏర్పడింది. రాజులు ఉండే ఊరు రాచవీడని, రాజులు తిరిగే రాచబాటని నానుడి. అనంతరం రాజచోళుడున్న ప్రాంతమే రాచవీడుగారూపొందినట్టు కథనం. శైవభక్తుడైన చోళరాజు మాండవ్యనదీ పరివాహక ప్రాంతంలో వీరభద్రుని ప్రతిమ ప్రతిష్టించాడని తెలుస్తోంది. కాగా దక్షప్రజాపతి కుమార్తె శంకురుడి అర్థాంగి సతీదేవి అగ్నిలో ఆహుతైనప్పుడు పరమశిశుడు ఉగ్రుడై బ్రహ్మాం డం బద్దలయ్యేలా హూంకారము చేసి తన జటాజూటమునందలి ఒక జటను తీసి పర్వ తానికి కొట్టగా కోటి సూర్య ప్రకాశంతో కోరలు కలిగి భద్రకాళీ వీరభద్రుడిగా ఉద్భవించినట్టు పురాణ కథనం. శివుని అజ్ఞమేరకు దక్షయాగం చేసి అనంతరం భక్తుల రక్షణకు రాచవీడులో కొలువయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. చోళుడు ప్రతిష్టించిన ఈ ఆలయం కాకతీయ రాజులచే నిర్మితమైనట్టు, తదుపరి తుళువ వంశపు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయులుచే 1484లో పునరుద్ధ్దరించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.

అపురూప కళాశిల్ప వైభవంతో ఉట్టిపడే ఈ ఆలయంలో భద్రకాళీ వీరభద్రునితో పాటు వినాయకుడు, శివుడు, కాలబైరవుడు, చండీశ్వరుడు, శనిగ్రహాలు ఉన్నాయి. ఆలయానికి తూర్పు దిశలో 56 అడుగల దీనస్థంభము చూపరులను ఆకట్టుకుంటోంది. ఇంత పెద్ద ఏకశిల దీపాస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని ఆరాదించడం ఆనవాయితీగా వస్తోంది.

దక్షిణకాశిగా ప్రసిద్ధి గాంచిన ఈ క్షేత్రంలో వీరభద్రుడిని పూజిస్తే కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. కర్నాటక భక్తుల ఇలవేల్పు గా ఆలయాభివృద్ధికి వారి కృషి ప్రశంస నీయం. శివరాత్రి మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తసందోహంతో రాయచోటి పట్టణం కళకళలాడుతుంది. హిందువులేకాక ముస్లింలు సైతం ఆలయానికి విచ్చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు శివరాత్రితో ముడిపడి మహానైవేద్యంతో ముగుస్తాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు.

Sri Veerabhadra Swamy Temple Rayachoti
Market Road, Kothapeta, Rayachoty, Andhra Pradesh 516269
Phone: 085612 50307

                       
rayachoti veerabhadra temple accommodation, rayachoti veerabhadra swamy photos, rayachoti railway station, rayachoti images, veerabhadra swamy temple in andhra pradesh, veerabhadra swamy abhishekam, veerabhadra swamy temple near me, rayachoti to tirupati..

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు