మా కర్ణాటక యాత్ర ప్లాన్ | 8 Days of Karnataka Tour Information | Hindu Temples Guide

జూన్ లో నేను వెళ్ళిన యాత్ర కర్ణాటక, విశేషాలు... 

విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం (విజయనగరం) హంపి ఎన్నో రోజులుగా చూడాలనుకున్న కల నెరవేరింది. శిథిల నగరంగా కనిపించే హంపి యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకుంది. 

కనిపించే ప్రతి రాయిలోను దేవుడి ని చూసే హిందువులకు మహమ్మదీయుల దాడిలో ఇక్కడి కూల్చివేసిన ఆలయాలు, విరగ్గొట్టిన విగ్రహాలు బాధ కలిగిస్తాయి. అద్భుత ఆలయాలు, శిల్పాలు ఉన్నప్పటికీ విరూపాక్ష ఆలయం లో మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మిగతా విరిగిన విగ్రహాలను పూజించడం హిందూ సాంప్రదాయం కాదు కాబట్టి. మొన్నామధ్య కోర్టు మొట్టికాయలు వేసేదాకకూడా కర్ణాటక ప్రభుత్వం పెద్దగా సంరక్షణ, అభివృద్ధి పనులు ప్రారంభించలేదు. హంపి లో బస చేసేందుకు సౌకర్యాలు తక్కువ, దగ్గర లో ఉన్న కమలాపురం, హోస్పేటలోనే చూసుకోవాలి. హంపి గురించి పూర్తిగా తెలియాలంటే ఖచ్చితంగా గైడ్ ను మాట్లడుకోవలసిందే. (500 రూ) పూర్తి గా హంపి చూడాలంటే ఆటో (500రూ) మాట్లాడుకోవడం మంచిది. మా గైడ్ ఉదయం 8 గం లకు హంపి సందర్శన ప్రారంభించి ముఖ్యమైన విఠల ఆలయం, (మేము వెళ్ళినపుడు విఠల ఆలయంలో పునరుద్దరణ పనులు చేస్తున్నందున సందర్శనకు పూర్తిగా అనుమతించలేదు ,) కోట, లోటస్ మహల్, ఉగ్ర నరసింహలాంటి 10 ముఖ్యమైన ప్రదేశాలను చూపించి మద్యాహ్నంకల్లా ముగించాడు..కానీ పూర్తి గా చూడాలంటే కనీసం 3 రోజులైనా సరిపోదని చెప్పాడు. కర్ణాటక టూర్ లోవ రోజు ఇలా పూర్తి అయింది.
Day 2: Gokarnam

ఇక హంపి నుండి మా ప్రయాణం నేరుగా త్రిశైవ క్షేత్రాలో ఒకటి అయిన ఆత్మలింగ క్షేత్రం గోకర్ణంకు. (మిగతా రెండు కాశీ, రామేశ్వరం ) 2వ రోజు ఉదయం 4 గంటల కల్లా చేరిన మేము హోటల్ రూం తీసుకుని , స్నానాదులు ముగించుకొని 8గంటలకు ఆలయాని బయలుదేరి పెళ్ళిన మాకు ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలని  చెప్పడంతో బాలగణేశుడిని దర్శించుకొని ప్రధానాలయం లోకి వెళ్లే సరికికాస్త రద్దీగా ఉన్నప్పటికీ 1గంటలోనే అభిషేకం పూర్తి చేసుకొని బయటకు రావడంతోనే పూజారుల ద్వారా క్షేత్రం లో పిండప్రదాన ప్రాధాన్యత తెలుసుకొని మిత్రులతో కోటితీర్థం వెళ్ళాము. (గుడి నుండి అరకిలోమీటర్)  ఇక్కడ గడిలోనూ, కోటితీర్థం దగ్గర తెలుగు మాట్లాడే పూజారులు ఉన్నారు, కాబట్టి ఇబ్బంది పడలేదు.  మా పిల్లలు మాత్రం సరదాగా బీచ్ వైపు వెళ్ళారు.

ఇక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరిన మేము సమయాబావం వలన కొల్లూరు మూకాంబిక ఆలయానికి వెళ్ళగలమా లేదా అనుకుంటూనే మురుడేశ్వర్ బాట పట్టాము.
Day 3 : Murudeshwar Temple

గోకర్ణం నుండి మురుడేశ్వర్ 80 కిలోమీటర్లే ఐనా రోడ్ ఇప్పుడే నాలుగు లేన్ల హైవే గా మారుస్తుండడం, రద్దీ ఎక్కువ గా ఉండడంతో దాదాపుగా 3 గంటల సమయం పట్టింది.అరేబియా తీరంలోని పంచ శైవ క్షేత్రాలో మురుడేశ్వర్ ఒకటి.  ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోయిన రావణుడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా
పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె
మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది.ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు కర్ణాటకలో. మురుడేశ్వర్ ఆలయ గోపురం ప్రపంచం లోనే పెద్దదిగా చెప్పవచ్చు. 18 అంతస్తులు. సముద్రం మధ్యలో దీవిపై
మహాశివుని అతి పెద్ద విగ్రహం ఇంకా అద్భుతం. ఇక్కడి నుండి మా తర్వాతి ప్రయాణం ఉడిపి కి.
Day 4 : Udipi Sri Krishna Temple



మురుడేశ్వర్ నుండి బయలుదేరిన మేము బత్కల్ దగ్గర భోజనం ముగించుకొని ఉడిపి చేరేసరికి రాత్రి 11.00 అయింది. దేవాలయం ఎదురుగా హోటల్ మధుర లో రూం తీసుకున్నాం (600రూ) బాగుంది. ఉదయాన్నే 6.00 గంటలకు ఆలయానికి వెళ్ళాం. 7.00 గంటలకు స్వామి వారి అలంకరణ కోసమని  క్యూలైన్ని లిపివేయడంతో పక్కనే ఉన్నచంద్రమౌళీశ్వర ఆలయాన్ని, దర్శించుకొని మళ్ళీ వరుసలో నిలబడి అరగంట లో ఆలయం లోకి పెళ్లాం. అచంచల విశ్వాసం కలిగిన భక్తుని కోసం భగవంతుడు దిగివస్తాడనేందుకు ఈ ఆలయం నిదర్శనం. నిమ్నజాతికులస్థడైన కనకదాసుకు ఆలయ ప్రవేశం అనుమతించకపోవడంతో అతని కోసం శ్రీకృష్ణ భగవానుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు
ఇక్కడి స్థల పురాణాచెప్తున్నాయి. ఆ కారణంగానే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయ సింహద్వారం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం

పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు.  ఎంత చూసినా తనివి తీరని  స్వామి వారి దివ్యమోహన  రూపాన్ని మనసులో నిలుపుకొని ముందుకు కదిలాం .

