వృశ్చికరాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ సప్తమమున వృషభరాశి యందు తామ్రమూర్తిగాను, అనంతరం అక్టోబరు 18 వరకూ అష్టమయందు మిధునరాశియందు సువర్ణమూర్తిగాను తదుపరి డిశంబరు 5 వరకూ భాగ్యమున కర్కాటకరాశియందు తామ్రమూర్తిగాను అనంతరం సంవత్సరాంతం వరకూ అష్టమమున తామ్రమూర్తిగాను సంచరించును.
శని ఈ సంవత్సరం అంతయూ పంచమమున మీనరాశియందు రజిత మూర్తిగా సంచరించును. రాహుకేతువులు మే 18 వరకూ రాహువు పంచమమున మీనరాశియందు కేతువు ఏకాదశమందు కన్యారాశియందు తామ్రమూర్తులుగాను, అనంతరం సంవత్సరాంతం వరకూ రాహువు అర్ధాష్టమ స్థానమున కుంభరాశియందు కేతువు దశమమందు సింహరాశియందు తామ్రమూర్తులుగా సంచరించును.
2025 వృశ్చికరాశి ఫలితములు
విశాఖ 4పా.
అనూరాధ1,2,3,4పా,
జ్యేష్ఠ 1,2,3,4పా.
ఆదాయం - 2, వ్యయం - 14,
రాజ్యపూజ్యం - 5, అవమానం - 2
వృశ్చికరాశి స్త్రీ పురుషాదులకు గ్రహమున్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమముగా యుంటుంది. గత సంవతసరము కంటే కొంచెం మేలుగా యుంటుంది. ధనము గౌరవము విషయమున అన్ని రకాల బాగుటుంది. నూతన గృహనిర్మాణములు ఆగి ఉన్న పనులు పూర్తి అగుట. స్థిరాస్తులను ఋణము చేసి అయినా కొనుగోలు చేయుట. నూతన వ్యాపారములకు శ్రీకారము. వాహనయోగము. బ్యాంక్ వారితో పరిచయములు వలన ధనము చేతికందుట. గృహమున శుభకార్యాలు. రాహువు, గురుడు యొక్క ప్రభావముచే ధనాదాయం బాగున్ననూ ఏదో తెలియని అశాంతి స్త్రీ మూలక కలహములు. కోర్టుచిక్కులు. ప్రతి చిన్న విషయమునకు ఆందోళన లేక కోపము చికాకు. కీళ్ళు, తలకు, సంబంధిత అనారోగ్యాలు. గ్యాస్ సంబంధిత అనారోగ్యములు, స్థాన మార్పులు. జాయింట్ వ్యాపారస్తులతో చిన్న చిన్న సలహాలు లేక విడిపోవుట.
ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేక స్థాన మార్పులు లేక ట్రాన్పర్లు వాహన లాభము, స్థిరాస్థివృద్ధి, ఆభరణములు కొనుగోలు చేయుట. గతము జరగక ఇబ్బందులు ఉన్నత పనులు పూర్తి అగుట. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పర్మినెంటు కాని వారికి పర్మనెంట్. విద్యార్థులకు దూరదేశ విద్యను అవకాశములు టెక్నికల్, సినిమా రంగం, శాస్త్ర పరిశోధన విద్యలకు మంచి అనుకూలము. ప్రతీ విషయాన చురుకుదనము కలిగియుండుట. అందర్నీ ఆకట్టుకొంటారు. వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలము. గతము చేసిన ఋణముల తీరుట. పండ్లు, అరటి ఆకు, చెరకు, జామ, ద్రాక్ష పూల పంటలు వారికి మంచి ప్రోత్సాహకాలము. స్థిరాస్తులు వృద్ధి నూతన వాహన లాభం, గృహ నిర్మాణములు స్వతంత్రముగా అభివృద్ధి వ్యాపారస్తులకు నరఘోష అధికము.
నూతన వ్యాపారాలు కలసి వచ్చును. బంధువులతో వైరము, చెరువులు, ఫైనాన్స్ వ్యాపారాల వారి మంచికాలము. అనుకొన్న ప్రతీ పని పట్టుదలతో సాధించెదరు. షేర్ మార్కెటింగ్, యల్.ఐ.సి. ఇతర్రతా ఏజెంట్స్కు, మంచి ధనాదాయం, కిరాణా, నిల్వ సరుకులు, వ్యాపారాలు అనుకూలము. పప్పదినుసులు, శుద్ధి కర్మాగారము వంటి వ్యాపారాలు మంచి లాభదాయకం. మొత్తముగా అన్ని రంగాల వారికి ఇంటా బయటా విలువ పెరుగును.
ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. విశాఖ నక్షత్రము వారికి అధిక వత్తిడి. చికాకు, తన సొంతవారితో విరోధములు అనుమానం. అవమానం. చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగములు బాగుండిననూ జాగ్రత్తగా మెలగాలి. అనూరాధ నక్షతం వారు జాతకం అనుకూలము కాని తండ్రిని కాని తండ్రి తరుపు వారిని అనారోగ్యములు ఇబ్బందులు. జలగండములు.
జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరము అనుకూలము కాని యెడల నరదృష్టి అధికము. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న తగాదాలు,
స్త్రీలకు: ప్రారంభం బాగునన్నూ, క్రమేణా భర్తతో విరోధాలు. సంతాన రీత్యా చిక్కులు ఉద్యోగములో ఉన్నవారిని జూలై నెల నుండి బాగుంటుంది. విద్యార్థినులకు మంచికాలము. వివాహం. కాని వారిని వివాహం ఆగష్టు తరువాత జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి.
keywords : scorpio rashi phalitalu, 2025 scorpio, 2025 rashi phalitalu, 2025 vruschikarashi phalitalu, 2025 panchangam