మెదక్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :
1. శ్రీ విద్య సరస్వతి ఆలయం , వర్గల్ :
ఇది తెలంగాణలోని సరస్వతి ఆలయాలలో ఒకటి. బాసర తరువాత ఈ ఆలయం అంతటి పేరు పొందినది. ఈ ఆలయం కంచి కామకోటి పీఠం వారి అధీనంలో కలదు. ఈ ఆలయంలో శ్రీ సరస్వతి తో పాటు , శ్రీ లక్ష్మీ , గణపతి ,శని భాగవణుడి ఉప ఆలయాలు ఉన్నాయి. వసంత పంచమి రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 2.00PM TO 8.30PM.
2. శ్రీ ఏడు పాయాల వనదుర్గ దేవి ఆలయం , నాగసాన్ పల్లి :
ఈ ఆలయం 7 సరస్సులు కలిసే ప్రదేశం. ఇక్కడ దుర్గమ్మ ఆలయం తెలంగాణ రాష్టంలో అత్యంత ప్రసిద్ది చెందినది మరియు శక్తి వంతమైన ఆలయం. దుర్గా మాతకి బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 3.00PM TO 7.00PM.
3. శ్రీ శ్రీ శ్రీ భూనీలా సమేత వరదరాజ స్వామి ఆలయం , వరాదరాజ పురం :
ఈ ఆలయం 1350 లో నిర్మించబడినది. చాలా పురాతన ఆలయం. ప్రధాన దేవత మూర్తి వరాదరాజ స్వామి. ఆలయ ప్రాంగణంలో శ్రీ హనుమాన్ ఆలయం కూడా కలదు. ఆలయ ప్రాంగణంలో ఈ దేవాలయ శాసనాలను ఇప్పటికి దర్శించవచ్చు. ఇప్పుడు శిధిలావస్తా కి చేరుకున్నది.
ఆలయ దర్శించే సమయం : 8.00AM TO 12.00PM - 3.00PM TO 7.30PM.
4. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , కుచద్రి :
ఈ ఆలయం కుంచన్ పల్లి గ్రామం , మెదక్ లో కలదు. 2011 లో ఈ ఆలయాన్ని అప్పటి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. తొలి ఏకాదశి వైభవంగా జరుగుతుంది.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.
5. శ్రీ సప్త భవానీ ఆలయం :
ఈ ఆలయంలో అమ్మవారు భవానీ మాతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇస్లాం ఖాన్ అనే గ్రామం లో కలదు. నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
6. శ్రీ సరస్వతి ఆలయం , అనంత సాగర్ :
ఈ ఆలయం అనంత సాగర్ , చిన్న కోడూర్ మండలం సిద్దిపేట్ డివిజన్ లో కలదు. ఈ ఆలయని శుక్రవారం 2 మే 1980 లో రౌద్ర సం ||వైశాఖ నెల నరసింహ రాయ శర్మ గారిచే నిర్మించబడినది. హైదరాబాద్ నుంచి 125 కి. మీ దూరంలో మరియు మెదక్ కి 63 కి. మీ దూరంలో కలదు.
ఆలయ దర్శించే సమయం : 5.30AM TO 12.00PM - 3.30PM TO 7.00PM.
7. శ్రీ నరసింహ స్వామి ఆలయం , నాచారం :
ఈ ఆలయం నః -7 లో కలదు. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని సేత్త గిరి అని పిలిచే వారు. హరీంద్ర నది అనే ఆనకట్ట కూడా కలదు. హిరణ్య కాశ్యపపుని చంపిన తరువాత స్వామి కోపంతో ఉండడం వల్ల లక్ష్మీ దేవి ఇక్కడికి వచ్చి స్వామి వారి కోసం తపస్సు చేసినది అని ఇక్కడి ఆలయ చరిత్ర. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. 600 సం || చరిత్ర ఈ ఆలయానికి కలదు. మెదక్ నుంచి 45 కి. మీ దూరంలో కలదు.
ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.
8. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం , బీరం గూడ :
ఈ ఆలయం భీరం గూడ అనే గ్రామంలో అమినపూర్ కి దగ్గరలో కలదు. ఈ ఆలయాన్ని రెండవ శ్రీశైలం గా పిలుస్తారు. ఈ ఆలయం 13 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో అంతర్గత మార్గం నుంచి వెళ్ళితే శ్రీశైలం కి వెళ్ళవచ్చు. కానీ ఇప్పడు ఆ దారిని మూసివేశారు. స్తానీక ప్రజలు ఈ స్వామిని భీరప్ప స్వామిగా పిలుస్తారు. 1980 తరువాత ఈ ఆలయం అభివృద్ది చెందినది. శివరాత్రి ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు.
ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.00PM TO 8.00PM.
మెదక్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి.
Telangana Temples District Wise List
KeyWords : Medak Famous Temples List, Medak District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment