Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితమంతా సంతోషమే….| If you marry this zodiac girl, your whole life will be happy.

ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితమంతా సంతోషమే….

హిందు సంప్రదాయంలో వివాహ ప్రక్రియకు, వైవాహిక జీవితానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఇరవై నుంచి పాతికేళ్ల పాటు ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేకుండా పెరిగిన ఇరువురు వ్యక్తులు పెళ్లి పేరిట ఒక్కటి కావడమే కాదు.. తుది శ్వాస వీడేవరకు తోడూ నీడగా ఉండే గొప్ప అనుబంధం. అందుకే పెళ్లి గురించి వర్ణించేప్పుడు మూడే ముళ్లు, ఏడు అడుగులు.. నిండు నూరేళ్లు అని అభివర్ణించారు మన పెద్దలు.

రెండు జీవితాలను ఒక్కటిగా ముడిపెట్టే ఈ కార్యానికి సంబంధించి జాతకాలు చూడడం కద్దు. వారి ప్రవర్తన, నడవడికతో పాటుగా ఇరువురి జాతకాలు కుదిరితేనే వివాహం చేసేవారు అప్పట్లో.. దైవానుగ్రహం, గ్రహాల అనుకూలత, తిథి నక్షత్రాల మహత్యం వెరసి జీవితం హాయిగా ఉంటుందని ఈ సాంప్రదాయపు నమ్మిక. జాతకాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్నవారు సరిగ్గా కాపురాలు చేయడంలేదా? ఫారిన్ లో ఇటువంటి పనికిమాలిన ఆచారాలేవీ లేకుండానే హాయిగా జీవించడం లేదా? అనేది ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఇది హిందూ వివాహ సాంప్రదాయపు విలువలు, విశేషణాన్ని చెప్పే విషయం మాత్రమే. ఇక పెళ్లి విషయానికి వస్తే..

వధూవరుల జాతకాలు చూసి జన్మరాశులకు సరిపోయిన వారిని ఎంపిక చేసి వివాహం జరిపిస్తారు. కొందరు హిందూ పండితులు చెప్పిన దానిని బట్టి కొన్ని జన్మ రాశులున్న మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని తెలిపారు. కర్కాటక, సింహ, మేష రాశి వారిని పెళ్లి చేసుకుంటే వారి జీవితంలో ఒడిదుడుకుల్లేకుండా సుఖ సంతోషాలతో ఉంటుందని సూచించారు. ఆయా రాశుల వారిని చేసుకున్న వారికి కలిగే అధనపు ప్రయోజనాలను పండితులు ఇలా వివరిస్తున్నారు.

కర్కాటక రాశి మహిళలు భర్తకు అనుకూలంగా ఉంటారు. వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తారు. తన కొన ఊపిరి వరకు జీవిత భాగస్వామిని అట్టిపెట్టుకుని ఉంటారు. ఇంకా ఈ మహిళల్లో అత్యధిక సంప్రదాయ లక్షణాలు ఉంటాయని, ఈ రాశి మహిళలు సున్నితమైన వారై, ఇతరులపై ఆధారపడి జీవనం సాగిస్తారు.

సింహరాశి మహిళలు చాలా శక్తిమంతులు. మంచి రూపురేఖలు, అందం, ఆకర్షణతో పదుగురి చూపునీ తనవైపు తిప్పుకునేలా ఉంటారట. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే సత్తా ఉంటుంది. చిన్నతనంలో వీళ్లు పితృస్వామ్య వాతావరణంలో పెరిగి ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు.

మేష రాశి మహిళలు సమర్థుడైన భర్త తన పక్కన ఉండాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ ఆమె మార్క్ కనిపిస్తుంది. తన భర్త, కుటుంబ పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసుండాలని కోరుకుంారు. తన బాధ్యతల నుంచి ఎప్పుడూ పక్కకు తప్పుకునే ఆలోచన చేయదు. వీళ్ళు భర్త అడుగు జాడల్లోనే నడుస్తారు.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

marry, zodiac girl,  life, happy, girl, rashi, రాశి, అమ్మాయి, పెళ్లి 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు