Drop Down Menus

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి? తెలుగు జాతకం | Telugu Astrology - Telugu Jathakam

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?

జాతక చక్ర ఫలితానికి 'గణితం' ప్రధానమైనది. జన్మ వివరాలు, సమయము మొదలగునవి సరైనవి కాక తప్పుడు వివరాలు కానీ, స్కూల్ సర్టిఫికేట్ ఆధారంతో చెప్పేవి పండితునికి చెబితే ఫలితాలు తప్పుతాయి. సదరు వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పుగా వస్తాయి. సరైన భవిష్యత్తును తెలుసుకోవలనుకుంటే పుట్టిన వివరాలు సరైనవి అయి ఉండాలి. మానవుని జీవితంలో జాతక చక్రము ఎంతో అత్యావశ్యమైనదిగా చెప్పబడింది. జాతకం మన జీవిత రేఖను తెలియజేస్తుంది. గ్రహ స్థితిని అనుసరించి మనం తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి కాపాడబడి ఉపశమనం పొందగలము.

Also Readఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

ప్రతి తల్లిదండ్రులకు సంతానం కలిగిన మరుక్షణంలో కలిగే ప్రధాన సందేహం పుట్టిన వారి జాతకం ఎలా ఉన్నది, ఏ పేరు పెట్టాలి, ఏ అక్షరాలు పేరుకు అనుకూలంగా ఉంటాయి, జాతకంలో ఏవైనా దోషాలున్నాయా, ఉంటే వాటి నివారణకు ఏం చేయాలి అని, ఇలా చాలా సందేహాలు మనసులో మెదులుతుంటాయి. సంతానం యొక్క జన్మ నక్షత్రం, రాశి,  జన్మనామం, పేరుకు తగిన అక్షరాలు, జనన కాల దోషాలు మొదలగు వివరాలు జాతకం ద్వారా తెలుస్తాయి. 

పిల్లల జాతకం తెలుసుకోవటమే కాకుండా, వారి పేరుకు తగిన అక్షరాలు, జాతక దోషాలు, నక్షత్ర, తిథి సంబంధమైన దోషాల వివరాలు అందిస్తుంది. పూర్వకాలంలో శిశువు జన్మించిన వెంటనే అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుని ద్వారా శిశువు యొక్క తాత్కాలిక జాతకచక్రం గణన చేయించి మంచి, చెడులు తెలుసుకునే వారు. కొన్ని దేశాల్లో శిశువు పుట్టిన కొద్ది గంటల్లోనే పేరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నందున, అప్పుడే పుట్టిన పిల్లల జాతకవివరాలు తెలుసుకోవటానికి జ్యోతిషం ఉపయోగ పడుతుంది. జాతక చక్రముతో పాటు, ఘాత చక్రం, అదృష్ట అంశములు, దశాంతర్దశ పట్టికలు మొదలైనవన్నీ తెలుస్తాయి.

Also Readబియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 

జన్మ పత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి :- శిశువు జన్మించిన 10 రోజుల తర్వాత అంటే పురుడు అయ్యాక జన్మ పత్రిక వ్రాయించు కోవాలి. జాతకం వ్రాయించు కోవడానికి జ్యోతిష పండితుని వద్దకు వెళ్లేముందు "స్వయంపాకం" , పండ్లు తీసుకొని వెళ్ళాలి. జాతకం వ్రాయించు కున్నాక వారికి దక్షిణ ఇచ్చి జాతక వివారాలను తెలుసుకోవాలి. ఒక వేళ ఎవరికైన నక్షత్ర పాద శాంతి ఏర్పడినచో  శిశువు పుట్టిన తేదీ నుండి 27 రోజుల లోపు జప, శాంతి కార్యక్రమం జరిపించుకోవాలి. శాంతి అనేది శిశువు జన్మించిన నక్షత్ర పాద దోషమే కాకుండా ప్రేగులు మేడలో వేసుకుని పుట్టినా, కాళ్ళు ముందుగా బయటకు వచ్చినా, శిశువు తలిదండ్రుల లేదా తోబుట్టువుల నక్షత్రంలో పుట్టిన శిశువునకు శాంతి ఏర్పడుతుంది కావున దాని నివారణార్ధం శాంతి జరిపించుకోవాలి.

"కర్మాచరణలో మానవుడికి పూర్తి స్వేచ్చ ఉన్నది.

ఆ స్వేచ్చే లేకుంటే కర్మలేదు, కర్మ లేకుంటే జన్మలేదు"

వేదాలలో చెప్పబడిన శాస్త్రములన్నింటిలో జ్యోతిష శాస్త్రం ప్రధానమైనది. వ్యక్తి గత జాతకం ద్వారా శారీరక, మానసిక స్థితి గతులను, గతజన్మ కర్మ ఫలితాల ఆధారంగా ప్రస్తుత జన్మలో మంచి, చెడులను తెలుపుతూ దానిని సరిదిద్దుకునే అవకాశం శాస్త్రం కల్పించింది. సత్కర్యాచరణ ద్వారా మనకున్న ఇబ్బందులను దూరం చేసుకోవచ్చును అని శాస్త్రాలు నొక్కి వక్కానిస్తున్నాయి. సమస్యలు వచ్చాక అవి తీవ్ర స్థాయికి చేరాక జ్యోతిషుని సంప్రదించేకంటే, అన్ని వేళల్లో జ్యోతిష్కుని సంప్రదిస్తూ ఉండాలి. ఫ్యామిలీ డాక్టర్ కన్నఫ్యామిలీ అస్ట్రాలజర్ మిన్న. డాక్టర్ వ్యాధి వచ్చిన తర్వాతనే వైద్యం చేస్తాడు. అదే జ్యోతిష్కుడు జాతక గ్రహ స్థాయిని బట్టి ఇబ్బందులు రాకుండా తరుణోపాయ మార్గాలను సూచించి అన్ని విధాలా శ్రేయస్సును కలిగిస్తాడు. అందుకే జ్యోతిష్కున్ని ఎప్పుడు?  సంప్రదించాలని కాకుండా ఎప్పుడూ సంప్రదిస్తూనే ... ఉండాలి.

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

జ్యోతిషశాస్త్రం,  జాతకం, Telugu Jatakam, Telugu Astrology, Jathakam, online jathakam for marriage, jathakam in english, Free Horoscope,  free horoscope Telugu, horoscope meaning

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Pavan siva sai dob: 20 _08_2012 vja 2-28 afternoon

    ReplyDelete
  2. Namasti swamy, maku babu second papa babu dob march 12 morning 9.45 2018

    ReplyDelete
    Replies
    1. Papa dob 2/05/ 2020 at 9.00 Am please tell me swamy what about feature

      Delete

Post a Comment

FOLLOW US ON