Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 3rd Chapter 1-11 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 

శ్రీమద్ భగవద్ గీత తృతీయోఽధ్యాయః
అథ తృతీయోఽధ్యాయః |
అర్జున ఉవాచ |
జ్యాయసీ చే త్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన |
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ‖ 1 ‖


భావం : అర్జునుడు : జనార్ధన ! కర్మకంటే జ్ఞానమే మేలని ని వుద్దేశమా? అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్దకర్మ కు నన్నెందుకు వురికొల్పుతున్నావు ?

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే |
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ‖ 2 ‖
భావం : అటుయిటూ కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలగజేస్తున్నావు. అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు.
శ్రీభగవానువాచ |

లోకేఽస్మింద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ |
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ‖ 3 ‖
భావం : శ్రీ కృష్ణా భగవానుడు : అర్జునా ! గతంలో నేను చెప్పిన రెండు మార్గాలూ లోకంలో వున్నాయి. అవి సాంఖ్యూలకు జ్ఞానయోగం, యోగులకు నిష్కామ కర్మయోగం.

న కర్మణామనారంభాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే |
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ‖ 4 ‖
భావం : కర్మలు చేయనంతమాత్రాన పురుషుడు కర్మ బంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మసన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు.న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ |
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ‖ 5 ‖
భావం : కర్మలు చేయకుండా ఎవడూ ఒక్క క్షణం కూడా వుండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనై ప్రతివాళ్ళు అస్వతంత్రులై కర్మలు చేస్తునే వున్నారు.

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ‖ 6 ‖
భావం : పైకి అని కర్మేంద్రియాలనూ అణిచిపెట్టి మనసులో మాత్రం విషయ సౌఖ్యల గురించి ఆలోచించే ఆవివేకిని కపటాచారం కలవాడు అంటారు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున |
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ‖ 7 ‖
భావం : అర్జునా! మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలోకి పుంచుకొని, కర్మేంద్రియాల ద్వారా నిష్కామకర్మ చేస్తున్నవాడు ఉత్తముడు.

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః |
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ‖ 8 ‖

భావం : నీ కర్తవ్యకర్మ నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడమే శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్రకూడా సాగించలేవు.

యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః |
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ‖ 9 ‖
భావం : కుంతీపుత్ర! యాగసంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్ని మానవులకు సంసారబంధం కలగజేస్తాయి. కనుక ఫలా పేక్ష లేకుండా దైవప్రతి కోసం కర్మలు ఆచరించు.

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ‖ 10 ‖
భావం : ప్రాచీనకాలంలో ప్రజలనూ, యాగలను సృష్టించి ప్రజాపతి ఇలా అన్నాడు. యజ్ఞం కోర్కెలను నెరవేర్చే కామధేనువు. దీనివల్ల మీరు పురోభివృద్ది చెందండి.


దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ‖ 11 ‖
భావం : యజ్ఞయాగాదులతో మీరు దేవతలను సంతృప్తి పరచండి. పాడిపంటలు లాంటివి సమవృద్ధూలిచ్చి వారు మీకు సంతోషం కలగజేస్తారు. పరస్పర సద్భావం పరమ శ్రేయస్సు మీకు చేకూర్చుతుంది.
3వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 3rd chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments