ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 10th Question
10th Question :
ప్రశ్న ) మన శరీరాన్ని పృధివి, జలం, తేజస్సు, వాయువు ఏమైనా చేయగలవు. అందుకే మనం ఈ భూతాలకు భయపడిపోతాం. మరి ఆత్మ కూడా అంతేనా ? లేక శరీరానికి ఆత్మకు తేడా ఉందా ?
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ‖ (2వ అ - 23వ శ్లో)
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ‖ (2వ అ - 24వ శ్లో)
జవాబు : శరీరానికి ఆత్మకు పోలికే లేదు. శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయగలవు. కానీ ఆత్మను ఏమి చేయలేవు. శాస్త్రాలు శరీరాన్ని నరికివేస్తాయి. ఆత్మను ఖండిచలేవు. నిప్పు శరీరాన్ని బూడిద చేసివేస్తుంది. కానీ ఆత్మను అంటుకోలేదు. నీళ్ళు శరీరాన్ని తడిపి వేయగలవు. కానీ ఆత్మనేమి చేయలేవు. గాలి శరీరాన్ని ఎండించగలదు. ఆత్మనేమి చేయలేదు. కనుక మన ఆత్మ నరకడానికి వీల్లేనిది. తగులబెట్టడానికి వీల్లేనిది. తడపడానికి వీల్లేనిది. ఎండించడానికి వీల్లేనిది. ఇది నిత్యం. అంతటను ఉంటుంది. స్థిరం, అచలం, సనతనమై ఉంటుంది. కనుక దీన్ని దగ్గర బాహ్యభూతవికారాలు పని చేయవు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment