శ్రీ నైనా దేవి ఆలయం | హిమాచల్ ప్రదేశ్ | Sri Naina Devi Temple Information | Himachal Pradesh | Hindu Temples Guide

శ్రీ నైనా దేవి ఆలయం, హిమాచల్ ప్రదేశ్ :

శ్రీ నైనాదేవి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అమ్మవారి ఆలయాలలో ఈ ఆలయం కూడా చాలా ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయం బయట నుంచి చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ అమ్మవారు చాలా శక్తివంతమైన ఆలయం. నైనాదేవి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో కొండ పైన ఉన్నది. ఈ దేవాలయం జాతీయ రహదారి 21 మార్గంలో ఉంటుంది. ఈ కొండపై ఉన్నఈ దేవాలయాన్ని చేరుకొనుటకు రోడ్డు మార్గం ద్వారా మాత్రమే వెళ్ళే అవకాశం ఉన్నది. కొంత పైకి వెళ్ళీన తరువాత మల్లి అక్కడి నుంచి కొంతభాగం మెట్లద్వారా పైకి వెళ్ళవలసి ఉంటుంది.వయో వృద్దుల కొరకు ప్రత్యేకంగా కేబుల్ కార్ ల సదుపాయం కూడా ఆలయం వారు ఏర్పాటు చేశారు. ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన గంట కలదు. హారతి సమయంలో మాత్రమే ఈ గంటా నాదం మొగిస్తారు.

ఆలయ చరిత్ర : 

ఈ దేవాలయం ఒక నైనా అనే గుజ్జార్ బాలునితో ముడిపడి ఉంది. ఒకనాడు ఆ బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతి పై తన పొదుగు ద్వారా పాలను కారుస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చాలా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలునికి కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా ఈ కల యొక్క వృత్తాంతాన్ని ఆ ప్రాంత రాజు బీర్ చంద్ కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానికి నైనా యొక్క పేరును పెట్టాడు. కానీ చాలా మంది ఈ ఆలయం 51 శక్తి పీఠం లలో ఒకటి అని కూడా నమ్ముతారు.


నైనాదేవి ఆలయం మహిష పీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే మహిసాసురుడనే రాక్షసుడిని ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిసాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిసాసురుడు ప్రజలను హింసిస్తుంటాడు. ఈ సంఘటనతో మహిసాసురుడిని అంతమొందించుటకు అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గ అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిసాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడవలసినదిగా కోరుతాడు. ఆమె తన కంటే శక్తివంతుడిని వివాహమాడతానని చెబుతుంది. జరిగిన యుద్ధంలో ఆమె రాక్షసుడిని ఓడించి ఆయన కళ్ళను తొలగిస్తుంది. ఈ చర్య దేవతలకు సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషంతో ఆరు "జై నైనా" అనే నినాదాలనిస్తారు. అందువలన ఆ ప్రాంతం నైనా గా స్థిరపడింది.

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 6.00 - 12.00
సాయంత్రం : 3.30 - 7.30

వసతి సౌకర్యాలు :

ఈ ఆలయా కొండ క్రింద కొద్ది దూరంలోనే ప్రైవేట్ హోటల్ లు కలవు.

ఆలయానికి చేరుకునే విధానం :

రోడ్డు మార్గం :

ఈ ఆలయానికి దగ్గరలో నైనితాల్ అనే బస్ స్టాండ్ కలదు.  ఇక్కడి నుంచి ఈ ఆలయానికి కేవలం 4కి.మీ దూరంలో కలదు.

రైలు మార్గం :

సమీప రైల్వే స్టేషన్ అయిన ఆనందపూర్ సాహిబ్ అనే  రైల్వే స్టేషన్ అనే రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుంచి అనేక ప్రైవేట్ వాహనాలు  ఆలయానికి చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్టేషన్ నుంచి ఈ ఆలయానికి 35 కి. మీ దూరంలో కలదు.

విమాన మార్గం :

చండీగర్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం ఇక్కడి నుంచి కార్ లేదా ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.ఈ విమానాశ్రయం నుంచి ఈ ఆలయానికి 98 కి. మీ దూరంలో కలదు.

ఆలయ చిరునామా :

శ్రీ నైనా దేవి ఆలయం
బిలాస్ పూర్ జిల్లా
హిమాచల్ ప్రదేశ్
పిన్ కోడ్ - 174310

Key Words : Sri Naina Devi Temple Information, Famous Temples In Himachal Pradesh, Hindu Temples Guide

Comments