శ్రీ వీరభద్ర దండకం స్తోత్రం | Sri Virabhadra Dandaka Stotram | Hindu Temples Guide

శ్రీ వీరభద్ర దండకం స్తోత్రం : 

శ్రీ భద్ర | భద్రాంబికాప్రాణనాథా | సురారాతిభంగా | ప్రభో |
రుద్ర | రౌద్రావతారా | సునాసీర ముఖ్యామరానేక సంభావితానల్ప
సుశ్లోకచారిత్ర | కోట్యర్కసంకాశ దేదీప్యమానప్రభా | దివ్యగాత్రా
శివా | పాలితాశేషబ్రహ్మాండభాండోదరా | మేరుధీరా | విరాడ్రూప |
వారాశిగంభీర | సౌజన్యరత్నాకరా | వారిదశ్యామ | నారాయణధ్యేయ
మౌనీంద్రచిత్తాబ్జభృంగా | సురారాతిభంగా | మహోదార |
భక్తౌఘకల్పద్రుమా | శిష్టరక్షా | ప్రశస్తప్రతాపోజ్జ్వలా |
శ్రీకరా | భీకరా | భీకరాలోక | చూర్ణీకృతార్యేషు దోర్దండ పాండిత్య
సంరంభణోల్లాస | రాజత్కరాంభోజ విన్యస్త ఖడ్గత్రిశూలాదినానాయుధా |
భండనాచార్య | రుద్రాక్షమాలాలసద్దేహ | రత్నాంచితానర్ఘ సౌవర్ణ
కేయూర భాస్వత్ కిరీటోత్తమాంగా | త్రిపుండ్రాంక సర్వాంగసంశోభితా
చంద్రకోటీర | హేమాంబరాడంబరా | దైవచూడామణీ | సంతతాఖండ |
దీర్ఘాయురారోగ్యసౌభాగ్యసిద్ధిప్రదా | దేవ | తాపత్రయధ్వాంతభానూ |
వియత్కేశ | మృత్యుంజయా | దీనచింతామణీ | సర్వలోకేశ | లోకాత్మ |
లోకస్వరూపా | మహాయజ్ఞవిధ్వంసనాధ్యక్ష | దాక్షాయణీపుత్ర |
అక్షీణపుణ్యా | విభో | వీరభద్రా | మహాకాలరుద్రా | కృపాముద్ర |
మాం పాహి దీనబంధో | దయావారిరాశీ | లసచ్చిత్రభూషా |
మహాదివ్యవేషా | హరా | భక్తపోషా | దయావార్థి | వీరేశ్వరా |
నిత్యకల్యాణసంధానధౌరేయ | పాపాటవీ కీల దావానలా |
పుణ్యమూర్తే | నమస్తే నమస్తే నమస్తే నమః ||

ఇతి శ్రీ వీరభద్రదండకం సంపూర్ణం.

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Key Words : Sri Veerabhadra Dandakam, Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide

Comments