Drop Down Menus

Bhagavad Gita 18th Chapter 21-30 Slokas and Meaning in Telugu | సరళమైన తెలుగు లో భగవద్గీత

శ్రీమద్ భగవద్ గీత అష్టాదశోఽధ్యాయః
అథ అష్టాదశోఽధ్యాయః |

పృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్ ‖ 21 ‖


భావం : వేర్వేరుగా కనుపించే సర్వభూతలలోని ఆత్మలు అనేక విధాలుగా వున్నాయని భావించే వాడి జ్ఞానం రాజసజ్ఞానం.

యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ‖ 22 ‖

భావం : తత్వాన్ని తెలుసుకోకుండా, తగిన కారణం లేకుండా సమస్తమూ అదే అనే సంకుచిత దృష్టితో ఏదో ఒకే పనిమీద ఆసక్తి కలిగి ఉండే వాడి జ్ఞానం తామసజ్ఞానం.

నియతం సంగరహితమరాగద్వేషతః కృతమ్ |
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే ‖ 23 ‖

భావం : ఆసక్తి,అభిమానం, అనురాగం, ద్వేషం, ఫలాపేక్ష లేకుండా శాస్త్ర సమ్మతంగా చేసే కర్మను సాత్త్విక కర్మ అంటారు.

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్ ‖ 24 ‖

భావం : ఫలాభిలాషతో, అహంకారంతో అధికప్రయాసతో ఆచరించే కర్మను రాజస కర్మ అని చెబుతారు.

అనుబంధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ‖ 25 ‖

భావం : సాధకభాదకలనూ, తన సామర్థ్యాన్ని ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామసకర్మ అవుతుంది.

ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ‖ 26 ‖
భావం : ఫలాపేక్ష, అహంభావం విడిచి పెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలను లెక్క చేయకుండా కర్మలు చేసేవాన్ని సాత్విక కర్త అంటారు.

రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోఽశుచిః |
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ‖ 27 ‖

భావం : అనురాగం, కర్మఫలాశక్తి, దురాశ, పరపిడిన పరాయణత్వాలతో శుచి, శుభ్రమూ లేకుండా సుఖదుఃఖాలకు లొంగిపోతు కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు.

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ‖ 28 ‖

భావం : మనోనిగ్రహం, వివేకం, వినయం లేకుండా ద్రోహ  బుద్ధితో, దుష్టస్వభావంతో నిరంతర విచారంతో, కాల యాపనతో కర్మలు చేసే వాన్నీ తామసకర్త అని చెబుతారు.

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ‖ 29 ‖

భావం : ధనంజయ! గుణబేధాలను బట్టి బుద్ధి, ధైర్యమూ మూడేసి విధాలు. వాటిని గురించి  పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ‖ 30 ‖

భావం :  పార్థా! కర్మ మార్గాన్ని,సన్యాస మార్గాన్ని, కర్తవ్యాకర్తవ్యాలనూ, భయా భయాలను, బంధాన్ని, మోక్షాన్ని గ్రహించే బుద్ధి సాత్విక బుద్ధి.


18వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here 

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 18th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning













ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.