భర్తలు తమ భార్యలకు చెప్పకూడని నాలుగు విషయాలు ఏమిటో తెలుసా?
జీవిత సత్యాలను.. జీవితంలో అందరూ పాటించదగ్గ మంచి విషయాలనూ ఆచార్య చాణక్య చాలా చక్కగా చెప్పారు.
కాలంతో సంబంధం లేని విధంగా చాణక్య నీతి ఎప్పుడూ అందరికీ చక్కని దారి చూపిస్తుంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చాణక్యుడు అప్పుడు చెప్పిన మాటలు ఎప్పుడూ ఆచరణీయంగా ఉంటాయి. ముఖ్యంగా మానవుల వ్యవహార శైలికి సంబంధించి ఆచార్య చాణక్య చెప్పిన ప్రతి పలుకూ ఎప్పుడూ వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఒక మనిషి ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించకూడదు? ఏది ఎప్పుడు ఎందుకు ఎలా చేయాలి? అనే విషయాలను ఆయా సందర్భాలను బట్టి ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఇక భార్యలతో భర్తలు ఎలా ఉంటే మంచిది అనే విషయంలో పలు సూచనలు ఇచ్చారు చాణక్య. ఒక భర్త తనకు సంబంధించిన నాలుగు విషయాల గురించి ఎప్పుడూ తన భార్య దగ్గర ప్రస్తావించకూడదు. అందువల్ల ఇబ్బందులు వస్తాయి అంటారు. మరి ఆచార్య చాణక్య ప్రకారం భర్త తన గురించి భార్యకు చెప్పకూడని నాలుగు విషయాలు ఏమిటంటే..
Also Read : ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే..
ఆదాయం:
భర్త తన సంపాదన ఎంతో భార్యకు చెప్పకూడదు అంటారు ఆచార్య చాణక్య. భర్త ఆదాయం భార్యకు తెలిస్తే ఇంట్లో దుబారా ఖర్చులు పెరిగిపోతాయట. ఒక్కోసారి ఈ ఖర్చు ఆదాయాన్ని మించి అయిపోయే అవకాశం ఉంటుంది. తన భర్త ఆదాయం ఎక్కువ అని తెలిసిన భార్య ఎక్కువ ఖర్చు పెట్టడం ప్రారంభిస్తుందని అంటారు ఆచార్య చాణక్య. అందుకే భర్త తన సంపాదన ఎంతనేది భార్యకు చెప్పకూడదు అంటారు.
బలహీనత:
ప్రతి మనిషికీ ఒక బలహీనత ఉంటుంది. అటువంటి బలహీనత గురించి తన భార్యకు ఎప్పటికీ తెలియనివ్వకూడదు భర్త. ఎందుకంటే, సాధారణంగా భార్య తన భర్త బలహీనతలను పదే పదే ప్రస్తావిస్తుంది. అది ఒకవేళ ఆ బలహీనతను అధిగమించాలని భర్త అనుకున్నా ఆదిశలో అడుగు ముందుకు పడనీయకుండా చేస్తుంది. అదేవిధంగా భార్య పదే పదే భర్తకు గుర్తు చేస్తే ఆత్మన్యూనతా భావం ఆ భర్తలో కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది.
పొందిన అవమానం:
ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను పొందిన అవమానాన్ని భార్యకు తెలియనివ్వకూడదు. ఎప్పుడైతే తాను అవమానించ బడినట్టు తన భార్యకు తెలుస్తుందో.. ఆ భార్య తన భర్తను చులకనగా చూడటం ప్రారంభిస్తుంది. ఇది దాంపత్యంలో పోరాపొచ్చాలకు దారితీస్తుంది. బయట పొందిన అవమానం కంటె ఎక్కువ రెట్లు భార్య దగ్గర అవమానంపాలు కావాల్సి వస్తుంది. అంతేకాదు.. దానిని గుర్తుచేస్తూ భార్య ఆటపట్టించే అవకాశం కూడా ఉంది. ఇది దారుణ పరిస్థితి కలుగ చేస్తుంది. అందువల్ల తాను పొందిన అవమానాన్ని భార్యకు తెలియకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
చేద్దామనుకునే సహాయం:
మీరు ఎవరికైనా సహాయం చేయదల్చుకుంటే అది నిశ్శబ్దంగా చేసేయండి. మీ భార్యకు మాత్రం చెప్పకండి అంటారు ఆచార్య చాణక్య. ఒక భర్త తాను చేయాలనుకున్న సహాయాన్ని భార్య వద్ద చెబితే సమస్యలు ఎదురవుతాయి. సహాయాన్ని చేయనీయకుండా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి భర్త సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా.. భార్య ఎవరికైనా సహాయం చేయాలి అని కోరవచ్చు. అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది.
అందుకే ఎవరికైనా సహాయం చేయడం లేదా బహుమతి ఇవ్వాలని అనుకుంటే మీకు మీరుగా దానిని నేరవేర్చేయండి. భార్యకు తెలియనివ్వకండి అంటారు ఆచార్య చాణక్య.
Famous Posts:
> మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
wife and husband, wife, husband, secrets, chanakya, chanakya nithi, chanakya storys telugu, ethics of chanakya, chanakya real photo