Dhannus Rasi 2025-2026 ధనుస్సు రాశి ఫలితాలు
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
“యే, యో, బా, బి, భూ, భా, డ, భే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు ధనుస్సురాశికి చెందినవారు.
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5
ధనూరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు నామ సంవత్సరమంతయు శుభాశుభ మిశ్రమ ఫలితములు కలుగును. భోగలాలసతో అధిక ధనవ్యయము చేయుదురు. ధనాదాయము బాగుండును. ఇంటి బయట కలహ వాతావరణముండును. ప్రతి విషయము నందు చిక్కులు ఎదురగును. మనఃశ్శాంతి కరువగును. అయిననూ ధృఢ చిత్తముతో కార్యసాధనకు ఉపక్రమింతురు. బంధుమిత్రాదుల సహకారములతో కార్యజయము చేయుదురు. భార్య/భర్త/ సంతానములో చిక్కులు ఎదురగును. ప్రభుత్వ అనుమతులు సకాలములో రాక పోవుటచే పనులన్నియు ఆగిపోవును. సంఘ గౌరవము సామాన్యముగా నండును. చేయువృత్తి వ్యాపార ఉద్యోగాదులయందు వృద్ది కలుగును. పోలీసు కోర్టు కేసులయందు వ్యతిరేకత వ్యక్తమగును. భూ, గృహనిర్మాణాది కార్యములు ఆలస్యముగా నెరవేరును. వివాహది శు భకార్యము చేయుటలో ధనము ఖర్చు చేయుదురు. విలువైన వస్తు సామాగ్రిని సమకూర్చు కుందురు. అనవసరమైన వస్తువులు సైతము కొనుగోలు చేయుదురు. ధనము వృధాగా ఖర్చు అగును. మాతృవునకు అనారోగ్య సమస్యలు కలుగును. వాహన సమస్యలు కలుగును.
సంవత్సర ప్రారంభమున విశేషమైన ధనవ్యయము శక్తికి మించిన ఋణములు చేయుట బంధుమిత్ర కలహములు సమస్త కార్యముల యందు వ్యతిరేకత ఆదాయ వ్యయముల మధ్య సమతూకము చెడిపోవుటచే సమస్యలు కలుగును. ఇచ్చిన మాట నిలబెట్టు కొనలేకపోవుట, అనారోగ్యము, దొంగలభయము కలుగును. విలువైన వస్తువులు పొగొట్టు కొందురు. నమ్మినవారి వలన మోసపోవుదురు. అగ్నిభయము కలుగును. ప్రభుత్వ అనుమతులు నిలిచిపోవుటచే చిక్కులు ఏర్పడును.
సంవత్సర మధ్యమంబున అనారోగ్య సమస్యలు వేధించును. భార్య/భర్త సంతానము మద్య సఖ్యత లోపించును. ఇతరుల పట్ల ఆకర్షణ పెరుగును. భౌతిక వాంఛలకు లోనగుదురు. శారీరక శ్రమ పెరుగును. వాత రోగము ప్రవేశించును. స్వస్థాన చలనము కలుగును. పోలీసు కోర్టు కేసులయందు వ్యతిరేకత వ్యక్తమగును. ఇంటి యందు ప్రసవము కలుగును. మానసిక దౌర్భల్యము కలిగిననూ ధైర్యముగా పనులు చక్కబెట్టుకుందురు.
సంవత్సరాంతమున సకల కార్యజయము కలుగును. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభము సిద్ధించును. రాజ దర్శనము జరిగి అనుకున్న పనులు సత్వరము పూర్తి అగును. శరీరపోషణ కలుగును. నూతన శయ్యాసౌఖ్యము, వస్తు, వాహన సంచయము కలుగును. నూతన వస్త్రభూషణ ప్రాప్తి కలుగును. మనోల్లాసముతో ముందడుగు వేయుదురు. శతృనాశనము కలుగును. చేయు వృత్తి వ్యాపార, కృషి ఉద్యోగాదుల యందు గుర్తింపు లభించును. నూతన రాజకీయ పదవీయోగం సిద్ధించును. సన్మాన సత్కారములు పొందెదరు. భార్య/భర్త/సంతాన మూలక చిక్కులు పరిష్కారమగును. సంతానవృద్ధి కలుగును. భూలాభము, క్షేత్ర లాభము కలుగును. గురు మిత్ర సందర్శనము చేయుదురు. దేవతా దర్శనము పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు. గోలాభము కలుగును.
విద్యార్దులకు శుభాశుభ మిశ్రమ కాలము. చివరి నిమిషములో ర్యాంకులు సాధించెదరు. అభివృద్ధి పట్టెదరు. సాంకేతిక చిక్కులు వెంటాడును. చివరికి విజయం సాధించెదరు. ర్యాంకులలో కొంత వెనుకబడి ఉందురు. నిరుద్యోగులకు మిశ్రమ కాలం. నిరాశలో ఆశలు చిగురించి తగిన ప్రాధాన్యత పొంది. మంచి ఉద్యోగము పొందుటలో సఫలీకృతులు కాగలరు. ఉద్యోగులు అనుక్ను ప్రాంతాలకు బదిలీలు పొందగలరు. ప్రమోషన్లు పొందెదరు. కాని చివరి వరకు సస్పెన్స్ కొనసాగును. ఉన్నతాధికారుల గుర్తింపు ఆదరణ లభించగలదు. వ్యాపారులకు అనుకూల కాలము. ధనాదాయము బాగుండును. అభివృద్ధి బాట పట్టెదరు. నూతన వ్యాపారాభివృద్ధి ప్రణాలికలు సఫలం కాగలవు. కొన్ని సమస్యల వలన ఇబ్బందులు చిక్కులు ఎదుర్కొని ధైర్యముతో విజయము సాధించి అభివృద్ధిలో నడిచెదరు. కార్మికులకు గుర్తింపు లభించగలదు. శక్తివంచన లేక పనిచేయగలరు. శ్రమకు తగిన ప్రతిఫలం లభించగలదు. గౌరవమర్యాదలు పొందగలరు. యజమానులతో సఖ్యత కలుగును. ఆదాయము వృద్ధి అగును. వ్యవసాయదారులకు ఆదాయము పెరుగును. నూతన క్షేత్రములను అభివృద్ధి చేసేదరు. మాట పట్టింపులు ఉండును. శ్రమకు తగిన ప్రతిఫలం లభించగలదు. చీడపీడల వలన కొంత నష్టములు కలుగును. సాముదాయకముగా అభివృద్ధిలో నుందురు. పశువృద్ధి కలుగును. ఆక్వాకల్చర్ వారికి అనుకూల కాలము. నూతన సాంకేతిక పనిముట్లు సమకూర్చుకొందురు. క్షేత్రాభివృద్ధి చేయుదురు. ఆదాయ వనరులు విస్తరించును. వస్తు వాహనములు సమకూర్చుకుందురు. కవులు, కళాకారులు గౌరవ మర్యాదలు పెరుగును. శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. పేరు ప్రఖ్యాతలు పెరుగును. సినిమారంగము వారికి అభివృద్ధికి బాటలు పడును. చేసిన పనులు విజయవంతమగును. ప్రపంచవాప్త్యంగా గుర్తింపు లభించగలదు. చిక్కులను అధిగమించగలరు. రాజకీయ నాయకులకు ప్రజా ప్రభుత్వ గుర్తింపు లభించి నూతన రాజకీయ పదవీయోగము సిద్ధించును. ప్రజా మద్దతు లభించును. నిర్ణయములకు మద్దతు లభించును. NRI లకు పూర్తి అనుకూల కాలం. విదేశీ ప్రయాణములకు పరిస్థితులు అనుకూలించును. స్పెక్యులేషన్ సామాన్యము.
గ్రహశాంతి : రాహు, కేతు, శని, గురు, చంద్ర, బుధ గ్రహములకు శాంతులు చేసుకొనవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
అదృష్ట సంఖ్య :‘3' మిత్ర సంఖ్యలు 1,2,4,7,9 మిత్ర సంఖ్యలు. ప్రతినెల 3,12,21,30 తేదీలు ఆది,సోమ, గురువారములు
అదృష్టరత్నం : మూలా-వైడూర్యము, పుర్వాషాడ-వజ్రము, ఉత్తరాషాడ-కెంపు
రుద్రాక్షధారణం : త్రిముఖి, ద్వాదశముఖి, ఏకోన్నవింశతిముఖి ధరించిన శుభం.
మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.
శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..
- మేషరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు