ఓక నెల పాటు ప్రతి రోజు 5 ఖర్జూరాలు తింటే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం | Amazing Health Benefits of Dates
ప్రపంచంలోకెల్లా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంలో ఖర్జూర ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు, బీపీ కూడా అదుపులో ఉంటుంది. మంచి పోషకాలను అందించడంతో పాటుగా ఆరోగ్యకరంగా బరువు తగ్గడంలో ఖర్జూరం ఎంతగానో తోడ్పడుతుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తం పుష్కలంగా వస్తుంది. సాధారణ ఖర్జూరం పండ్లలాగే ఎండ బెట్టిన ఖర్జూరాలూ మనకు ఎంతగానో ఉపయోపడతాయి. నిత్యం 5 ఎండు ఖర్జూరాలను ఉదయాన్నే పరగడుపున (బ్రష్ చేసిన వెంటనే) నెలరోజుల పాటు తింటే అద్భుతమైన ఆరోగ్య సొంతమవుతుంది.
ప్రయోజనాలు:
* ఎండు ఖర్జూర పండ్లను ఉదయాన్నే తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి.
* మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రాశయ సంబంధ సమస్యలన్నీ పోతాయి.
* పెద్ద పేగులో ఉండే సమస్యలు తొలగిపోతాయి. జీర్ణం సూపర్ ఫాస్ట్ అవుతుంది.
* డైటరీ ఫైబర్ అధికంగా లభించడం వల్ల విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం సమస్య ఉన్న వారికి మేలు చేస్తుంది.
* రాత్రి పూట కొన్ని ఖర్జూరాలను నీటిలో వేసి తెల్లవారాక ఆ నీటిని తాగితే విరేచనం సాఫీగా అవుతుంది.
* గొంతు నొప్పి, మంట, జలుబు లాంటి సమస్యలు తొలగిపోతాయి.
* 100 గ్రాముల ఖర్జూరలో 0.90 ఎంజీ ఐరన్ లభిస్తుంది. రోజులో మనకు అవసరమయ్యే ఐరన్‌లో ఇది 11 శాతానికి సమానం.
* బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
* అసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
* విటమిన్ బి5 ఎక్కువగా ఉండడం వల్ల చర్మానికి మేలు జరుగుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టం తగ్గుతుంది. వృద్ధాప్యం కారణంగా చర్మంపై వచ్చే ముడతలు తగ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
* వెంట్రుకలు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి.
* ఖర్జూర పండ్లలో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. ఇది డయేరియా రాకుండా చూడటంలో తోడ్పడుతుంది.
* వీటిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి బరువు తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
* అయితే వీటిలో చక్కెర ఉంటుంది కాబట్టి పరిమితంగానే తీసుకోవడం మంచిది.
Famous Posts:
> రోజు రెండు యాలకులు తింటే ఇన్ని ప్రయోజనాలా ?
> నిమ్మరసం ఎక్కువగా తాగితే డేంజర్
> నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
benefits of dates for men, how many dates to eat per day, benefits of dates with milk at night, dates benefits for skin, side effects of dates, benefits of dates for women's, dry dates benefits, best time to eat dates, ఖర్జూరం, ఆరోగ్య ప్రయోజనాలు
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment