Drop Down Menus

పిల్లలకు మొదటిసారి భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..? భోగి పళ్లు పోసేటప్పుడు పాడే పాట - Bhogi Pallu Function : Bhogi Pallu Paata with lyrics in Telugu

భోగి పళ్లు ఎలా పోయాలో తెలుసా..?

పిల్లలకు భోగి పళ్లు పోయడం అనేది మన సంప్రదాయాల్లో ఒకటి.

అసలు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు?

అనే విషయం చాలామందికి తెలీదు.

ముఖ్యంగా పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం.

అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి

పారేయడమే భోగి పళ్లు పోయడం. సాయంత్రం సంది

గొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగి పళ్లు

చేసే కార్యక్రమం మొదలుపెడతారు. 5 ఏళ్ల లోపు

పిల్లలకే ఎక్కువగా భోగిపళ్లు పోస్తారు. రేగి పళ్లు,

బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, చెరుకు గడల

ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లడిపై పడేట్టు

పోస్తారు అలా పోసిన తర్వాత కింద బడ్డ రేగిపళ్లు

తినడానికి నిషిద్దం. దాన్ని ఎవరూ లేని చోట పారేయడం

చేస్తారు. అసలు పిల్లలకు భోగి పళ్ల పేరుతో రేగి పళ్లనే

ఎందుకు పోస్తారు? అనేది కూడా చాలామందికి తెలీని

విషయమే. రేగి పండును అర్కఫలం అని కూడా

అంటారు. ‘అర్కుడు' అంటే సూర్యుడు.భోగి మరునాడు నుండి 

సూర్యుడు ఉత్తరాయనం వైపు  మళ్లుతాడు. అందుకే.. 

ఆయన కరుణాకటాక్షాలు '' పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు.

భోగి పొండ్ల పాట

ప. భోగిపండ్లను పోయరే - ఓరమణులారా!

మన చిరంజీవులకు - మేలుకలుగగా ||భోగి||


చ. విగ్నాశ్వరుడు వచ్చి విఘ్నాలు తొలగింప

షణ్ముఖనాధుడు వచ్చి - శాస్త్రాలు వల్లింప

సాయిబాబాని వచ్చి - ప్రేమార లాలింప ||భోగి||

చ. బ్రహ్మదేవుడు వచ్చి - వేదాల దీవింప

విష్ణుదేవుడు వచ్చి - వరముల నందింప

పరమేశ్వరుడు వచ్చి - ఆశీర్వదించంగ ||భోగి||


చ. రామచంద్రుడు వచ్చి - రక్షణ చేయంగ

శ్రీ కృష్ణుడే వచ్చి - శుభములు పలుకంగ

 శ్రీ వేంకటేశ్వరుడు - ఆశీస్సులందింప || భోగి ||


చ. ఆంజనేయుడు వచ్చి అభయాలనివ్వంగ

కులదైవతలు వచ్చి - కళాకాంతులనివ్వంగ

తులసిదాసుడువచ్చి - మంగళములు పాడంగ ||భోగి||

Click here:

అందరూ తప్పక నేర్చుకోవాల్సిన సంక్రాంతి గొబ్బెమ్మ పాటలు

సంక్రాంతికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా?

భోగి అంటే ఏమిటి ? భోగి విశిష్టత ఏమిటి? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది?

సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే సకల సంపదలు మీ సొంతం..!

Tags: భోగి, సంక్రాంతి, భోగిపళ్లు, Bhogi, Bhogi Pallu, Bhogi 2024, Bhogi Pallu Patalu, Bhogi Pallu Songs Telugu, Bhogi Pallu Patalu Telugu, Child, Pillalu, Sankranthi, Bhogi Festival

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.