కర్ణాటక లో పుణ్యక్షేత్రాలు చూడడానికి వెళ్లే వారికోసం రూట్ మ్యాప్ ను కూడా సేకరించడం జరిగింది అది కూడా మీకు అందిస్తున్నాను
కర్ణాటక లొ గోకర్ణం నుంచి కుక్కే సుబ్రహ్మణ్య వరకూ పుణ్య క్షేత్రాలు
మీరు ముందుగా గోకర్ణ చేరుకోండి
గోకర్ణ శ్రీ మహా గణపతి దేవ్ ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు
గోకర్ణ మహాబలేశ్వర్ (శివుని ఆత్మలింగ) ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు (గోకర్ణం నుండి మురుడేశ్వర్ 82 కిలోమీటర్లు)
మురుడేశ్వర్ శ్రీ మురుడేశ్వర స్వామి ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 12:00 వరకు సాయంత్రం 3:00 నుండి 8:15 వరకు (మురుడేశ్వర్ నుండి కొల్లూర్ 61 కిలోమీటర్లు)
కొల్లూరు: శ్రీ మూకాంబిక ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 1:30 వరకు సాయంత్రం 5:00 నుండి 9:00 వరకు (కొల్లూర్ నుండి కోటేశ్వర్ 25 క కిలోమీటర్లు)
కోటేశ్వర: కోటిలింగేశ్వర ఆలయం: దర్శన సమయం: ఉదయం 05:00 నుండి రాత్రి 9:00 వరకు (కోటేశ్వర్ నుండి కుంభాషి 4 వరకు)
కుంభాసి ఆనెగుడ్డె శ్రీ వినాయక దేవాలయం: దర్శనం ఉదయం 6:00 నుండి రాత్రి 8:30 వరకు (కుంభాషి నుండి శంకరనారాయణ 27 కిలోమీటర్లు)
శంకరనారాయణ: శ్రీ శంకరనారాయణ ఆలయం: దర్శనం ఉదయం 7:30 నుండి 12:30 మధ్యాహ్నం 4:30 నుండి 7:30 వరకు (శంకరనారాయణ నుండి ఉడుపి 45 కిలోమీటర్లు)
ఉడుపి శ్రీ కృష్ణ ఆలయం: దర్శనం ఉదయం 5:00 నుండి 11:00 వరకు సాయంత్రం 6:00 నుండి 9:00 వరకు (ఉడుపి నుండి శృంగేరి 83 కిలోమీటర్లు)
శృంగేరి శ్రీ శృంగేరి శారదా పీఠం: దర్శనం6:00 నుండి 2:00 వరకు 4:00నుండి 9:00 వరకు (శృంగేరి నుండి హొరనాడు 41 కిలోమీటర్లు)
హొరనాడు అదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం: దర్శనం ఉదయం 6:30 నుండి 9:00 వరకు, మధ్యాహ్నం 11:00 నుండి 2:00 వరకు, రాత్రి 7:00 నుండి 9:30 వరకు (హొరనాడు నుండి ధర్మస్థల 91 కిలోమీటర్లు)
ధర్మస్థల శ్రీ క్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం: దర్శనం ఉదయం 6:00 నుండి 2:00 వరకు సాయంత్రం 5:00 నుండి 8:30 వరకు(ధర్మస్థలం నుండి కుక్కేసుబ్రహ్మణ్యం 54 కిలోమీటర్లు)
కుక్కే శ్రీ అది సుబ్రహ్మణ్య ఆలయం: దర్శనం ఉదయం 6:30 నుండి 1:30 మధ్యాహ్నం 3:30 నుండి 8:30 వరకు
ఈ టూర్ ప్లానింగ్ లు కూడా చూడండి
తమిళనాడు టూర్ ప్లానింగ్కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర పూజ వివరాలు
తిరుపతి చుట్టుప్రక్కల చూడాల్సిన ఆలయాలు
మదురై చుట్టుప్రక్కల 8 ప్రదేశాలు
keywords : karnkata tour plan, karnataka mous places, karnataka tour packages, karnataka tour details.






టెంపుల్ దగ్గరలో రూమ్ లు గాని వసతి గాని వాటి పేర్లు కూడా ఇస్తే బాగుంటుంది
ReplyDeleteEkkada stay cheyali vivaralu kuda ivvandi
ReplyDeleteరాజా చంద్ర గారు శుభోదయం
ReplyDeleteమేము కుటుంబ సభ్యులం గోకర్ణ ట్రిప్ వెళ్ళాం. మీరు మన app లో post చేసిన విధంగా హుబ్లీ నుండి ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళాం. హైదారాబాద్ నుండి 3.10.2025 సాయంత్రం 0350 కి హుబ్లీ ట్రైన్ ఎక్కాం. హుబ్లీ లో ఉదయం 6 గంటలకు దిగాం. అక్కడి నుండి కారు లో వెళ్ళాం. ముందుగానే కారు 5 రోజులకు బుక్ చేసుకున్నాం. గోకర్ణ లో ఓం ఇంటర్నేషనల్ హోటల్ లో 2 రూమ్స్ తీసుకున్నాం. MakeMyTrip లో 7600 పడింది ఒక రోజు కు రెండు రూమ్లకు. హోటల్ చాలా బావుంది. ఉడిపి లో మా డిపార్ట్మెంట్ inspection quarters 3 రోజులకు బుక్ చేసుకున్నాం. మేము గోకర్ణ, iduganji గణపతి ఆలయం, మురుడేశ్వర ఆలయం, మూకాంబిక ఆలయం, ఉడిపి శ్రీ కృష్ణ ఆలయం, ధర్మస్థల మంజునాథ ఆలయం, కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, శృంగేరి శారదా మాత దర్శనం అలాగే Honavar back వాటర్స్ లో mangrove forests, jog falls కూడా వెళ్ళాం. గోకర్ణ మరియు ఉడిపి లో బీచెస్ చూసాం. ట్రిప్ చాలా బాగా జరిగింది. 8.10.2025 నాడు రాత్రి హుబ్లీ నుండి sampark క్రాంతి train 0825బయలు దేరి హైదారాబాద్ 9.10.2025 ఉదయం 800 గంటలకు చేరుకున్నాం.
మా కారు డ్రైవర్ చాలా మంచి వాడు. చాలా ఓపికగా అన్నీ చూపించాడు. మీరు యాప్ లో పోస్ట్ చేసిన దానికంటే కొంచెం మార్చి నాకు ఒక ట్రిప్ ప్లాన్ ఇచ్చాడు. దానిని పోస్ట్ చేస్తున్నాను. వేరే వాళ్ళకు ఉపయోగ పడుతుంది. మేము ముందుగ బుక్ చేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళడం వలన horanadu అన్నపూర్ణ అమ్మ వారి దర్శనం చేసుకోలేక పోయాం. అతని ప్లాన్ ప్రకారం అయితే అయ్యేది. కానీ మాకు ఉడిపి లో 3 రోజులు రూమ్ బుక్ అయి ఉండటం వలన మా ప్లాన్ ప్రకారం వెళ్ళాం.
అతను ఇచ్చిన టూర్ ప్లాన్
Hubli-sringeri-horanadu-dharmasthala-durgaparameshwari kattil-udupi- kollur-murudeshwar-idagunji-honavar-jog falls-gokarna- vibhuti falls-yana caves- gante Ganesh yellappura- Hubli
ధన్యవాదాలు
G SHANKAR GOUD Hyderabad 🙏🙏