Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhagavad Gita 1st Chapter 37-47 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


నమస్కారం భగవద్గీత నేర్చుకోవడానికి వీలుగా హైందవి వారి సహాయం తో ఆడియో లో కూడా ఉంచడం జరిగింది. 
శ్రీమద్ భగవద్ గీత ప్రథమోఽధ్యాయః
అథ ప్రథమోఽధ్యాయః |

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్స్వబాంధవాన్ |

స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ‖ 37 ‖
భావం : బంధువులైన దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు మంచిది కాదు.మాధవా ! స్వజనాన్ని వధించి ఎలా సుఖపడగలం ?

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ‖ 38 ‖
భావం : రాజ్యకాంక్ష పరులైన కౌరవుల వంశనాశనం, మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేక పోతున్నారు.

కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ‖ 39 ‖
భావం : జనార్ధన! వంశ క్షయంవల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనం ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు? 

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ‖ 40 ‖
భావం : వంశనాశనంతో ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి. వంశమంతట అధర్మం అమలుకుంటుంది.

అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ‖ 41 ‖
భావం : కృష్ణా ! అధర్మం ప్రబలితే కులస్త్రీలు చెడిపోతారు. దానితో జాతి సంకరం జరుగుతుంది.


సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ‖ 42 ‖
భావం : వర్ణసంకరంవల్ల, కులానికి కులనాశకులకు కలిగేది నరకమే. వారి పితృ దేవతలు పిండోదక లేక అధోగతి పాలవుతారు.

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ‖ 43 ‖
భావం : కులాన్ని నాశనం చేసే వాళ్ల మూలంగా కలిగే వర్ణ సాంకర్యం కారణంగా శాశ్వతలైన జాతి ధర్మాలు, కుల ధర్మాలు అడుగంటి పోతాయి.

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ‖ 44 ‖
భావం : జనార్ధన ! కుల ధర్మాలు నశించిన కుటుంబాల వారు శాశ్వత నరకవాసులావుతారని వింటున్నాము.

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ‖ 45 ‖
భావం : ఎంత ఆశ్చర్యం! రాజ్య లోభంతో బంధువులను చంపడానికి పూనుకొని ఘోర పాపాలు చేయడానికి సిద్దపడ్డాము కదా !

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ‖ 46 ‖
భావం : ఆయుధాలు ధరించిన ధార్త రాష్ట్రులు అస్త్రశస్త్రాలు విసర్జించిన నన్ను యుద్దంలో సంహరిస్తే అది నాకు మరింత మంచిదే కదా.

సంజయ ఉవాచ |

ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ‖ 47 ‖
భావం : సంజయుడు ! అర్జునుడు అలా చెప్పి దుఃఖాక్రాంతుడై విల్లమ్ములు విడిచి పెట్టి రణరంగంలో రధం మీద చతికిలబడ్డాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే


అర్జునవిషాదయోగో నామ ప్రథమోఽధ్యాయః ‖1 ‖
bhagavad gita 2nd chapter






1వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 1st chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

  1. Chala chala bagundi naku bhagavatgita nerchukovalani chala rojulu ga vethukuthunna epatiki oka manchi channel dorikendi thanks to temple guide 🙏🙏🙏🙏

    ReplyDelete

Post a Comment