సింహ రాశి వారి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Simha Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Simha Rasi 2025-2026 సింహ రాశి ఫలితాలు

సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

“మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు సింహరాశికి చెందినవారు.

ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6

సింహరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగాఈ విశ్వావసు నామ సంవత్సర మంతయూ శుభాధిక మిశ్రమ ఫలితములతో నుండును. ఎక్కువ కాలము ధనలాభములతో ఉత్సాహముగా నుండును. అప్రయత్న కార్యసిద్ధి ధన వృద్ధి కలుగును. మధ్య మధ్య ఆటంకములు, మనోచింత ఉన్ననూ ధనాదాయము పెరుగుచుండుటచే ఉల్లాసముగా నుందురు. ఆరోగ్యము బాధించును. తరచూ వైద్యశాలా దర్శనము ఔషధ సేవనము చేయవలసి వచ్చును. శరీరపీడ శరీరము నందు వ్రణములు కాంతి తగ్గుట వంటి సమస్యలు నెదుర్కొందురు. ఋణములు సమసి పోవును నూతన వస్తు వాహనములు సమ కూర్చుకుందురు. మనోల్లాసముతో నుందురు. ఇంటా బయట కష్టములనెదుర్కొందురు.

సంవత్సర ప్రారంభమున కొన్ని సమస్యలు ఎదుర్కొనక తప్పదు. కార్యనాశనము సర్వకార్యముల యందు వ్యతిరేకత, అనారోగ్యముతో వైద్యశాలా దర్శనము ధనహాని, అపఖ్యాతి మనశ్శాంతి కోల్పోవుట జరుగును. తదుపరి అన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చి మనశ్శాంతి కలుగును. ధనలాభము అపరిమితముగా నుండును. కీర్తి పెరుగును. శారీరక బలము కలుగును. శతృనాశనము కలుగును. అప్రయత్న ధనలాభము అప్రయిత్న కార్యసిద్ధి కలుగును. నూతన వస్తు, వాహనములు సమకూర్చు కొందురు. బంగారు ఆభరణ ప్రాప్తి నూతన వస్త్ర ప్రాప్తి కలుగును. చేయు వృత్తి, వ్యాపార,ఉద్యోగాదుల యందు గుర్తింపు లభించును. మిత్ర లాభము కలుగును. నూతన ప్రయత్నములు అప్రయత్నముగా ఫలించును.

సంవత్సర మధ్యమంబున ధనవ్యయము బాధించును. ఆదాయమునకు మించిన వ్యయము కలుగును. ఋణ భారము పెరిగి స్థిరాస్తులు తరిగిపోవును. ఆరోగ్యము మందగించును. తరచు వైద్యాశాల దర్శనము చేయిక తప్పదు. కీర్తి ప్రతిష్టలకు భంగము వాటిల్లును. తక్కువ వారి వలన మాటలు పడుదురు. దుర్వ్యయము పెరుగును. వృధా సంచారము చేయుదురు. నమ్మిన వారి వలన మోసపోవుదురు. కష్టనష్టములు పెరుగును. భార్య/భర్త/సంతాన మూలక సమస్యలు పెరుగును. శరీరమునందు పుండ్లు, గాయముల వలన సమస్యలు కలుగును. వాహన నష్టములు ఉండును.

సంవత్సరాంతమున తిరిగి అన్ని విధములా పుంజుకొందురు. ఆరోగ్యము మెరుగుపడును. సన్నగిల్లిన శక్తిని తిరిగి పొంది సమస్యల నుండి బయటపడుదురు. ధనధాన్య వృద్ధి కలుగును. ఆగిపోయిన శుభకార్యములు పూర్తిచేయగలరు. ఇంటియందు సంతానవృద్ధి కలుగును. పుత్రసంతాన లాభముచే మనోల్లాసముతో నుందురు. భార్య/భర్త సంతానముతో సుఖజీవనము చేయుదురు. బలము కలుగును. గురుదేవతా దర్శనము కలుగును. మంత్రసిద్ధి యజ్ఞ దీక్షాది కార్యములు చేయుదురు. అన్నదాన విభవము కలుగును. నూతన ఉద్యోగలాభము పదవీ యోగము సిద్ధించును. ఐశ్వర్యము వృద్ధి అగును. సువర్ణ, రజిత వస్త్ర, వాహన భూషణాదులు సిద్దించును. మధ్య మధ్య కొంత భీతి, అనారోగ్యము కలిగిననూ సమయమునకు తగిన ఔషధ సేవను చేయుటచే స్వస్థత చేకూరును. చేయు వృత్తి వ్యాపార, ఉద్యోగాదులయందు అపరిమితమైన ధన లాభము కలుగును. స్త్రీ దేవతారాధన మంత్రసిద్ధి సిద్ధించును.

విద్యార్దులకు సామన్యకాలము అనుకున్న మార్కులు సాధించుటలో విఫలమగుదురు. ర్యాంకులు అవార్డులు రివార్డులు తృటిలో తప్పిపోవును. ధనవ్యయము చేయుటచే నూతన కోర్సులు చేయుదురు. నిరుద్యోగులకు మిశ్రమకాలము కష్టమునకు తగిన ఫలితము లేకున్ననూ ఉద్యోగ ప్రయత్నలు ఫలించును.కొంత తక్కువ స్థాయి ఉద్యోగములు పొందుటుచే ఊరట పొందెదరు. ఉద్యోగులకు ధనవృద్ధి కలుగును. ప్రయత్నములు వాయిదా పడును. ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ప్రయత్నము మీద విజయం సాధించెదరు. పై అధికారుల మన్ననలు పొందగలరు. వ్యాపారులకు శుభాశుభా మిశ్రమ ఫలితములతో నుండగలదు. నూతన ప్రయత్నములు వాయిదాపడును కాని ఆర్థిక లాభము అనుకూలముగా నుండగలదు. వ్యాపార విస్తరణ | వాయిదాపడును. స్నేహితులతో పార్టనర్స్తో అభిప్రాయ భేధములు పొడచూపును. కార్మికులకు కష్టకాలము అధికశ్రమతో విసుగు చెందుదురు. శ్రమకాఠిన్యము పెరుగును. ప్రమాదములు జరుగు అవకాశమున్నది. శక్తికి మించిన శ్రమచేయవలసి వచ్చును ప్రతిఫలము తక్కువగా నుండును. వ్యవసాయదారులకు ప్రతిఫలాపేక్ష సామాన్యము. ఆర్ధిక వనరులు సమకూరును. నూతన క్షేత్ర పశు లాభము కలుగును. అనారోగ్యము బాధించును. శక్తి సన్నగిల్లును. ఆక్వాకల్చర్ | వారికి కత్తిమీద సామువలె నుండును. కాని చివరికి ధనలాభము పొందగలరు. ధైర్యముతో శక్తి సమకూర్చుకుని విజయం సాధించగలరు. కవులు, కళాకారులు మంచి కాలము సన్మాన సత్కారములు పొందగలరు. ముందు తిరస్కారముల పొందినా చివరికి పురస్కారము పొందగలరు. సినిమారంగము వారికి ప్రోత్సాహకరముగా నుండగలదు. విజయము సాధించ గలరు ఆర్ధిక పరిస్థితి బాగుండును. నూతన ప్రయత్నముల యందు విజయము పొందగలరు. రాజకీయ నాయకులకు శుభాశుభా మిశ్రముగా నుండగలరు. కొంత వ్యతిరేకత వ్యక్తమగును. | అనాలోచిత నిర్ణయములతో పదవీగండము ఉండును. కొర్టు కేసులను ఎదుర్కొనక తప్పదు.

NRI లకు సామన్యము. ప్రయాణములు వాయిదా పడుటచే సమస్యలు నెదుర్కోందురు. స్పెక్యులేషన్ లాభించదు.

గ్రహశాంతి : ఈ సంవత్సరమంతయూ గురు, శని, రాహు, కేతు గ్రహశాంతి ఆచరించవలెను.

అదృష్ట సంఖ్య : ‘1' 2,3,4,7,9 మిత్ర సంఖ్యలు ఆది, సోమ, గురు, మంగళ వారములు కలిసిన శుభము.

అదృష్ట రత్నం : మఘ-వైఢూర్యము, పుబ్బ-వజ్రము, ఉత్తర-కెంపు ధరించవలెను.

రుద్రాక్ష ధారణం : ఏకముఖి, దశముఖి, త్రిజుటి ధరించవలెను.

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS