2025 మేష రాశి ఫలితములు | 2025 Aries Mesha Rashi Phalitalu

మేష  రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ ద్వితీయస్థానమున వృషభ రాశియందు తామ్రమూర్తిగాను, అనంతరం అక్టోబరు 18 వరకూ తృతీయ స్థానమున మిధునరాశియందు లోహమూర్తిగాను, అనంతరం డిశంబరు 5 వరకూ అర్ధాష్టమ స్థానమున కర్కాటక రాశియందు రజితమూర్తిగాను, అనంతరం సంవత్సరాంతం వరకూ తృతీయమున మిధునరాశియందు రజితమూర్తిగాను సంచరించును. 

శని ఈ సంవత్సరం అంతయూ ద్వాదశమందు మీనరాశియందు లోహమూర్తిగాను సంచరించును. రాహు కేతువులు సంవత్సరాది నుండి మే 18 వరకూ రాహువు ద్వాదశమందు మీనరాశియందు కేతువు, షష్ఠమ స్థానమున కన్యరాశియందు రజితమూర్తులుగాను అనంతరం రాహువు లాభమందు కుంభరాశియందు కేతువు పంచమస్థానమున సింహరాశి యందు తామ్రమూర్తులుగా సంచరించును.

2025 మేష రాశి ఫలితములు

2025 మేష రాశి ఫలితములు

అశ్విని - 1, 2, 3, 4; 

భరణి - 1, 2, 3, 4; 

కృత్తిక - 1.

ఆదాయం - 2, వ్యయం - 14

రాజ్యపూజ్యం - 5, అవమానం - 7


ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం సామాన్యముగా యుంటుంది. మే 14 వరకూ గురుడు ద్వితీయస్థాన సంచారము వరకు అప్పటి వరకూ ఆదాయం బాగుంటుంది. మనస్సున ఆనందము, కీర్తి ప్రతిష్ఠలు, ధర్మకార్యములు, శుభకార్యములు జరిపించుట. తరువాత సంవత్సరం అంతయూ సామాన్యజీవనము. శ్రమకు తగిన ఫలితము లేకుండుట, బంధువులతో, చుట్టుప్రక్కల వారితోను కలహములు. సమయానికి ధనము చేతికందకపోవుట. లేక ఎంత ధనమున్ననూ ప్రశాంతత లేకపోవుట. వ్యాపారము సరిగా జరగకుండుట, శరీరమున నొప్పులు, చేయు ఉద్యోగము చెడిపోవుట. శ్రమ అధికమగుట. మనఃచాంచల్యము ధనము నష్టపోవుట. ఉన్న ఊరు వదిలి ఇతర గ్రామములు యందు, వ్యాపారము చేసి నష్టపోవుట, ప్రతీ వారిని నమ్మి మోసపోవుట, శని ప్రభావము వలన మనస్సున ఆందోళన, చేయు వృత్తి వ్యాపారముల యందు ఇబ్బందులు. ఇతరులను నిందించుట. ఆకలి లేకపోవుట, ఉదర సంబంధిత అనారోగ్యములు. గృహమునందు ఏదో అలజడి, నేత్ర బాధలు, శత్రుభయం, ఏదో తెలియని భయము. పిరికితనము, దేహము తేజస్సు తగ్గుట, తెగింపు. కోపము. 

ద్వితీయార్ధము ధనము ఏదో విధముగా చేతికందుట. విందు వినోదాలు కొరకై ధనవ్యయం. నూతన గృహ నిర్మాణములు కలిసి వచ్చును. మాట దురుసుతనము తగ్గించుకొనుట మంచిది. ఆర్థిక ఒడిదుడుకులున్ననూ ధైర్యము అధికము. అనుకోని పెట్టుబడులు. 

రాజకీయ నాయకులకు అనుకూలముగా ఉంటుంది. 

సెటిల్మెంట్ చేయువారికి మంచికాలము. 

రియల్ ఎస్టేట్ యందు ఈ సంవత్సరం అంత అనుకూలము కాదు. ప్రజలలో గుర్తింపు ఉంటుంది. 

ఉద్యోగస్తులకు అనుకొన్న చోటికి బదిలీలు. 

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, అన్నదమ్ముల మధ్య, ఇతరుల మధ్య తలదూర్చుట వలన ఇబ్బందులు, కోర్టు లావాదేవీలు మంచిగా జరుగును. 

విదేశములలో ఉన్నవారు స్వదేశాగమనం, నూతన వ్యక్తులు పరిచయాలు లాభించును. సంతానం వలన మంచి ఆదాయం. ఉద్యోగములు వచ్చుట వలన ఆనందము. 

పూర్వము ఆగి ఉన్న పనులు పూర్తి చేయగలరు. గృహమున తప్పక శుభకార్యములు జరుగును. సంతానం లేని వారికి సంతాన యోగం,

 విద్యార్థులు ఎంత కష్టపడినా జ్ఞాపకశక్తి కొంచెం మందముగా యుండును. ఇతర ఆలోచనలు అధికము. సెల్ఫోన్లు ఇతర వ్యవహారములు యందు దూరంగా ఉన్న యెడల మంచి జయం సాధించెదరు. ఇంజనీరింగ్, మెడిసిన్, లాయర్లలకు మంచికాలము. సినీ మరియు ఇతర కళాకారులకు, టి.వి., పత్రిక, ఇతరత్రా వృత్తి, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కష్టపడిన ఫలితం అర్థశాతమే (50%) మాత్రమే. గుర్తింపు లేకుండుట. 

వ్యవసాయంలో కాఫీ, అరటి, కొబ్బరి, రొయ్యల చెరువుల వారికి మంచి దిగుబడి వచ్చును. కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, వెండి, బంగారం, అపరాలు నిల్వ చేయువారికి కాంట్రాక్టరులకు అంత అనుకూలము కాదు. నరఘోష అధికము. తన క్రింద పనిచేయువారితో ఇబ్బందులు, బ్యాంక్ సంబంధిత పనులు ఆలస్యం. 

స్త్రీలకు : 

స్త్రీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. భర్త విషయాన రాజీకి వచ్చుట మంచిది. తరువాత కాలము మీకు అనుకూలముగా ఉండును. వ్యాపారము చేయువారికి పెట్టుబడులు తగ్గించాలి. 

ఉద్యోగము చేయువారు అనుకొన్న పనులు పూర్తికాక అసహనం. విద్యార్థులు కష్టపడాలి. వివాహం కానివారికి వివాహయోగం. సంతానయోగం, మీ పట్టుదలలు అంతపనికిరావు.

Keywords : Horoscope , 2025 Rashi Phalalu , 2025 mesha rashi phalitalu, 2025 horoscope,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS