మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? Why do South Indians avoid giving money on Tuesdays and Fridays?
మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు.
ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. కొందరు మంగళవారం, శుక్రవారం ఎవరికీ డబ్బు ఇవ్వరు, కొందరు బూజులు కూడా దులపరు, కొందరు పుట్టింటినుంచి ఆడపిల్లని పంపరు. ఆడపిల్లని ఇంటి లక్ష్మీ దేవిగా భావిస్తారు. అందుకే లక్ష్మీదేవి వారాలుగా పూజ చేసే ఆ రెండు రోజులూ డబ్బులివ్వటంగానీ, అమ్మాయిని పంపటంగానీ చెయ్యరు.
తమ ఇంటి సిరి సంపదలు పోతాయనే నమ్మకంతో. మరి బూజులు దులపక పోవటానికి కూడా ఒక కధ చెప్తారు. శ్రీ కాళ హస్తీశ్వరుని కధ అందరికీ తెలిసిందే కదా. శ్రీ అంటే సాలె పురుగు, పాము, ఏనుగు శివునికి పూజలు చేసి మెప్పిస్తాయి కదూ. శ్రీ అంటే లక్ష్మి అని కూడా అర్ధం వుంది. బూజులు, అంటే సాలె పురుగులు కట్టిన గూళ్ళు కదా వాటిని తీసి ఆ శ్రీలకి ఎందుకా రోజుల్లో అపచారం చెయ్యాలని బూజులు దులపరు.
ఇవి పాటించవలసిన విషయాలేనా? ఇందులో ఎంత వరకూ నిజం వుంది? బూజుల సంగతి వదిలేద్దాం. ఎందుకంటే ఆ రెండు రోజులూ కాకపోతే వేరే రోజుల్లో దులుపుకోవచ్చు. మరి డబ్బుల సంగతేమిటి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళ, శుక్రవారాలలో డబ్బులు ఇవ్వటం మంచిదా..?
సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు చేస్తారు. కనీసం ఆ రెండు రోజైలైనా ఆ సోమరితనాన్ని ఆపాలన్న ప్రయత్నము..అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు. ధనాన్ని అదుపు చేయటానికి ఇది మంచి పద్ధతే అయినా మనకి గానీ, ఇతరుకి గానీ ఆపదసమయాల్లో ఈ నియమం పనికిరాదు. ఇలా చేయ్యటం వల్ల మరింత ధనం పోతుంది.
ఆ రోజుకి మళ్ళీ మళ్ళీ చేయించే గుణం వుందిట. అందుకే బ్యాక్ ఎక్కౌంటు తెరిచి డబ్బు దాచుకోదలిచారా? మంగళవారం నాడు చెయ్యండి. ఆ ఎక్కౌంటు లో మళ్ళీ మళ్ళీ డబ్బు వేస్తూనే వుంటారు.
అలాగే ఎక్కువ అప్పు ఏమైనా వుండి కొద్ది కొద్దిగా తీరుద్దామనుకున్నారా? మంగళవారం నాడు తీర్చండి. తొందరలోనే మళ్ళీ మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతారు, త్వరలో ఋణ విముక్తులవుతారు.
ఫ్రాంతాలవారీగా కూడా ఈ నమ్మకాలు మారుతూ వుంటాయి. కొందరు మంగళ, శుక్రవారాలు పాటించినట్లు నిజామాబాదు వైపు కొందరు బుధవారం నాడు, విశాఖ పట్టణం వారు గురువారం నాడు డబ్బు ఇవ్వరు. అంటే వారు ఆ రోజుల్లో లక్ష్మీ పూజ చేస్తారు. అలాగే కొన్ని గ్రామీణ బ్యాంకులు బుధవారం నాడు పని చెయ్యవు. ఎవరి నమ్మకాలూ, ఆచారాలూ వారివి.
అయితే మనకి వారాల పట్టింపు వుందని ఏ పని మనిషో నెలంతా పని చేసి ఆ రోజుల్లో డబ్బులడిగితే ఇవ్వటం మానెయ్యకూడదు. ఎందుకంటే అది వారి డబ్బు. వారు పని చెయ్యటం వల్ల సంపాదిచుకున్న డబ్బు. మనం వారికి బాకీ వున్నాము. దానికి వార వర్జ్యాలు చూడకుండా ఇచ్చెయ్యాలి.
ఏ రోజైనా ఉదయ, సాయం సంధ్యా సమయాలలోనూ, పూజ చెయ్యగానేనూ సంపదని ఇంటినుంచి పంపకూడదు.
అంటే మనమేదైనా కొనుక్కోవటానికి మూల ధనాన్ని ఖర్చు చెయ్యకూడదు. కానీ కష్టపడ్డవారికి డబ్బు ఇవ్వటానికి సంశయించ కూడదు.
అందుకే ఈ రెండు రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వరు. ఇది పూర్తిగా అశాస్త్రీయమైన వాదన. వాస్తవానికి మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, సొంతానికి, కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టవచ్చు. ఇలాంటి నియమాలు ప్రజలు నమ్మినంత కాలం సాగుతూనే ఉంటాయి.
Related Posts:
> యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి
> బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ?
which day is best to clear debt, best day to give money, Thursday, Friday, Hindu customs and beliefs, lakshmi devi
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment