ధనుస్సు రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ షష్ఠమున వృషభరాశియందు తామ్రమూర్తిగాను అనంతరం అక్టోబరు 18 వరకూ సప్తమమున మిధునరాశియందు లోహమూర్తిగాను అనంతరం డిశంబరు 5 వరకూ అష్టమమున కర్కాటక రాశియందు రజితమూర్తిగాను, అనంతరం సంవత్సరాంతం వరకూ సప్తమమున మిధునరాశియందు సువర్ణమూర్తిగా సంచరించును.
శని ఈ సంవత్సరం అంతయూ అర్ధాష్టమమున మీనరాశియందు లోహమూర్తిగా సంచరించును. రాహుకేతువులు : మే 18 వరకూ రాహువు అర్ధాష్టమ స్థానమున మీనరాశియందు కేతువు దశమమందు కన్యారాశియందు సువర్ణమూర్తులుగాను అనంతరం సంవత్సరాంతం వరకూ రాహువు తృతీయమున కుంభరాశియందు కేతువు నవమమున సింహరాశియందు రజితమూర్తులగా సంచరించును.
2025 ధనుస్సు రాశి ఫలితములు
మూల1, 2, 3, 4 పా.,
పూర్వాషాఢ 1, 2, 3, 4 పా.
ఉత్తరాషాఢ 1 పా.
ఆదాయం - 5, వ్యయం - 5,
రాజ్యపూజ్యం - 1, అవమానం - 5
ధనుస్సు రాశి స్త్రీపురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం అన్నివిధాలయోగదాయకం. ప్రతీ ఆలోచన దూరముగా ఆలోచించి చేయడం ఎక్కువకాలం ఆనందదాయకం ధనము. కీర్తి గౌరవము. అంచెలంచెలుగా పెరుగును. స్థిరాస్తులు. విలువైన భూములు, వాహనములు, గృహనిర్మాణములు, కలిగి వచ్చును. కోర్టు ఇతరత్రా వ్యవహారములు మీకు అనుకూలముగా వచ్చును. దీర్ఘకాలిక అనారోగ్యము నుండి ఉపశమనం కలిగి ఆనందము రాజకీయ లేక పెద్దవారితో పరిచయాలు. ఇష్టమైన ఏ పని అయిననూ సిద్ధించుట. స్వతంత్రముగా జీవనము, జాయింట్ వ్యాపారాలు కూడా మీరు సొంతం చేసుకొని మంచిలాభాలు ఆర్జించెదరు. విదేశములలో ఉన్నవారు స్వదేశమునకు వచ్చి స్థిరత్వము పొందెదరు.
విదేశీయానము చేయువారికి మంచి లాభములు. పాత ఋణములు తీరును. భార్యాభర్తల మధ్య మాత్రం ఇబ్బందులు. తీరిక లేకుండా పనిచేయుట వలన అలసట, చికాకు, ఆదాయంతోపాటు గుర్తింపు పదవులు వచ్చును. దుబారా ఖర్చు అధికము, వ్యసనములు కలవారు ఆరోగ్యమునందు జాగ్రత్త. శని 4వ స్థానమున సంచరించుటవలన కీళ్ళు, నడుము, శరీరమున నొప్పులు జీర్ణక్రియ ఇబ్బందులు. మనస్సున ఆలోచన జ్ఞాపకశక్తి మందము. కారణము లేక విరోధములు. పాపపు కార్యములకై ఆసక్తి,
ఉద్యోగస్తులకు పై అధికారుల పరిచయాలు. గృహమున శుభకార్యాలు, ఉన్నత స్నేహ లాభములు. ఉద్యోగములో మంచి అభివృద్ధి అనుకొన్న చోటికి బదిలీలు. మంచి విద్యకు ప్రయత్నములు అనుకూలము. నిరుద్యోగులకు ఉద్యోగలాభం ప్రైవేటు సంస్థలలో పనిచేయువారికి మంచి ప్రోత్సహకాలము. విద్యార్థులు ఉన్నత విద్యలకు అవకాశం ఎక్కువ మంచి ర్యాంకులకు ఉత్తీర్ణత, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఉద్యోగ లాభము గ్రూప్ ప్రవేశ పరీక్షలయందు మంచి అనుకూలమైన వాతావరణం.
వ్యవసాయదారులకు రెండవ పంట లాభించును. పళ్ళు, పూలు, చెరుకు, రొయ్యల చెరువులు, అరటి, మామిడి, కోకో పంటలు మంచిలాభములు. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలమే కానీ అభిప్రాయ బేధములు, జాయింట్రులతో నష్టము. నమ్మించి మోసగించుట. కోర్టు వ్యవహారములు వలన మనశ్శాంతి లేకుండుట, అత్యధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు ఈ సంవత్సరం చేయవద్దు. రాజకీయ నాయకులకు శ్రతుబాధలు, అవమానములు. కొత్త సమస్యలు ఎదుర్కొందురు. ఆశించిన పదవులు రాకపోవుట వలన ఇబ్బందులు. సొంత అన్నదమ్ముల మధ్య విరోధాలు. ఆఫీసులో సమస్యలు. స్త్రీలకు ఆరోగ్యమందు జాగ్రత్త అవసరం. మడమలు, మోకాళ్ళు సంబంధిత అనారోగ్య సమస్యలు, సంతానంతో ఇబ్బందులు, స్థానచలనములు, చేయు ఉద్యోగులతో జాగ్రత్తగా మెలగాలి. వివాహ విషయంలో చికాకులు, క్రీడారంగం. గాయనీలకు ఆశించిన లక్ష్యము చేకూరదు.
మూలనక్షత్రం వారికి ఉద్యోగమునందు మీదే పైచేయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, స్త్రీ మూలక పరిచయాలు, తీర్థ యాత్రలు, ధనాదాయం బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అనవసరముగా ఖర్చు అధికము, కుటుంబ కలహాలు, ఇంటి ఇబ్బంది. బయట గౌరవ మర్యాదలు, ఉత్తరాషాఢ వారికి అన్ని రంగాల అనుకూలం. వివాహ ప్రయాణము యందు జాగ్రత్త అవసరం, నాయత్వమునకు మంచికాలము కాదు.
keywords : dhanussu rashi phalitalu, 2025 Panchangam, 2025 rashi phalalu
Tags
2025 Rashi Phalalu