అక్టోబర్ నెలలో పుట్టిన వారి ఫలితాలు..
అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ, పురుషులకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందంగా అలంకరించుకుంటారు. ఇతరులను ఆకర్షించగలరు.
ఇతరులను ఆకర్షించగల శక్తి వీరికి ఉంటుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. స్నేహం. చేయగలరు. ఈ నెలలో పుట్టిన వారు మహాశక్తివంతులు. ఏ పనినైనా సాధించ గలరు. ముఖ్యంగా అనుకొన్న పనిని సాధించనిదే వీరికి నిద్ర పట్టదు. ధైర్యం చేస్తారు.
మంచి తెలివితేటలు లౌకికజ్ఞానం వీరిసొంతం. కళలయందు అభిరుచి ఉంటుంది. కళలో ప్రవేశం ఉంటుంది. వీరు భోగపురుషులు, సంసార సుఖమందు ఎక్కువ తాపత్రయం ఉంటుంది. అయినాసరే వీరికి దైవభక్తి ఉంటుంది. క్రమశిక్షణ పాటిస్తారు. తమ తెలివితేటలతో, శక్తియుక్తులతో పనులు సాధించుకుంటారు. ఫలితం లేనిదే ఏ పనిచేయరు. వీలయినంత వరకు వారి ఆత్మవిశ్వాసాన్ని, తెలివితేటలనే నమ్ముకుంటారు. స్వయంకృషిని నమ్ముకొంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఏ విషయంలోనైనా, ఎట్టి పరిస్థితులలోనైనా ఆ పనిని సాధించుకొంటారు. వదలి పెట్టరు.
వీలయినంతవరకు బ్యాలెన్స్ గా మాట్లాడుతారు. వీరికి ఏదో ఒక విషయంలో మంచి విజ్ఞానము ఉంటుంది. ఇతరుల విషయాలలో అభిరుచి చూపిస్తారు. అవకాశం ఉన్నంతవరకు మేలుచేస్తారు. అవసరం అనుకున్నపుడు సర్దుబాటు చేసుకోవాలన్నది వీరి తత్వం. పద్ధతులను, క్రమశిక్షణను పాటిస్తారు. వీరిలో గొప్ప శాస్త్రజ్ఞులు, కళాకారులు, విద్యావంతులు, డాక్టర్లు ఉన్నారు.
వీరికి సున్నితమైన మనస్సు ఉంటుంది. మొహమాటపడతారు. పరిస్థితులు అనుకూలించని పక్షంలో సర్దుకుపోతారు. ఇతరులను ఇబ్బంది పెట్టరు.
ఆరోగ్యము: ఈ నెలలో పుట్టినవారి ఆరోగ్యం నార్మల్ గా ఉంటుంది. వీరికి కామవాంఛ ఎక్కువ. చర్మవ్యాధులు, షుగర్ వ్యాధులు రావచ్చును.
ధనము: శ్రమచేసి, తెలివితేటలను ఉపయోగించుకొని సంపాదిస్తారు. అనుభవిస్తారు.
లక్కీ వారములు: సోమవారం, గురువారము, శుక్రువారము అదృష్టం నిచ్చు వారములు.
లక్కీ కలర్ దుస్తులు: వీరు బ్లూరంగు, రోజ్ కలర్ దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
లక్కీ స్టోన్స్: ముత్యం లేదా ఓపల్స్టన్ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
Related Posts:
> జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది
> ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
అక్టోబర్ నెలలో పుట్టిన, negative traits of october born, facts about october born girl, marriage life of october born, love life of october born girl, career for october born, best match for october born, 10 things to expect when in a relationship with an october born, october babies zodiac sign