Drop Down Menus

Bhagavad Gita 1st Chapter 13-24 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు

నమస్కారం భగవద్గీత నేర్చుకోవడానికి వీలుగా హైందవి వారి సహాయం తో ఆడియో లో కూడా ఉంచడం జరిగింది. 
శ్రీమద్ భగవద్ గీత ప్రథమోఽధ్యాయః
అథ ప్రథమోఽధ్యాయః |

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |

సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ‖ 13 ‖

భావం : వెంటనే కౌరవవీరుల ధక్కమృదంగ గోముఖాది ధ్వనులతో ధిక్కులన్ని పిక్కటిల్లాయి.


తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |

మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదఘ్మతుః ‖ 14 ‖

భావం : అప్పడు తెల్లగుర్రాలు కట్టిన మహారధం మీద కూర్చున్న కృష్ణార్జునులు కూడా తమ దివ్య శంఖాలు పూరించారు. 

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |

పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ‖ 15 ‖
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |

నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ‖ 16 ‖
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ‖ 17 ‖
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందధ్ముః పృథక్పృథక్ ‖ 18 ‖
భావం : శ్రీకృష్ణుడు పాంచజన్యంతో, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌడ్రకం ఊదారు. ధర్మరాజు అనంత విజయం నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకాలు పురించారు. కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్ముడు, విరాటుడు, సాత్యకి , ద్రుపదుడు, ఉప పాండవులు, అభిమన్యుడు, తమ తమ శంఖాలు అని వైపులా ఊదారు.


స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్|

నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ‖ 19 ‖
భావం : ఆ శంఖ ద్వనులు భూమి ఆకాశాలను దద్ధరిల్లజేస్తూ, కౌరవ వీరుల హృదయాలను బద్ధలు చేశాయి. 


అథ వ్యవస్థితాందృష్ట్వా ధార్తరాష్ట్రాన్కపిధ్వజః |

ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ‖ 20 ‖
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే|
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ‖ 21 ‖

అర్జున ఉవాచ |

భావం : కురురాజా ! అప్పుడు అర్జునుడు యుద్దసన్నద్ధూలైన దుర్యోధనాదులను చూసి, గాండీవం ఎత్తినట్టి శ్రీ కృష్ణుడితో "అచ్యుతా రెండు సేనల మధ్య నా రధాన్ని నిలబెట్టు" అన్నాడు. 

యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్|కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే ‖ 22 ‖

యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః|
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ‖ 23 ‖

భావం : "కృష్ణా! శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడానికి సమర రంగానికి వచ్చిన వాళ్ళందరిని చూడాలనుకుంటున్నాను" అన్నాడు అర్జునాడు.  

సంజయ ఉవాచ |

ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ‖ 24 ‖

భావం : సంజాయుడు-ధృతరాష్ట్ర ! అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణుల ఎదురుగా రధం ఆపి, అక్కడకి చేరిన కౌరవ బలాన్ని అవలోకించమన్నాడు.1వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 1st chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.