శ్రీమద్ భగవద్ గీత ప్రథమోఽధ్యాయః
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ‖ 25 ‖
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ‖ 26 ‖
శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌంతేయః సర్వాన్బంధూనవస్థితాన్ ‖ 27 ‖
భావం : అప్పుడు అర్జునుడు ఉభయ సేనలలోను యుద్దానికి సిద్ధంగా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, బంధువులందరిని చూశాడు. చూసి మిక్కిలి దయగలిగి దుఖిఃస్తు విశేషకృపతరంగుడూ, విషాదవశుడు అయి ఇలా అన్నాడు.
అర్జున ఉవాచ |
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్|
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ‖ 28 ‖
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ‖ 29 ‖
గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ‖ 30 ‖
భావం : కృష్ణా ! యుద్దసక్తులై ఎదురుగా ఉన్న చూట్టాలను చూడగానే నా హావభావాలు తడబడ్తున్నాయి. నోరు ఎండిపోతున్నది. శరీరమంతా గగుర్పాటు కంపిస్తుంది. గాండీవనం చేతిలోనుంచి జరిపోతున్నది. దేహం మండుతున్నది. నిలబడడానికి కూడా శక్తి లేదు. నా మనస్సు తల్లాడిల్లుతున్నది.
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ‖ 31 ‖
భావం : కేశవా ! దుశ్శకునాలు కాన వస్తున్నాయి. యుద్దంలో బంధువులను చంపడం వల్ల కలిగే మేలు గోచరించడం లేదు.
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ‖ 32 ‖
భావం : కృష్ణా ! యుద్ద విజయం మీద, రాజ్యసుఖలామీద నాకు ఆసక్తి లేదు రాజ్య భోగలతో కుడిన జీవిత ప్రయోజనం ఏమి లేదు.
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ‖ 33 ‖
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ‖ 34 ‖
భావం : ఎవరి కోసం రాజ్యం, భోగం, సుఖం కోరుతున్నామో వాళ్ళంతా గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, మామలు, మనుములు, బావ, మరుదులు, ఇతర బంధువులు-ధనప్రాణాల మీద ఆశ వదిలి ఈ రణ రంగంలోనే వున్నారు.
ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ‖ 35 ‖
భావం : మధుసూదనా ! వాళ్ళు నన్ను చంపితే చంపని, ముల్లోకాలని ఏలే అవకాశం కలిగిన నేను మాత్రం వాళ్ళను వధించదలచుకోలేదు. అలాంటప్పుడు ఈ రాజ్యం కోసం వాళ్ళని చంపుతానా?
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ‖ 36 ‖
భావం : దుర్యోధనాదులను సంహరించి మనం పొందే సంతోషమేమిటి ? జనార్ధన! ఈ పాపాత్ములను చంపితే మనకూ పాపమే.
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad Gita Slokas with Audios in English Click Here
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Nice👍
ReplyDelete