శ్రీశైలం లో వెలసి యున్న శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ క్షేత్రం గాను , అష్టాదశ శక్తి పీఠాలలో 6వ శక్తి పీఠం గా చెప్పబడుచున్నవి.
శ్రీశైలం లో ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా సరే గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారిని తాకవచ్చు, దీనినే స్పర్శ దర్శనం అని పిలుస్తారు. మంగళవారం నుంచి శనివారం వరకు మూడు సార్లు సర్పదర్శనం ఉంటుంది.
ఉదయం 7:30 కు , మధ్యాహ్నం 12:30 కు , రాత్రి 9:30 కు ఉంటుంది.
ఆన్ లైన్ లో మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి 500/- టికెట్ ధర.
ఆది సోమ వారాల్లో 4 సార్లు స్పర్శదర్శనం ఉంటుంది.
ఆన్ లైన్ బుకింగ్ నే కాకుండా ఉచిత స్పర్శదర్శనం కూడా భక్తులకు దేవస్థానం కల్పిస్తున్నారు, కాకపోతే రద్దీగా ఉండే రోజుల్లో ఉచిత స్పర్శదర్శనం రద్దు చేస్తూ వచ్చారు, మంగళవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం ఉంది. డిసెంబర్ 11వ తేదీ 2024 నుంచి ఆలయం వారు రద్దీ గా ఉండే రోజుల్లో కూడా స్పర్శ దర్శనం కల్పించనున్నారు. ఉచిత స్పర్శ దర్శనం సమయాలు
ఉదయం 7:30 - 9 గంటల వరకు
ఉదయం : 11:45 - మధ్యాహ్నం 1:30 వరకు
రాత్రి : 8:30 నుంచి 10 గంటల వరకు
దర్శనాలు టికెట్ ధరలు :
అతి శీఘ్రదర్శనం : 300/-
శీఘ్రదర్శనం : 150/-
గర్భాలయం లో అభిషేకం : 5000/- (సింగల్ గా లేదా దంపతులకు )
అభిషేక సమయాలు :
ఉదయం : 6:15 , 9:30,
మధ్యాహ్నం : 12
సాయంత్రం : 6 గంటలకు
keywords : srisailam updates, srisailam devasthanam, srisailam sparsha darshanam, temples guide, hindu temples guide,