Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 14th Chapter 19-27 Slokas and Meaning in Telugu | భగవద్గీత 14వ అధ్యాయం 19-27 శ్లోకాల భావాలు

శ్రీమద్ భగవద్ గీత చతుర్దశోఽధ్యాయః
అథ చతుర్దశోఽధ్యాయః |

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి ‖ 19 ‖


భావం : కర్మలన్నిటికి గుణాలను తప్ప మరోదాన్ని కర్తగా భావించకుండా, గుణాలకు అతీతమైన పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వివేకి మోక్షం పొందుతాడు.  

గుణానేతానతీత్య త్రీందేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్నుతే ‖ 20 ‖
భావం : శరీరం కారణంగా కలిగినప్పుడు ఈ మూడు గుణాలనూ అధిగమించినవాడు పుట్టుక, చావు, ముసలితనం, దుఃఖాలనుంచి విముక్తుడై అమృతపదం పొందుతాడు. 
అర్జున ఉవాచ |

కైర్లింగైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే ‖ 21 ‖
భావం : అర్జునుడు ప్రభు! ఈ మూడు గుణాలనూ దాటినవాడి లక్షణా లేమిటి ? అతను ప్రవర్తన ఎలా వుంటుంది ? ఈ గుణాలను ఎలా అతను అతిక్రమించగలుగుతాడు.


శ్రీభగవానువాచ |
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ |
త ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ‖ 22 ‖
ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తంత ఇత్యేవ యోఽవతిష్ఠతి నేంగతే ‖ 23 ‖
సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాంచనః |
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిందాత్మసంస్తుతిః ‖ 24 ‖
మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః |
సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ‖ 25 ‖
భావం : శ్రీ భగవానుడు అర్జునా! గుణతీతుడి గుర్తులివి. తనకు సంప్రాప్తించిన సత్వగుణసంబంధమైన సౌఖ్యాన్ని కాని, రజోగుణ ధర్మమైన కర్త ప్రవృత్తినికాని, తమోగుణలక్షణమైన మోహాన్నికాని ద్వేషించడు. అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు. ఏమి సంబంధం లేనివాడిలాగ వుండి గుణాల వల్ల చలించకుండా, సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి, ఎలాంటి పరిస్థితిలోనూ నిశ్చలబుద్దిని విడిచిపెట్టడు. సుఖదుఃఖాలు, మట్టిబెడ, రాయి, బంగారం, ఇష్టానిష్టాలు, దూషణభూషణాలు, మానావమానాలు, శత్రుమిత్రులను సమానదృష్టితో చూస్తూ కామ్యకర్మ లన్నీటిని విడిచిపెట్టి నిరంతరం ఆత్మవలోకనంలో నిమగ్నమై ఉండే ధీరుడు.

మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే |
స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే ‖ 26 ‖
భావం : అచంచల భక్తితో నన్ను సేవించేవాడు ఈ మూడు గుణాలనూ అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు.

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ‖ 27 ‖
భావం : ఎందువల్లనంటే వినాశరహితం, వికారరహితం, శాశ్వత ధర్మ స్వరూపం, అఖండ సుఖరూపమూ అయినా బ్రహ్మనికి నిలయాన్ని నేనే.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
గుణత్రయవిభాగయోగో నామ చతుర్దశోఽధ్యాయః ‖ 14 ‖

14వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 15th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు