Drop Down Menus

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు| What should husband do when wife is pregnant?

భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు ఏంటో తెలుసా..?
భార్య గ‌ర్భంతో ఉందంటే చాలు భ‌ర్త ఎంతో సంతోషిస్తాడు. భ‌ర్తే కాదు, అత‌ని త‌ర‌ఫు వారు, ఆమె తర‌ఫు వారు ఎంతో సంద‌డి చేస్తారు. ప్ర‌ధానంగా హిందువుల్లో అయితే శ్రీ‌మంతం వంటి శుభ‌కార్యాలు నిర్వ‌హిస్తారు.
భార్య గర్భం దాల్చిన తరువాత భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదు అని మన పురాణాలు చెప్తున్నాయి. భార్య గర్భం దాల్చిన దగ్గర నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది. భర్త కూడా తన భార్య తోనే ఎక్కువగా సమయం కేటాయిస్తే తల్లికి,పుట్టబోయే బిడ్డకు ఎంతో మంచిది. భార్య గర్భవతి గా ఉన్నపుడు తన కోర్కెలను తప్పకుండా భర్త తీర్చాలి.ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యం గా పుడుతుంది. 
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అలా చేస్తే అరిష్ట‌మ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి స‌మ‌యంలో భ‌ర్తలు చేయకూడ‌ని ఆ ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త స‌ముద్ర స్నానం చేయ‌కూడ‌దు. అలాగే చెట్ల‌ను కూడా న‌ర‌క‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే పుట్టే బిడ్డ‌కు అరిష్టం క‌లుగుతుంద‌ట‌.

2.భార్య కు 7 నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు క్షవరం(గడ్డం) చేయించుకోకూడదు. 
3. శ్మ‌శానాల‌కు శవాల‌ను తీసుకెళ్లే అంతిమ యాత్ర‌లో శ‌వాలను మోయ‌కూడ‌దు. అలా చేస్తే అరిష్టం చుట్టుకుంటుంద‌ట‌.

4. భార్య ప్రెగ్నెంట్ అయ్యాక భ‌ర్త వితీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయరాదు. అస్స‌లు ఆమెను విడిచి దూరంగా పోకూడ‌ద‌ట‌.
5. భార్య గర్భం దాల్చిన 7వ‌ నెల మొదలైనప్పటి నుండి తీర్థయాత్రల‌కు వెళ్ల‌కూడ‌ద‌ట‌. అలాగే ప‌డ‌వ‌లను ఎక్కకూడ‌ద‌ట‌.

6. పర్వతారోహణము చేయ‌కూడ‌దు. యుద్దము చేయ‌డం మానేయాలి. ఇంటికి స్తంభ ముహూర్తము పెట్టించ‌కూడ‌దు. గృహ ప్ర‌వేశం చేయ‌కూడ‌దు. వాస్తుక‌ర్మ నిర్వ‌హించ‌రాదు. ఈ ప‌నుల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది.
7. శవాన్ని అనుసరించి వెళ్ళరాదు. అంటే శ‌వ‌యాత్ర‌లోనూ పాల్గొన‌రాదు. దీంతోపాటు ప్రేత కర్మలు చేయకూడద‌ట. ఇంకా ఉపశమనం, పిండదానం వంటి పనులు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ట‌.
పైన చెప్పినవి భార్య గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త చేయ‌కూడ‌ని ప‌నులు. అలాగే చేయాల్సిన పని ఒక‌టి ఉంది. అదేమిటంటే… ఆ స‌మ‌యంలో భార్య ఏది అడిగితే అది భ‌ర్త తెచ్చివ్వాల‌ట‌. అలా చేస్తేనే ఆమె సంతోషంగా ఉండి త‌ద్వారా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంద‌ట‌.
Famous Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

భార్య భర్త, ప్రెగ్నెంట్, భార్య కడుపుతో ఉన్నప్పుడు, husband care during pregnancy, husband responsibilities during pregnancy, Seemantham, Pregnancy Tips Telugu, Importance of Husband and Wife Relationship, tips for pregnant women, Wife and Husband.
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FOLLOW US ON