2025 కన్యారాశి ఫలితములు Vigro Kanyarashi Phalitalu

కన్యారాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ నవమ మందు వృషభరాశియందు రజితమూర్తిగానూ అనంతరం అక్టోబరు 10 వరకూ దశమమందు మిధునరాశియందు తామ్రమూర్తిగానూ అనంతరం డిశంబరు 5 వరకూ లాభమందు కర్కాటకరాశియందు లోహమూర్తిగాను అనంతరం సంవత్సరాంతం దశమమున మిధునరాశి యందు రజితమూర్తిగా సంచరించును. 

శని ఈ సంవత్సరం అంతయూ సప్తమమున మీనరాశియందు తామ్రమూర్తిగా సంచరించును. రాహు కేతువులు మే 18 వరకూ రాహువు సప్తమమున మీనరాశియందు కేతువుజన్మమున కన్యారాశియందు రజితమూర్తులుగాను అనంతరం సంవత్సరాంతం వరకూ రాహువు షష్టమమున కుంభరాశియందు కేతువు ద్వాదశమున సింహరాశియందు రజితమూర్తులుగా సంచరించును.

2025 కన్యారాశి ఫలితములు


2025 కన్యారాశి ఫలితములు

ఉత్తర 2,3,4 పా, 

హస్త1,2,3,4పా. 

చిత్త1,2, పా.

ఆదాయం - 14, వ్యయం - 2; 

రాజ్యపూజ్యం - 6, అవమానం - 6.

కన్యారాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా ఈ సంవత్సరం యోగవంతముగా ఉంటుంది. ధనాదాయం. నూతన గృహ నిర్మాణములు. స్థిరాస్థి వృద్ధి గృహమున ఎల్లప్పుడు సంతోషకరమైన వాతావరణం, వాహనలాభము. విందు, వినోదాలు, శుభకార్యాలు త్వరితముగా పూర్తి అగుట. శత్రుబాధ లేకుండుట. కీర్తి వృద్ధి పేరు ప్రఖ్యాతులు, ఎంత వారు అయిన మీ సలహాకోరుట సంపూర్ణ ఆరోగ్యము. తేజస్సు పెరుగుట, విరోధులు నశించుట, ఎల్లచోట్ల జయము, పెద్దవారి పరిచయాలు. ధర్మకార్యములు కొరకై ధనము హెచ్చించుట, అధికార లాభము. 

పాత ఋణములు తీరుట, ద్రవ్యము నిల్వ చేయుట. ప్రతీ పనియందు విజయము చేకూరుట వలన ఆనందము. యశస్సువృద్ధి. కోర్టు లావాదేవీలు మీకు అనుకూలం భార్యబిడ్డలతో మంచి సత్సంబంధాలు. మంచి మాట చతురత. హాస్య సంభాషణలు గురువుల యొక్క ఆశీర్వచనములు. కొంతకాలముగా ఉన్న కలహములు తగ్గుట. 

నూతన మంచి మంచి పరిచయాలు, కానీ జాతకం ఎంత బాగున్ననూ అహంకారం తగ్గాలి. లొంగివుండి జీవనం చేస్తే మీ ప్రాముఖ్యత ఇంకా పెరుగును. అసూయ, ద్వేషములు విడనాడండి. అక్కర్లేని పట్టుదలకి వెళ్ళి కొన్ని సమస్యలుకొని తెచ్చకొంటారా జాగ్రత్త అవసరం "అంత్య నిష్టారం కన్నా ఆది నిష్ఠూరం గొప్ప" అనే విధముగా మీ జీవనశైలి ఉండాలి. అవును. కాదు అనే విషయాన్ని నాన్చకండి యిబ్బంది పడతారు. ఉల్లాసయాత్రలు, తీర్థయాత్రలు చేయుదురు. రాజకీయనాయకులని మంచికాలము, ఉన్నత పదవులను అధిరోహించెదరు. గుర్తింపు సన్మానాదులు పొందుదురు. 

ధనవ్యయం గొప్పలని పోయి వ్యయము తగ్గాలి. మీ కోపము వలన మీ మిత్రులు దూరమగుదురు. చెప్పుడు మాటలు వినకండి. చూసింది విన్నది మాత్రమే ఆచరించండి. ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉంటుంది. రెండు సంవత్సరాలుగా జరగని పనులు ఈ సంవత్సరం పూర్తి అగును. ప్రమోటర్స్, అనుకొన్న చోటికి బదిలీలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వముల యొక్క మన్ననలు, ఉద్యోగము చేస్తూ మీరు వ్రాసే పరీక్షలయందు ఉత్తీర్ణత. మంచి భవిష్యతకు పునాదికాలము, నూతన వాహన గృహయోగములు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. 

ప్రైయివేట్ కంపెనీలు యందు పనిచేయువారికి గుర్తింపు. జీతం పెరుగుట. ఆరోగ్యము బాగుంటుంది. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం బాగుంటుంది. కానీ, నూతనమైన వ్యవసాయము చేయు సంకల్పం మంచిని ఈ సంవత్సరం బాగుంటుంది. కీటక భయం ఉంటుంది. జాగ్రత్త అవసరము. టెక్నికల్గా విధానములు ఉపయోగించి అధిక లాభాలు పొందుదురు. చేపలు, రొయ్యల చెరువులు వారు. అత్యంత శ్రద్ధగా ఉండాలి వైరస్ వలన యిబ్బంది పడుదురు. 

అరటి, జామ, పళ్ళ జాతులు అత్యంత లాభదాయకం వ్యవహారములు, వ్యాపారములు అన్నియూ బాగుంటాయి. శ్రతుబాధ, సాటి వ్యాపారస్తుల నరదృష్టి అధికము. గృహనిర్మాణములు, ఫ్యాక్టరీలు, కాంట్రాక్టుదారులకు పనులు అధికము, ధనము చేతికందదు. కానీ మరు సంవత్సరమున నుంచి లాభముతో కలిసి వచ్చను. విద్యార్థులు సైన్స్, ఆంగ్లము యందు పట్టుదలతో చదివినా విజయం చేకూరును. దూరవిద్యవారికి అనుకూలము. అలసట అత్యధిక మాటలు మంచిదికాదు.

స్త్రీలకు అనుకూలం వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగలాభము, సంతానయోగం, భార్యభర్తల మధ్య మంచి అనురాగ ఆప్యాయతులు పెద్దవారి మన్ననలు, కళ్ళకు సంబంధిత అనారోగ్య బాధలు, పక్కవారి విషయాన తలదూర్చుట మంచిది కాదు.

keywords : kanyarashi phalitalu, 2025 horoscope, 2025 rashi phalalu, 2025 panchangam, 2025 rashiphalalu temples guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS