Drop Down Menus

పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి ఆశీస్సులు పొందండిలా - Tirumala Information in Telugu | Good News For New Couples

నూతన వధూవరులకు శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని అందించే కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది. 
మాంగల్యధారణం అంటే.. "నా జీవనానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నారు. నీవు నిండు నూరేళ్ళు జీవించు" అని అర్థం. హైందవ సనాతన ధర్మంలో వివాహ బంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. యువతీ యువకులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి జగ్రదక్షకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. ఇందుకు చేయాల్సింది ఒక్కటే. పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపితే చాలు.
వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది తిరుమల, తిరుపతి దేవస్థానం. భక్తులు పూర్తి చిరునామాతో శుభలేఖ పంపితే చాలు.. శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది. వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు. ఇందుకు ప్రతీకగా.. శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతారు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన ‘కల్యాణ సంస్కృతి’ పేరిట ఓ పుస్తకాన్ని, తితిదే ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.
ఇందుకోసం నూతన వధూవరులు ‘కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి- 517501’ పేరిట వివాహ పత్రికను పంపాలి. పెళ్లి ముహూర్తానికి నెలముందు పంపితే మీకు వాటిని పోస్టులో పంపుతారు. మరిన్ని వివరాలకు కాల్‌ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలని తితిదే సూచించింది.
కొత్త దంపతులకు తితిదే వారు పంపే కుంకుమ, కంకణం, ఆశీర్వచన పత్రిక
Address:
The Executive Officer, TTD Administrative Buildings, 
KT Road, Tirupati 517501
TTD call centre: 0877 2233333 or 2277777

మరిన్ని తితిదే వారి సమాచారం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్క్ చేయండి. 
Related Postings:

tirumala, tirupati, tirumala information in telugu, tirumala accommodation details, tirumala surrounding temples list, famous temples in tirumala, tirumala temple accommodatin details, tirumala angapradhakshana information, tirumala k t road, tirupati, hindu temples guide, lord venkateswara, blessings wedding card tirumala.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Present days we are not receiving the kumkuma kankam etc it's my experience

    ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.