తిరుమల చంటి పిల్లల దర్శనం | Tirumala One Year Baby Special Darshan Updates

tirumala one year baby darshan information
తిరుమల శ్రీ వేంకటేశ్వర  స్వామి దర్శనానికి వచ్చే లక్షలమంది భక్తులలో చిన్నపిల్లలది ప్రత్యేక స్థానం. ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల పుట్టువెంట్రుకలు స్వామి వారికి సమర్పించాలని వస్తుంటారు. మరికొందరు పిల్లల పుట్టగానే నీ దర్శనానికి వస్తాం స్వామి పిల్లలు కలిగేలా చూడు తండ్రి అని మొక్కుకుని దర్శనానికి వస్తుంటారు. తిరుమల దర్శనాలు అంటే ఎలా ఉంటాయో మనకు తెలిసిందేకదా అందులోను చిన్నపిల్లలతో అంత పెద్ద లైన్ లో నడవడం అంటే కష్టమే , 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు  పిల్లల దర్శనాల కోసం టీటీడీ వారు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసారు. ఏ టికెట్ తీసుకోకుండానే నేరుగా దర్శనానికి వెళ్ళవచ్చు ఎక్కువ దూరం నడవనసరం లేదు. చంటి పిల్లల దర్శనానికి సంబందించిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం . 

అర్హులు : ఒక సంవత్సరం లోపు పిల్లలు

టికెట్స్ : టికెట్స్ అవసరం లేదు 

దర్శనం : పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఇస్తారు . సంవత్సరం లోపు పిల్లాడితో పాటు మరో పిల్లవాడు / పాపా  ఉన్న కూడా ఉచితంగా తీసుకుని వెళ్ళవచ్చు . 

ఎక్కడకు వెళ్ళాలి : సుపథం ( స్వామి వారి ఆలయానికి ఎడమవైపున బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ )

ఎన్ని గంటలకు దర్శనం : మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 

ఏమి తీసుకుని వెళ్ళాలి : తల్లి దండ్రుల ఆధార్ కార్డు తో పాటు పిల్లవాడి ఆధార్ కార్డు , ఆధార్ కార్డు లేకపోతే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కావాలి ( Date of Birth Certificate)

అన్ని రోజులు దర్శనం ఉంటుందా ? : ప్రతి రోజు దర్శనం ఉంటుంది , పర్వదినాల్లో ఉండదు అనగా వైకుంఠ ఏకాదశి , రథ సప్తమి , బ్రహ్మోత్సవాలు అలాంటి రోజుల్లో ఉండదు కాబట్టి రద్దీ లేని రోజుల్లో వెళ్లడం ఉత్తమం. 

మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె హిందూ టెంపుల్స్ గైడ్ నెంబర్ 8247325819 కు వాట్స్ యాప్ లో మెసేజ్ చేయండి 

tirumala , tirumala latest information, tirumala one year baby special darshan updates, tirumala information in telugu, hindu temples guide

Comments