ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు మే 14 వరకూ తృతీయమున వృషభరాశియందు సువర్ణమూర్తిగాను అనంతరం అక్టోబరు 18 వరకూ అర్ధాష్టమ స్థానమున మిదునరాశియందు రజితమూర్తిగాను అనంతరం డిశంబరు 5 వరకూ పంచమమున కర్కాటక రాశియందు సువర్ణమూర్తిగాను అనంతరం సంవత్సరాంతం వరకూ అర్ధాష్టమమున మిధునరాశియందు తామ్రమూర్తిగాను సంచరించును.
శని ఈ సంవత్సరం అంతయూ జన్మమందు మీనరాశియందు సువర్ణమూర్తిగా సంచరించును. రాహు కేతువులు మే 18 వరకూ రాహువు జన్మమందు మీనరాశియందు కేతువు సప్తమమున కన్యారాశియందు తామ్రమూర్తులుగాను అనంతరం రాహువు ద్వాదశ మందు కుంభరాశియందు కేతువు షష్ఠమున సింహరాశియందు సువర్ణమూర్తులుగా సంచరించును.
2025 మీనరాశి ఫలితములు
పూర్వాభాద్ర 4పా,
ఉత్తరాభాద్ర 1,2,3,4పా,
రేవతి 1,2,3,4పా.
ఆదాయం - 5, వ్యయం - 5,
రాజ్యపూజ్యం - 3, అవమానం - 1.
మీనరాశి స్త్రీ పురుషాదులకు గ్రహములన్నీ పరిశీలన చేయగా జన్మ శని, రాహు గురువు దోష ప్రదులుగాయున్నందున శుభశుభ మిశ్రమముగా ఈ సంవత్సరం ఉంటుంది. ప్రతీ విషయమున కంగారు, తొందరపాటుతనం, ప్రతీవారికి మాట ఇచ్చి ఇబ్బంది పడుట, తేజస్సు తగ్గుట. మనోవేదన జ్ఞాపకశక్తి తగ్గుట. హృదయమున భీతి, అనారోగ్య సమస్యలు. బంధువులతో వైరము, దుఃఖము, ఏ పనిచేసిననూ కలిసిరాకుండుట. శ్రమకు తగిన ఫలితము రాకుండుట. శరీరమున నొప్పులు, వ్యసనములు పెరుగుట, ప్రతీవారితోను మాటా, మాటా పట్టింపులు, చేయు వృత్తి వ్యాపార వ్యవహార, ఉద్యోగములు చెడుట, కాలం కలసి రాకుండుట. కలహములు భార్యబిడ్డలతో మాటలు పడుట, ప్రతీ పనికి ఒకరి సాయము లేనిచో చేయకుండుట. బుద్ధి నికరముగా లేకుండుట. ధననష్టము. తరుచూ ప్రయాణముల తరచూ డాక్టరుతో సంప్రదింపులు, స్నేహితులు ద్వారా ఇబ్బందులు, నేత్ర సంబంధిత బాధలు శ్రతుభయం.
పూర్వాభాద్ర నక్షత్రం వారిని మంచికాలము. ఉత్తరాభాద్ర వారికి బంధువులు లేక ఇంటి యందు పనిచేయువారితో ఇబ్బందులు లేక సూతకములు. రేవతి నక్షత్రం వారికి జీవన విధానమునందు క్రమము తప్పుట, కష్టములు, తన కన్నా పెద్దవారితో కలహములు. ఏ విషయానికి తలదూర్చకుండుట మంచిది. గృహమున శుభకార్యములు. ఖర్చులు అధికము. ధనము ఏదోవిధముగా చేతికందును.
ఈ సంవత్సరం దూరదృష్టితో చేయు పనులను వాయిదా వేయుట మంచిది. మీ కుటుంబము కూడా వ్యాపారము తప్ప అన్య విషయములు యందు వెళితే చాలా ఇబ్బందులుకొని తెచ్చుకొన్నవారవుదురు. స్థిరాస్తులు వాహనములు కొనుగోలు చేయుదురు. విదేశీయానము. అంత మంచిది కాదు. విదేశాలయందు ఉన్నవారు స్వదేశం వచ్చి నూతనముగా వ్యవహారములు. వ్యాపారములకు సరిఅయిన సమయముకాదు. ఎవరు అయిననూ బంధువులు, స్నేహితులకు ధనసంబంధమైన వారి ఇంట కలహములు అయినా మధ్య ఉండలేని చాలా ఇబ్బందులు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగును.
వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితము. మొదటి పంట కంటే రెండవ పంట కలసి వచ్చును. వాణిజ్య సంబంధిత పంటలు కూడా అర్ధలాభము. వ్యాపారస్తులకు జాగ్రత్తగా మెలగాలి. జాయింట్ వ్యాపారాలు చేయరాదు. ఒకరిని నమ్మి వ్యాపారము పెట్టరాదు. వ్యాపారస్తులకు ఆదాయం కుటుంబ ఖర్చలు. ధనము మంచినీళ్ళ వలె ఖర్చుఅగుట, కోర్టు వ్యవహారములు. నూతన పరిచయాల వలన కొంత ధనము కలసి వచ్చుట. కిరాణా, వస్త్ర, బంగారం, వెండి, చెరువులు పళ్ళు వ్యాపారస్తులకు శ్రమ అధికము. ఫలితము అర్ధలాభం. స్త్రీలతో విరోధములు. విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం ప్రోత్సాహం. కష్టే ఫలి అన్నచందాన నడుస్తుంది. ఆకర్షణలకు లోనవుదురు. లాయర్లు, వైద్యము, సినీరంగము వారికి చివిర 4 మాసములు బాటుంటుంది. తైలము, పుగాకు, పాలు వ్యాపారస్తులకు అనుకూలము.
మొత్తముగా ఈ రాశివారికి ఆలోచనలు అధికము. పనికి ముందుకు సాగదు. దైవ ఆరాధన చాలా ముఖ్యం ప్రతీనెల ఒకరోజు. ఉపవాసం ఉండి ఇతర సమస్యలు వదిలి పుస్తక పఠనం చేసుకొని నిర్మలంగా ఉండండి. స్త్రీలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సర అనుకూలము. వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి స్త్రీ సంతానం, బిడ్డలకు స్వల్ప అనారోగ్య బాధలు. ఉద్యోగము చేయుదురు. ఈ సంవత్సరం అనుకొన్న చోటికి బదిలీలు ఇరుగు పొరుగు వారితోను తోటికోడళ్ళ మధ్య పరస్పర విరోధములు, నడుము, పొట్ట సంబంధిత అనారోగ్య సమస్యలు.
keywords : 2025 meenarashi pahlitalu, 2025 meenarashi rashipahlitalu, 2025 rashiphalalu, 2025 panchangam,