15. పాశురము
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో? శిల్లెనభై యేన్మిన్? నట్లైమీర్, పోదరుగిన్రేన్ వల్లై ఉన్ కట్టురైగళ్ పణేయున్ వాయఱిదుమ్ వల్లీర్లళ్ నీజ్ఞతే, నానేదా నాయుడుగ ఒల్లెనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ? ఎల్లారుమ్ ఫోన్టారో? ఫోన్టార్, ఫోన్టెణ్ణిక్కొళ్ వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.
భావము: ఈ మాలిక సంభాషణ రూపంలో వున్నది బయటివారు - ఓ లేత చిలుకా! ఇంకను నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే! లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా! ఇదిగో వస్తున్నాను. బయటివారు - శ్రీఘ్రముగా రావమ్మా!
లోపలి గోపాంగన - అబ్బా! గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలువకండి. వస్తాలే!''
బయటివారు - ఓ చిన్ని చిలుకా! నీవు చాలా చమత్కారంగా మాటాడుతావు. నీ నేర్పిరితనము, నీ పుల్లవిరుపు మాటలు మేమిదివరకే యెరుగుదుములేమ్మ! లోపలి గోపాంగన - మీరే అట్టి సమర్ధులమ్మా! నేనేమీ కాదులే! ఐనా మీరన్నట్లు
నేనట్టిదానినేనేమో! రావలసిన వారందరూ వచ్చిరా?
బయటివారు - ఆ అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క జూడవచ్చు కదా! లోపలి గోపాంగన - వచ్చి నేనేమి చేయవలెనో చెప్పరాదు?
బయటివారు - కువలయాపీడమనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీ కృష్ణుని కల్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసినగాని మనము చేయు వ్రతము శుభప్రదముగ పూర్తికాదు అని బయటినుంచి సమాధానము చెప్పి ఆమెను కూడ తమ గోష్టిలోనకి చేర్చుకొన్నారు గోపికలు.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 15వ పాశురం
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment