18th Question :
ప్రశ్న ) నా ప్రయత్నానికి సత్ఫలితాలు కలిగాయి. సాధించానని అహం భావం నాలో అంకురించింది. ప్రయత్నాలు విఫలమైనయి. ఎంతో బాధకలిగింది. జన్మే వ్యర్ధమనిపించింది. దైవాన్ని లోకాన్ని నిందించాను. ఇంకా ఏ ప్రయత్నం చేయనే కూడదనుకున్నాను నా ఆలోచన మంచిదేనా ?
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోఽస్త్వకర్మణి ‖ (2వ అ - 47వ శ్లో)
జవాబు : మి ఆలోచన సరైంది కాదు. సత్ఫలితాలకు కాని దుష్పలితాలకుగాని మి ప్రయత్నాలు మాత్రమే కారణమనుకోకండి. పనులు జరిగితే ఉబ్బి తబ్బిబ్బులు కావడం అహంకారపడటం, లేక పని జరగపోతే నిలువునా కుంగిపోవడం మిమ్ములను నిందించుకొని దేవుణ్ణి, లోకాన్ని దూషించడం మీ బలహీనత. 'ఫలితం వస్తుందా ? రాదా ? ' వస్తే ఏం వస్తుంది ? అనే ఆలోచనలు లేకుండా మి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడం పలుకే మి ధర్మం. ఫలాప్రాప్తి మి చెత్తుల్లో లేదు. కనుక ఫలితాన్ని ముందే ఆశించకండి. అట్లా అని మికర్తవ్యం వదిలి కర్మరహితులై సోమురులు కూడా కాకూడదు. మికివ్వవలసిన ఫలితాన్ని మి ప్రారబ్దన్ననుసరించి భగవంతుడెలాగు ఇస్తాడు. ఇలాంటి భావనతో కర్మల నాచ్చరిస్తే మీకు శాంతి ఉంటుంది. సమాజానికి మీవల్ల ఇబ్బంది ఉండదు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Tags
Bhagavad Gita Q&S