Drop Down Menus

Bhagavad Gita 10th Chapter 11-21 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత దశమోఽధ్యాయః
అథ దశమోఽధ్యాయః |

తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ‖ 11 ‖


భావం : ఆ భక్తులను అనుగ్రహించడం కోసమే నేను వల్ల హృదయాలలో వుండి, అజ్ఞానం వల్ల కలిగిన అంధకారాన్ని ప్రకాశిస్తున్న జ్ఞానమనే దీపంతో రూపుమాపుతారు. 
అర్జున ఉవాచ |

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ‖ 12 ‖
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ‖ 13 ‖
భావం : అర్జునుడు: నీవు పరబ్రహ్మవని, పరమపవిత్రుడవనీ, దివ్యపురుషుడనీ, ఆదిదేవుడవనీ, జన్మలేనివడవనీ, దేవర్షి అయినా నారదుడు, ఆసితుడూ, దేవలుడూ, వ్యాసుడూ చెపుతున్నారు. స్వయంగా నాకు అలాగే చెపుతున్నావు.

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః ‖ 14 ‖
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ‖ 15 ‖
భావం : పురుషోత్తమ ! నీవు సమస్త భూతలకు ములకారణూడవు, అధిపతివి, దేవతలందరకూ దేవుడవు, జగత్తు కంతటికి నాధుడవు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటున్నావు.

వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ‖ 16 ‖
భావం : ఏ మహిమవల్ల నీవు సకలలోకాలలో వ్యాపించివున్నావో ఆ దివ్యమహిమలన్నిటి గురించి చెప్పడానికి నీవే తగినవాడవు.

కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ‖ 17 ‖
భావం : యోగీశ్వర ! నిరంతరం స్మరిస్తూ నిన్నెలా నేను తెలుసుకోవాలి ? ప్రభు! నిన్ను యేయే భావాలతో నేను ధ్యానించాలి.

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ‖ 18 ‖
భావం : జనార్ధనా! నీ  యోగమహిమాగురించి లీలావిభూతిగురించీ వివరంగా నాకు మళ్ళీ చెప్పు. నీ అమృత వాక్యాలను వినేకొద్ది తనవి తీరడం లేదు. 

శ్రీభగవానువాచ |

హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |

ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ‖ 19 ‖
భావం : శ్రీ భగవానుడు : అర్జునా! నా దివ్య వైభవలను గురించి అలాగే చెబుతాను. నా విభూతులకు అంతం లేనందువల్ల ముఖ్యమైన వాటినే వివరిస్తాను.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ‖ 20 ‖
భావం: ఓ అర్జునా! సమస్త ప్రాణుల హృదయముల యందున్న ఆత్మను నేనే. సకల భూతముల (ప్రాణుల) ఆదియు, మధ్యస్థితియు, అంతము నేనే. (ప్రాణుల సృష్ఠి స్థితి లయములకు కారణము నేనే).

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |

మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ‖ 21 ‖
భావం : అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను. వాయుదేవతలలోని తేజమును నేను. నక్షత్రాధిపతియైన చంద్రుణ్ణి నేను. 

10వ అధ్యాయం లోని 01-10 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
10వ అధ్యాయం లోని 11-21 శ్లోకాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
10వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 10th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.