Drop Down Menus

ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు వాడపల్లి వెంకన్న ఆలయ విశేషాలు | Vadapalli Sri Venkateswara Swamy Temple Timings

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గల తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం 'వాడపల్లి'. ఈ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందినది, ఈ దేవస్థానాన్ని 'వాడపల్లి వెంకటేశ్వర స్వామి' దేవస్థానం అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయం, చాల గొప్ప చరిత్ర కలిగి ఉంది మరియు తదనంతర కాలంలో విశాలమైన ప్రాంగణంలో అభివృద్ధి చే శారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగాన 'గోవిందనామాలు' ముద్రించారు, ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి శనివారం ఆలయానం దగ్గర సుమారు అర కిలోమీటరు పొడవున మేళగా అన్ని దుకాణాలు ఏర్పాటుచేస్తారు. ఈ క్షేత్రం లో ఏడు శనివారాలు దర్శించుకొని, పదకొండు ప్రదక్షణలు చేసిన భక్తుల కోరికలు స్వామి వారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు. కావున శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఎర్ర చందన కొయ్యలో వెలసిన 'స్వయంభూ' క్షేత్రం 'వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. స్వామి వారి 'బ్రహ్మోత్సవం' పది రోజులపాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ప్రతి రోజు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు స్వామి వారి దర్శించుకుంటారు మరియు బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆలయంలో 'గోదా దేవి' కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం.

వాడపల్లి దివ్యచరితము

శ్రీ మచ్ఛన్దన విగ్రహ విభవజుషాం పాపాఘవిధ్వంసకం ।

ధృత్వాయం భువివేంఞ్కటేశ్వర విభుర్నౌకాపురే భాసురః

సర్వద్రోహకరాంస్తమో గుణ మయాంచ్చక్రాయుధే నాచిరా 

దుశ్రీ కాన్విష భూరుహేణ సదృశార్థూరీ కరోతి స్వయమ్

పూర్వం ఒకసారి సనక, సనందనాది మహార్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలుపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యత నిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, కలి ప్రభావంతో అధర్మబద్ధ మైన జీవితం గడుపుతున్నారు. అందువలన ప్రజల్ని చక్కదిద్ధి ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహార్షులు శ్రీ మహావిష్ణువును అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పెను.

అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించితిని, కాని కలియుగము పాపభూయిష్టమై అధర్మం ప్రభలినది. కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా తదుపరి లక్ష్మీక్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలె దరిచేర్చునది అగు దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమీ గోదావరి తీరమున నౌక పురమనెడి (వాడపల్లి) పురమందు అవతరించి భక్తులను ఉద్దరించెదను.

కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించుట జరిగినది. తదుపరి మహర్షులు అందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికాత్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్ర చందనము అనే కొయ్యలో లక్ష్మి సహితంగా అవతరించుట జరిగినది. ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామి వారి అజ్ఞమేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి గౌతమీ ప్రవాహ మార్గంలో వదిలిన నేను నౌకపురి (వాడపల్లి) క్షేత్రము చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను. ఈ వృతాంతం అంతా నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు.

కొంత కాలమునకు నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరమునకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమై పోవడం ప్రారంభించినది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీల వారు ఎవరూ కనుగొనలేక పోయినారు. తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణునకు కలలో కనిపించి కలికల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేక పోతున్నారు. కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెబుతారు. పురజనులు శ్రీ స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదిగర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభించింది. దానిని తీరమునకు తీసుకు వచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ, చక్ర గదాదారుడై లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది.

అంతలో అక్కడకి దేవర్షి నారదుడు విచ్చేసినారు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్దరించడానికి ఉపాయం చూడవలసినదిగా విష్ణువును ప్రార్ధించడం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలయిన విషయాలు నారదుడు పుర జనులకు వివరించెను. అందులకు నిదర్శనముగా శ్రీ స్వామి వారు కటి హస్తమునకు బదులుగా గదాధారుడై వెలయుట జరిగినది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపజేసినాడు. " వేం " అంటే పాపములను " కట" అంటే పోగొట్టే వాడు కనుక స్వామికి " వేంకటేశ్వరుడని " నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింప చేసినాడు. వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది.

భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్ధం అనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాలగోపాలానికి ఆనందమే. ప్రతియేటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామి వారి తీర్థం, కళ్యాణోత్సవము వైభవముగా జరుగుతాయి.

శ్రీ స్వామి వారి పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా భక్తి ప్రవత్తులతో తిలకిస్తారు. ఏటా కళ్యాణంతో పాటు ఏడు శనివారాల వత్రంలో నిత్యం వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శిస్తుంటారు.

వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన ! వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి !!

ప్రతి సంవత్సరం స్వామి వారి తీర్థం దగ్గర వార్షిక వేడుకలను మార్చ్-ఏప్రిల్ నెలల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది మరియు వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లానందు గోదావరి నది ఒడ్డున రావులపాలెంకి 10 కి. మీల దూరంలో కలదు. రావులపాలెంకు అన్ని ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. ఎర్ర చందన కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి, 'శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి శనివారం చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుపబడును. ఈ క్షేత్రం 'కోనసీమ తిరుపతిగా' ప్రఖ్యాతి గాంచినది.

ఆలయ సమయాలు & సేవా సమయాలు

Sunday to Friday ( ఆదివారం నుండి శుక్రవారం వరకు ) 6.00 am to 1.00 pm and 4.00 pm to 8.00 pm

06:00 AM - 08:00 PM

Saturday ( శనివారం మాత్రమే ) 4.00 am to 2.00 pm and 4.00 pm to 9.00 pm 04:00 AM - 09:00 PM

సుప్రభాత సేవ శనివారం మాత్రమే ( SUPRABATHA SEVA SATURDAY ONLY ) ( Regular )

03:15 AM - 04:00 AM

బాల భోగం ( BALA BHOGAM ) ( Regular )

05:30 AM - 06:00 AM

ప్రత్యేక్ష అష్టోత్తర పూజ శనివారం మినహా ( PRATYEKSHA ASHTOTHARA POOJA EXCEPT SATURDAY ) ( Regular ) @150/-

08:30 AM - 09:30 AM

ప్రత్యేక్ష కళ్యాణం శనివారం మినహా ( PRATYEKSHA KALYANAM EXCEPT SATURDAY ) ( Regular ) @750/-

10:00 AM - 11:55 AM

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం,

వాడపల్లి గ్రామం, ఆత్రేయపురం మండలం,

తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 5332375: 08855-271888, 272666, 9491000085.

రవాణా

By Road:

వాడపల్లి రావులపాలెం నుండి 11 కి. మీల దూరంలో కలదు, మరియు రావులపాలెం రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పట్టణాలతో అనుసంధానమైంది కావున బస్సు సౌకర్యం కలదు.

By Train:

ఆలయానికి దగ్గరగా నిడదవోలు జంక్షన్ 30 కి.మీలు మరియు తణుకు 38 కి.మీల దూరంలో రైల్వే స్టేషన్స్ కలవు.

By Air:

విజయవాడ జాతీయ విమానాశ్రయం, గన్నవరం దగ్గర, ఆలయానికి 149 కి. మీల దూరంలో కలదు.

సందర్శించవలసిన ప్రదేశాలు

> Sri Mandeswara Swamy (Saneswara Swamy) Devastanam, Mandapalli (శ్రీ మందేశ్వర స్వామి (శనీశ్వర స్వామి) దేవస్థానం, మందపల్లి)

> Sri Jaganmohini Kesava Swamy Temple, Ryali (శ్రీ జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్, ర్యాలి)

> Sri Vighneswara Swamy Vari Devastanam, Ainavilli (శ్రీవిఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి)

> Sri Veereswara Swamy Vari Devastanam, Muramalla(శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం, మురమల్ల)

> Sri Bala Balaji Swamy Vari Devastnam, Appanapalli(వెంకటేశ్వరస్వామి దేవస్థాన చరిత్ర)

Sri Lakshmi Narasimha Swamy Vari Devastanam, Antravedi(శ్రీ లక్ష్మి నరసింహస్వామి, అంతర్వేది)
Tags: వాడపల్లి వెంకన్న, వాడపల్లి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి, Konaseema Tirupati, Vadapalli, Vadapalli Sri Venkateswara Swamy Temple, Vadapalli Venkanna, Vadapalli Temple History Telugu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.