Drop Down Menus

Tiruppavai Pashuram Day 9 in Telugu - Meaning | తిరుప్పావై తొమ్మిదవ రోజు పాశురం - పద్యం మరియు భావము

Thiruppavai 9 Pasuram Lyrics in Telugu

9.పాశురము

తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్ మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్ ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ? మామాయన్ మాధవన్ వైకున్టన్ ఎన్రన్రు. నామమ్ పలవుమ్ నవిన్దేలో రెమ్బావాయ్

భావము: నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ లేవకుండగ నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె ఎవరినైన కావలి వుంచినారా?లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు?

 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.

1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:

తిరుప్పావై 1వ పాశురం

తిరుప్పావై 2వ పాశురం

తిరుప్పావై 3వ పాశురం

తిరుప్పావై 4వ పాశురం

తిరుప్పావై 5వ పాశురం

తిరుప్పావై 6వ పాశురం

తిరుప్పావై 7వ పాశురం

తిరుప్పావై 8వ పాశురం

తిరుప్పావై 9వ పాశురం

తిరుప్పావై 10వ పాశురం

తిరుప్పావై 11వ పాశురం

తిరుప్పావై 12వ పాశురం

తిరుప్పావై 13వ పాశురం

తిరుప్పావై 14వ పాశురం

తిరుప్పావై 15వ పాశురం

తిరుప్పావై 16వ పాశురం

తిరుప్పావై 17వ పాశురం

తిరుప్పావై 18వ పాశురం

తిరుప్పావై 19వ పాశురం

తిరుప్పావై 20వ పాశురం

తిరుప్పావై 21వ పాశురం

తిరుప్పావై 22వ పాశురం

తిరుప్పావై 23వ పాశురం

తిరుప్పావై 24వ పాశురం

తిరుప్పావై 25వ పాశురం

తిరుప్పావై 26వ పాశురం

తిరుప్పావై 27వ పాశురం

తిరుప్పావై 28వ పాశురం

తిరుప్పావై 29వ పాశురం

తిరుప్పావై 30వ పాశురం

Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 9వ పాశురం

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.