Drop Down Menus

Bhagavad Gita 2nd Chapter 13-24 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు


శ్రీమద్ భగవద్ గీత ద్వితీయోఽధ్యాయః
అథ ద్వితీయోఽధ్యాయః |

దేహినోఽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ‖ 13 ‖


భావం : జీవిడికి ఈ శరీరం కౌమారం, యవ్వనం, వార్ధక్యం వచ్చినట్టే మరణానతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ‖ 14 ‖

భావం : కుంతీపుత్ర విషయాలకు వశమైన ఇంద్రియాలవల్ల శోతోష్టాది గుణాలు, సుఖదుఖఃలూ కలుగుతూంటాయి. కోరికలకు, ఇంద్రియాలకూ కలయిక ఆశాశ్వతం. కనుక ఓ భరతవీరా ! ఆ బాధలను సహించు.

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ‖ 15 ‖
భావం : పురుషవర్యా! శీతోష్ణ సుఖదుఖఃదులు ఎవడినో బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు.

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టోఽంతస్త్వనయోస్తత్త్వదర్శిభిః ‖ 16 ‖

భావం : లేనిది ఎప్పటికీ వుండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. రెండింటి నిర్ణయం త్తత్వజ్ఞులకే తెలుస్తుంది.


అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ‖ 17 ‖
భావం : ఈ విశ్వమంతటా వ్యాపించివున్న ఆత్మవస్తువు నాశనం లేనిది. దానినెవారు అంతం చేయలేరు.

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ‖ 18 ‖
భావం : నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలూ కావు. ఆత్మ ఒక్కటే నిత్యం. కనుక ఓ భారత వీర!యుద్దం మొదలు పెట్టు.

య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ‖ 19 ‖
భావం : ఈ ఆత్మ చంపుతుందని కానీ, చంపబడుతుంది అని కానీ భావించే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. ఆత్మ చంపేది కానీ చచ్చేది కానీ కాదు.

న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ‖ 20 ‖
భావం : ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒక్కప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహిత్యమూ, శాశ్వతమూ ,అనాది సిద్దమూ, అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనంచేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు.


వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
అథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ‖ 21‖
భావం : పార్ధ! ఆత్మ నాశనరహితమని , చావు పుట్టుకలు లేనిదని, శాశ్వతమైనదని తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు? ఎలా చంపిస్తాడు.

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ‖ 22 ‖
భావం : మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్టే ఆత్మ కృశించిన శరీరాలను వదిలి కొత్త దేహాలను పొందుతుంది.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ‖ 23 ‖
భావం : ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు. అగ్ని కాల్చలేదు. నీరు తడుపలేదు. గాలి ఎండబెట్టలేదు.

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ‖ 24 ‖
భావం : ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది, అది నిత్యం సర్వావ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం.2వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 2nd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. ఓం! ఈ పద్ధతిలో భగవద్గీతను ఇవ్వడం చాల బాగుంది. ఆడియో ఉన్నందున ప్రస్తుతకాలంలో చాల ఉపయోగిస్తుంది. ప్రెజెంటేషన్, శ్లోకాన్ని గానం చేసే పద్ధతి బాగున్నాయి. భావం వ్రాయడంలో స్పెల్లింగ్ / అచ్చు తప్పులు ఉన్నాయి. ఉపయోగించిన స్క్రిప్టులో 'యో' వంటి తప్పులున్నాయి. ఈ లోపాల్ని సవరిస్తే చాల ఉపయోగకరంగా ఉంటుంది.

  ReplyDelete
 2. ఓం! ఈ పద్ధతిలో భగవద్గీతను ఇవ్వడం చాల బాగుంది. ఆడియో ఉన్నందున ప్రస్తుతకాలంలో చాల ఉపయోగిస్తుంది. ప్రెజెంటేషన్, శ్లోకాన్ని గానం చేసే పద్ధతి బాగున్నాయి. భావం వ్రాయడంలో స్పెల్లింగ్ / అచ్చు తప్పులు ఉన్నాయి. ఉపయోగించిన స్క్రిప్టులో 'యో' వంటి తప్పులున్నాయి. ఈ లోపాల్ని సవరిస్తే చాల ఉపయోగకరంగా ఉంటుంది.

  ReplyDelete
 3. చాలా బాగుదండి.మీ ప్రయత్నానికి జోహార్లు.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.