Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Somnatheswara Swamy Temple Information in Gujarat


శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్తారు. జ్యోతిర్లింగాల్లో మొదటి పుణ్యక్షేత్రం శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం.సకల దేవతలకు ఆరాధ్యదైవంగా శ్రీ సోమనాథేశ్వరుడు పూజింపబడుతున్నాడు.   శ్రీ సోమనాథేశ్వరక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. ప్రశాంత వాతావరణంలో సముద్రతీరంలో అత్యంత మనోహరంగా ఉంటుంది ఈ క్షేత్రం.
ఈ ఆలయాని అనేక సార్లు ముస్లింలు దాడి చేసరని చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తున్నది. క్రీ. శ .1783 లో  శివభక్తురాలు అయిన అహల్యభాయ్ హాల్ఖర్ ఈ ఆలయాన్ని పునర్మించినట్లు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది.  శ్రీ సోమనాథేశ్వర క్షేత్రం శివతీర్థం,అగ్నితీర్థం,సూర్యతీర్థ ల సంగమ క్షేత్రం. మొట్టమొదట ఈ క్షేత్రాన్ని చంద్రుడు దర్శించాడట అనంతరం ఈ క్షేత్రం మీద ఉన్న మక్కువతో శంకరుని దివ్య జ్యోతిర్లింగాన్ని స్థాపన చేసి దానిపై అత్యంత సుందరమైన స్వర్ణ మందిరాన్ని నిర్మించాడని స్కంద పురాణం ద్వారా అవకతమవుతుంది. చంద్రునికి సోమేర్ అనే పేరు ఉంది . అందువల్ల ఇక్కడ శివుడు సోమేనాదేశ్వర్ గా ప్రసిద్ధి చెందాడు.  గర్భగుడిలో అరడుగల ఎత్తున పెద్ద శివలింగం ఉంటుంది. ఈ క్షేత్రని దర్శించిన శ్రీ కృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వారిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీ సోమనాథేశ్వర స్వామి వారికి రోజూ ఉదయం పూట ఒకసారి మాత్రమే అభిషేకం చేస్తారు. ఇక్కడ ఉన్న చంద్రకుండలో స్నానం చేసి సోమనాథేశ్వర్ ని  దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని భక్తులు నమ్మకం.చంద్రుడే సోమనాథేశ్వరుని స్వయంగా ఇక్కడ ప్రతిష్టించినట్లు పురాణాల్లో చెబుతుంటారు.నిత్యం భక్తులతో రద్దిగా ఉంటుంది .శ్రీ సోమనాథేశ్వర్ ఆలయ ప్రాంగణంలోకుడివైపు వినాయకుడు,గర్భాలయంలో ఎడమ వైపు గణపతి ,కుడి వైపు హనుమంతుడు ఆలయం బయట మండపంలో భక్తులకు మహా మృత్యుంజయ  మండపం దర్శనం ఇస్తుంది.  గుడిలోనికి ప్రవేశించగానే ఎడమ ప్రక్కన సముద్రపు కెరటాలు ఉవెత్తున ఎగసి పడుతూ ఉంటు చుట్టూ ఖాళీస్థలం,చుట్టూ చిన్న చిన్న మండపాలు ఉంటాయి.సోమనాధ్ వెళ్ళడానికి అహ్మదాబాద్ నుంచి వీరవాల్ వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడ నుంచి 7 కి. మీ బస్ లేదా ఆటోలో ప్రయాణించి సోమనాథుని గుడికి చేరుకోవచ్చు. ఆహ్మాబాద్ నుంచి వీరవాల్ కు 400 కి. మీ.
ఈ గుడి చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు:
శ్రీ కృష్ణుడు నిర్మాణం చెందిన వృక్షం స్థలం,
భేట్ద్వారకా ,శ్రీ కృష్ణుడు గోపికలు చీరలు ఎత్తుకెళ్లిన గోపితలాబ్,ఇతర గుళ్ళు గోపురాలు ఉన్నాయి.భేటీద్వారక కి వెళ్ళడానికి కొద్దిసేపు సముద్ర ప్రయాణం చేయాలి.


Sri Somnatheswara Swamy Temple Address:
Somnath Prabhas Patan,
Junagadh,
Gujarat 362268.

Sri Somnatheswara  Swamy Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening  : 4 pm to 9  pm

Shree Somnath Online Accommodation Details 
Click here https://booking.somnath.org/GuestHouse/


Somnatheswara swamy temple details, somnateswara temple information in telugu, famous temples in gujurat, history of somnateswaraswamy temple, somanadeswara swamy temple details,12 jyotirlingas, somnatheswara swamy temple pdf file, hindu temples guide.

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు