ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 27th Question


27th Question :
ప్రశ్న )  నా మనస్సు చాలా దుర్బలంగా ఉంది. దాన్ని కట్టుబాటు చేసుకోలేక పోతున్నాను ఇంద్రియాల వాటి వాటి విషయాల వెంట పరుగెడుతున్నాయి. మనస్సు ఇంద్రియాల వెంట పరుగెడుతుంది. మంచి చెడులను నిర్ణయించుకోలేక పోతున్నాను. స్థిరమైన ఏ నిర్ణయాన్ని తీసుకోలేక పోతున్నాను. అమలు జరపలేక పోతున్నాను. నేనేం చేయాలి ? 

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ‖ (2వ అ - 67వ శ్లో)

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ‖ (2వ అ - 68వ శ్లో)

జవాబు : మీ ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. నిజానికి మీ మనస్సు వాటిని నిరోదించాలి. కానీ అలా కాకుండా వాటితో చెరిపోయింది మనస్సు.  ఇంద్రియాలు భౌతికవిషయాసుఖలకు లొంగిపోయిన్నాయి.  చుక్రనిలేని నావను గాలి తన ఇష్టం వచ్చిన్నట్లు ఏదో ఒక పక్కకు తిప్పవేస్తుంది. అందుకనే మీరు ఏది స్థిరంగా నిర్ణయించుకోలేక పోవడం, అమలు జరపలేకపోవడం ఏర్పడుతున్నది. కనుక మీరు భౌతిక విషయాలకు దాస్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి నిగ్రహించండి. మనస్సు దానంతట అదే దోవలోకొస్తుంది. అప్పుడే మీరు స్థితాప్రజ్ఞులౌతారు. 


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

Comments