Day 5 : Sringeri Sharada Peetham

10 గంటల కల్లా ఉడిపి లో దర్శనం పూర్తి చేసుకున్న మేము మరో గంటలో శృంగేరికి బయలుదేరాం. ఆగుంబే మీదుగా ఘాట్ రోడ్ డ్రైవింగ్ కష్టం అని అక్కడి వాల్లు చెప్పడం తోకర్కాల మీదుగా 30 కిలోమీటర్ల దూరం ఎక్కువైనా అలాగే వెల్లాం . పూర్తిగా అడవి తో నిండిన ఘాట్ రోడ్ కావటం తో మేం శృంగేరి చేరేసరికి సాయంత్రం 3.00 అయింది. బస్సులోనుండి కాలు కింద పెట్టగానే ఒక చిరుజల్లు ముఖాన్ని తాకింది. గొడుగు తీసుకుని శారదాపీఠానికి బయల్దేరాం. ఆదిశంకరులు అద్వైతం
ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో తు గా తీరంలో ని శృంగేరి శారద మఠం మెదటిది. గంగా స్నానం తుంగా పానం రెండూ అంతే గొప్పవని అక్కడివాల్లు చెప్పారు. నీల్లు స్వచ్చంగా ఉన్నాయి.ముందుగా శారదామాత ఆలయం దర్శించుకన్నాం, పురాతన ఆలయం అగ్నికి ఆహుతి ఐతే పునః నిర్మించారట. ఇక్కడ చాలా మంది స్త్రీ లు అమ్మవారి కి ఒడి బియ్యం, చీరెలను  సమర్పిస్తున్నారు. తరువాత విద్యాశంకర ఆలయాన్ని 5.00 గంటల కు తెరచినాక దర్శించాం, ఇదొక  సైన్సు అద్భుతం. సూర్యుడు రాశులు మారినప్పుడల్లా కిరణాలు ఒక్కో స్థంభం పైన మార్చి పడుతాయి .  ఇక ఆరోజు స్వామివారి దర్శనం లేదనడంతోనది అవతలి వైపున ఉన్న గురు నివాస్ కి వెళ్లకుండానే ధర్మస్థలకు మా ప్రయాణం ప్రారంభించాం. ఇక్కడ వసతి కోసం టి టి డి వారి  భవనం కూడా ఉంది. ఇక్కడ పోలీసు వాల్లు  పెట్టిన బోర్డు చూడండి.
Day 6 : Dharmasthali
ధర్మస్థల చేరేసరికి బాగా రాత్రి అయ్యింది. ఇక్కడ పెద్దగా
ప్రయివేటు హోటల్ లు లేవు అన్ని దేవస్థానం వారివే. మాకు ఇక్కడ వసతి వెంటనే దొరికింది (గంగోత్రి కాటేజి) మేం వెళ్ళిన మొత్తం టూర్ లో ఇక్కడే తక్కువగా ధర రూములకి . ఆలయం అద్భుతంగా కేరళ ఆలయాల రీతిలో ఉంది. దాదాపు గా తిరుపతి లో ఎలా నిర్వహణ ఉంటుందో అలాగే ఉంది.  కర్ణాటక లోని దాదాపు అన్ని ఆలయాలలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆటోలోకల్ 10 రూ తీసుకుంటారు. కానీ కాస్త దూరంగా ఉండే రామాలయానికి 300 తీసుకున్నారు ముగ్గురికి. వాస్తవానికి జీపు లాంటిది 400 కే వచ్చింది. రెండు చూడదగిన మ్యూజియంలుకూడా ధర్మస్థలలో ఉన్నాయి. పరుగెత్తించే మన జీవితంలో ఆగి ఆస్వాదించాల్సినవి
ఎన్నో ఉన్నాయనిపించింది.  మా తరువాతి ప్రయాణం ఇండియన్ హెరిటేజ్ సిటీ మైసూరు కు.
Day 7 : Mysore

ధర్మస్థల నుండి మైసూరు బయలుదేరి హసన్ వచ్చే సరికి పడమటి కనుమల నుండి మైదాన ప్రాంతంకొచ్చాం. హంపి నుండి గోకర్ణం వెళ్లే దారిలో ధార్వాడ్ దాటిన తర్వాత మొదలైంది ఘాట్ రోడ్డు. హసన్  దాటి చాలా వరకు రాగానే పెరుగు కొందామని నేను చెప్పడంతో బస్సు చిన్న వూల్లో ఆపాం.(పిల్లలతోఇబ్బంది అవుతుందని క్యాటరింగ్ వాల్లని వెంట తెచ్చకున్నాం). 
పెరుగును ఏమని అడగాలి అసలే పల్లెటూరు అనుకున్నా కానీ నా ఫోన్లో ఉన్న ట్రాన్స్లేటర్ ముసురు అని చూపెట్టింది, షాపులో ఉన్న 10 సంవత్సరాల (5వ తరగతి)కుర్రాడు అది చూసి మాతో హిందీ లో మాట్లాడడంతో హమ్మయ్య అనుకున్నా . మా మిగతా
బస్సులు వెళ్ళిపోయాయి. అక్కడి నుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత 3 రోడ్లు రావడం తో మావాల్లు ఎటు వెల్లారో తెలియలేదు. ఇక చూడాలి మా బస్సు వాల్లు నన్ను చంపేద్దామనేంతగా నానా గొడవ చేస్తే కొందరేమో ఏం బాధలేదురా బాబు మన మొత్తం టూర్ లో అన్నీ వీడు ముందే ప్లాన్ చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తాడులే
అన్నారు.(టూర్ మొత్తంలో రూములు బుక్ చేయడం నుండి  ఎక్కడ భోజన , వసతి ఏర్పాట్లు వగైరా. నీల్లకు మాత్రం చాలా ఇబ్బందైంది. 20 లీటర్ల టిన్ 100 నుండి 300 రూ)   అంతలోనే మా అబ్బాయి ముందు బస్ లో ఉన్న వాడి ఫ్రెండ్ తో వాట్సప్ లో గూగుల్ లొకేషన్ తెప్పించకోవడంతో మావాల్లు శ్రీరంగపట్టణం వెల్తున్నారని అర్థం అయింది.అక్కడికి చేరేసరికి రాత్రి 11.00 అయ్యింది. అక్కడ మా బస గుడి ముందే ఉన్న రంనాథ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసుకున్నాం. నేను
మరో నలుగురు మిత్రులు పక్కనే ఉన్న కావేరి నదిలో స్నానానికి పెళ్ళాం, నీల్లు ఎక్కువ గా లేవు. దైవ దర్శనం చేసుకున్న తర్వాత మావాల్లంతా షాపింగ్ లో మునిగిపోయారు. అన్ని హాం డీ క్రాఫ్ట్ లు ఇక్కడ మైసూరు కంటే సగం ధర కే లభిస్తాయి. టిప్పు పాలెస్ కూడా చూసి, బయల్దేరాం. ఇక తర్వాత ప్రయాణం మైసూరు..
Day 8 : Chamundeshwari Temple, Mysore

ఇక మాప్రయాణంలో చివరిదైన మైసూరు... ముందుగా చాముండేశ్వరి ఆలయానికి బయలుదేరాం విపరీతమైన వర్షం... మేం టూర్ బయలుదేరిన 2వ రోజు హుబ్లీ ధార్వాడ్ దగ్గర మొదలైన వర్షం మైసూరు వరకు మమ్మల్ని వదలలేదు. వర్షం  పైగా ఆదివారం హిల్ రోడ్
మొత్తం ట్రాఫిక్ జాం. ఐనా పోలీసు లు తొందరగా నే క్లియర్ చేసారు. మహిషాసుర మర్ధిని చాముండి అమ్మవారి దర్శనం తొందరగా నే అయింది 100 రూ టిక్కట్ తో. తర్వాత మహారాజు పాలెస్ వెల్లాం. బయటకు వచ్చే సరికి 4.00 అయింది. ఆరోజు భోజనం అప్పుడయ్యింది. ఇక బృందావన్ గార్డెన్స్ బయల్దేరగానే మళ్ళీ ట్రాఫిక్ జాం అన్నారు. అప్పటి కే 7.30 దాటడం తో చేరుకోలేమని నిరుత్సాహంగానే వెనుదిరిగి షాపింగ్ చేసుకొని (రేట్లు మామూలు కంటే చాలా ఎక్కువే) ఇంటిబాట పట్టాం 8 రోజుల టూర్ ముగించుకొని.
- Badrinath Patha

Related Postings : 

> Gokarna Temple Information in Karnataka

> Kollur Mookambhika Temple Information

> Karnataka Top Foums Temples list

> Karnataka Kabir Manjunath Temple


Karnataka Temple information in telugu, Karnataka yatra details, Best temples information in hindu temples guide, temple timings, accommodation details, karnataka travel information, hindu temples guide.

6 Comments

  1. In between lot of temples missing. Harihara, amrutapura, kolluru, beluru,halibedu, varnadu, near mysuru nanjanagudu, lots of missing. Next time best of luck
    - Ravindra Reddy

    ReplyDelete
    Replies
    1. Sir memu August 4th Nadu Mysore reach avutunnamu. 5th Nadu Coorg Lo meeting undi aa taruvata kukki subrahmanyam and dharmastala and nanjundgad. Mysore chudali anukuntunnamu... Meru maku 4days tour plan cheppagalara?

      Delete
  2. Superb
    - Ramana Kumari

    ReplyDelete
  3. They have missed belur Srikrishna temple which is famous for its architecture and sculptures .
    - Rajai Kumar Reddy

    ReplyDelete
  4. Sir Ila suggestion istunanu ani tappu ga anukovaddu...dharmasthala temple ki vellay mundu pakkanay vunna "netravathi" river lo snanam cheyali mythology lo rama avataram nundi ah river snanam ki Chala importance vundi..Daya chesi Meru ilantivi kuda chepthay kottaga vellay vallaki entho useful.tappu ga matladi vuntay kshminchandi.om namah sivaya

    ReplyDelete
    Replies
    1. Sir memu August 4th Nadu Mysore reach avutunnamu. 5th Nadu Coorg Lo meeting undi aa taruvata kukki subrahmanyam and dharmastala and nanjundgad. Mysore chudali anukuntunnamu... Meru maku 4days tour plan cheppagalara?

      Delete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS