ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
1. శ్రీ సరస్వతి ఆలయం , బాసర :
తెలంగాణ రాష్ట్రము లోని శ్రీ సరస్వతి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. వసంత పంచమి రోజున ఈ ఆలయం లో చాలా మంది తన పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. చాలా పురతన ఆలయం. దసరా , దీపావళి పండుగలు వైభవంగా నిర్వహిసారు. ఆలయ సమీపంలో గోదావరి నది కూడా ఉన్నది. ఆలయం లో వేదవ్యాస గుహ మరియు మహాలక్ష్మి, మహాకాళి ఆలయాలు కూడా ఉన్నాయి.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.30PM.
మరికొంత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. శ్రీ జైనథ్ ఆలయం , జైనథ్ గ్రామం :
జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లా, జైనథ్ గ్రామంలో ఉన్న అతి ప్రాచీన జైన ఆలయం.తర్వాత దీన్ని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంగా మార్చారు. ఈ ఆలయం హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాదిలో ఒకసారి సూర్య కిరణాలు స్వామివారి మూల విగ్రహాన్ని తాకడం ఇక్కడి విశేషం.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
3. శ్రీ సత్య నారాయణ స్వామి ఆలయం , గూడెం :
ఈ ఆలయం మంచిర్యాల నుంచి 40 కి. మీ దూరంలో కలదు. ఈ అలయని తెలంగాణ అన్నవారంగా పిలుస్తారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్నారు. గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం కలదు. ప్రతి సం || స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ ఆలయం కొండ పై కలదు. చాలా పురాతన ఆలయం.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.30PM.
4. శ్రీ నరసింహ స్వామి , కాల్వ :
శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. వైకుంటా ఏకాదశి రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.30PM.
5. శ్రీ సాయి బాబా ఆలయం , మంచిర్యాల :
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం ఈ అలయాన్నికి హైదరాబాద్ నుంచి 220 కి. మీ దూరంలో కలదు. ప్రతి గురువారం రోజున రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయం బయట భారీ శ్రీ సాయి బాబా 3 అంతస్తుల లలో నిర్మించారు. ఎంతో దూరాన ఉన్న కూడా ఈ ఆలయాన్ని చూడవచ్చు. శ్రీ రామ నవమి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
6. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం , బెల్లం పల్లి :
ఈ ఆలయం బెల్లం పల్లి అనే గ్రామం లో ఆదిలాబాద్ నందు కలదు. ఇక్కడ ప్రతి శుక్ర , మంగళ వారాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అమ్మవారికి ప్రతి సం || ఉత్సవాలు నిర్వహిస్తారు. దసరా మరియు దీపావళి పండుగ రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 4.00PM TO 7.30PM
ఆదిలాబాద్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise List
KeyWords : Adilabad Famous Temples List, Adilabad District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment