Drop Down Menus

Bhagavad Gita 18th Chapter 61-78 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
అథ అష్టాదశోఽధ్యాయః |

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి |
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ‖ 61 ‖


భావం : అర్జునా! సర్వేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాలలోను విలసిల్లుతూ తన మయాతో సర్వ భూతాలను కీలుబొమ్మలలాగా ఆడిస్తున్నాడు.


తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ‖ 62 ‖
భావం : అర్జునా ! అన్ని విధాలా ఈ ఈశ్వరుడినే శరణు వేడు. ఆయన దయ వల్ల పరమ శాంతిననీ, శాశ్వతమైన మోక్షాన్ని పొందుతావు. 


ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ‖ 63 ‖

భావం : పరమ రహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీకెలా తోస్తే అలా  చెయ్యి.

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ‖ 64 ‖

భావం : నీవంటే నాకెంతో ఇష్టం. అందువల్ల నీ మేలుకొరి పరమ రహస్యమూ, సర్వోతక్కృష్టమూ అయిన మరో మాట చేపుతాను విను.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ‖ 65 ‖

భావం : నామీదే మనసు వుంచి, నా పట్ల భక్తితో నన్ను పూజించు, నాకు నమస్కరించు. నాకు ఇష్టుడవు కనుక ఇది నిజమని శపధం చెసి మరి చెపుతున్నాను. నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు.   

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ‖ 66 ‖
భావం : సర్వ ధర్మలనూ విడిచి పెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నీంటి నుంచీ నీకు విముక్తి కలుగజేస్తాను, విచారించకు.  

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ‖ 67 ‖
భావం : నీకు ఉపదేశించిన ఈ గీత శాస్త్రాన్ని తపసు చేయని వాడికి, భక్తి లేని వాడికి, వినడానికి ఇష్టం లేనివాడికి, నన్ను దుషించే వాడికి ఎప్పుడు చెప్పగూడదు.

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ‖ 68 ‖

భావం : పరమ రహస్యమైన ఈ గీత శాస్త్రాన్ని నా భక్తులకు భోదించేవాడు నా మీద పరమ భక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు. 

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః |
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ‖ 69 ‖

భావం : అలాంటి వాడి కంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనషులలో మరొకడు లేడు. అతనికంటే నాకు ఎక్కువ మక్కువ కలిగిన వాడు ఈ లోకంలో ఇక ఉండబోడు. 

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః |
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ‖ 70 ‖

భావం : మన ఉభయులకి మధ్య జరిగిన ఈ ధర్మసంవాదాన్ని చదివిన వాడు యజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా వూద్దేశం.

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సోఽపి ముక్తః శుభా~ంల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్ ‖ 71 ‖

భావం : ఈ గీత శాస్త్రాన్ని శ్రద్దతో అసూయ లేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది, పుణ్యాత్ములుండే శుభలోకాలకు చేరుతాడు.

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసంమోహః ప్రనష్టస్తే ధనంజయ ‖ 72 ‖

భావం : పార్ధా! నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీత శాస్త్రాన్ని విన్నావు కదా! ధనుంజయా!  అవివేకం వల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా ?

అర్జున ఉవాచ |
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ‖ 73 ‖
భావం : అర్జునుడు : కృష్ణా! నీ దయ వల్ల నా వ్యామోహం తొలగిపోయింది. జ్ఞానం కలిగింది. నా సందేహాలన్నీ తిరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను.



సంజయ ఉవాచ |
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్ ‖ 74 ‖
భావం : సంజయుడు : శ్రీ కృష్ణా భగవాడికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య ఇలా ఆశ్చర్యకరంగా, ఒళ్ళు పులకరించేటట్టుగా సాగిన సంవాదాన్ని విన్నాను.

వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్ ‖ 75 ‖
భావం : యోగేశ్వరుడైన శ్రీ కృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి అతి రహస్యమూ, సర్వోతక్కృష్టమూ ఈ యోగా శాస్త్రాన్ని చెబుతుండగా శ్రీ వేదవ్యాస మహర్షి కృప వల్ల నేను విన్నాను.


రాజన్సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ |
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ‖ 76 ‖
భావం : ధృతరాష్ట్ర మహారాజా! అద్భుతమూ, పుణ్య ప్రదమూ అయినా శ్రీ కృష్ణార్జునుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను.


తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |
విస్మయో మే మహాన్రాజన్హృష్యామి చ పునః పునః ‖ 77 ‖

భావం : ధృతరాష్ట్ర మహారాజా! అద్భుతమైన  అయినా శ్రీ కృష్ణ భాగవనుడివిశ్వరుపాన్న మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ  మహాశ్చర్యంపొంది ఎంతో సంతోషిస్తున్నాను. 

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ‖ 78 ‖
భావం : యోగేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ధనస్సు ధరించి అర్జునుడూ వుండే చోట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా వుంటాయని నా విశ్వాసం. 

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
మోక్షసంన్యాసయోగో నామాష్టాదశోఽధ్యాయః ‖ 18 ‖







18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 18th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning











ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments