వృషభ రాశి వారి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Vrushabha Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Vrushaba Rasi 2025-2026 వృషభ రాశి ఫలితాలు

వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

“ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వె, వో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు వృషభరాశికి చెందినవారు.

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3

వృషభ రాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ సంవత్సరమంతయూ శుభాధిక ఫలితములతో అత్యంత ఉత్సాహముగా నుందురు. చేపట్టిన అన్నికార్యములు సత్వరం నెరవేరి మనోధైర్యముతో ముందుకు సాగగలరు. చేయు వృత్తి వ్యాపార, ఉద్యోగాదుల యందు అత్యంత అనుకూలమైన వాతావరణముతో మీ మాటకు విలువ పెరుగును. శరీర ఆరోగ్యం చేకూరును. ఇంటియందు వివాహాది శుభకార్య నిర్వహణ సఫలీకృతమగును. భూ, గృహ నిర్మాణాది కార్యములు అసంకల్పితముగా నెరవేరును. శతృపీడ, ఋణపీడ తొలగును. నూతన పదవీయోగం కలుగును. ధనధాన్య సమృద్ధి కలుగును. తరుచు పుణ్యతీర్ధ గమనము చేయుదురు. నూతన దేవాలయ, తటాక నిర్మాణములు చేయుదురు. అన్నదాన విభవము కలుగును. బంధు మిత్రాదుల యందు కీర్తి, గౌరవము కలుగును. తలచినదే తడవుగా కార్యసిద్ధి కలుగును. సకల కార్యసిద్ధితో ఉత్సాహముగా నుందురు. గురు సంచారముచే రాజకోపము, యశోహాని ఉద్యోగ విరోధము కలుగును. తదుపరి హృదయ సుఖము యశోవృద్ధి, సౌభాగ్యము, సర్వజనప్రియత్వము, పుణ్యకార్యములకు ధన వ్యయము చేయుట సంతోషము కలుగును. స్వల్పముగా శ్రమయు బంధు వైరము, ధనవ్యయము, శరీరబాధ, ఉద్యోగ భంగములు ఉన్ననూ సత్వరము స్వాంతన చేకూరును. శని సంచారముతో దేహరోగ్యము, ద్రవ్యలాభము, భర్త/భార్య సంతాన లాభము, విశేష సుఖము, ఇష్ట సిద్ధి కలుగును. రాహుకేతు చారముచే మనఃసంతోషము, కర్మసిద్ధి, ఇష్టాన్న భోజనము, వస్త్ర పుష్పమాలికా లాభము, శరీర ధారుడ్యము అకాల భోజనము, ప్రయాణ విఘ్నములు కలుగును.

సంవత్సర ప్రారంభము నందు కొలత మనశ్చాంచల్యము మనో రధములు నెరవేరుటలో ఆలస్యము, ప్రభుత్వ అనుమతులు నిలిచియుండుట, పోలీసు, కోర్టు కేసుల యందు కొంత వ్యతిరేకత జరిమానాలు కట్టవలసి వచ్చును. ధైర్యము సడలును. ప్రయాణ విఘ్నములు, అకాల భోజనము కలుగును. తర్వితగతిని పరిస్థితులు మారి మీకు అనుకూలముగా మారును. ధనవృద్ధి కలుగును. ధైర్యము పెరుగును. శ్రేష్టమైన వస్తులాభము. పురాణ, గాన, శ్రవణ విద్యా వినోద పాండిత్యము కలుగును. స్వజనుల యొక్క అనుకూలతచే ధాన్యవృద్ధి కలుగను.

సంవత్సర మధ్యమము నందు భార్య/భర్త/సంతానాభివృద్ధి ధనలాభము, సర్వకార్యజయుము, మిత్రవృద్ధి, విశేష కీర్తి కలుగును. పురాణశాస్త్రాది విజ్ఞాన లాభము, వస్త్ర ప్రాప్తియు, ఇష్టార్ధ సిద్ది, నూతన వస్తు వాహన లాభము కలుగును. పుత్రలాభము తప్పక కలుగును. మానసిక శారీరక ఆరోగ్యము సిద్ధించును. అప్రయత్న కార్యసిద్ధి, ధనలాభము కలుగును. వాయిదా పడిన సమస్యలు హఠాత్తుగా నెరవేరి ఆనందము చేకూరును. వివాహది శుభకార్యములు సిద్ధించును. రాజ దర్శనము కలుగును. రాజకీయ పదవీయోగం సిద్ధించును.

సంవత్సరాంతమునందు తలచిన కార్యములు మందకొడిగా సాగును. వేదాంత విచారణ చేయుదురు. సాధు సాంగత్యము కలుగును. ధనక్షయమగును. కార్యములయందు రాజీ ధోరణి అవలంభించెదరు. స్వల్ప నష్టముతో కార్యములు చక్కబెట్టుకొందురు. దుష్ట సాంగత్యము చే నష్టములు కలుగును. ప్రయాణ విఘ్నములుండును. మనోధైర్యము తగ్గిననూ తగిన శక్తియుక్తులతో పొరాడి విజయము సాధించగలరు.

విద్యార్థులకు అనుకూల కాలము. స్టేట్ ర్యాంకులు సాధించెదరు. ప్రఖ్యాతి చెందిన విద్యాసంస్థలయందు సీటు సంపాదించగలరు. నిరుద్యోగులకు అత్యంత అనుకూల కాలము ఎదురుచూచిన ఉద్యోగ సంపాదన యందు పురోగతి వ్యక్తమగును. నిరీక్షణ ఫలించి మంచి ఉద్యోగములు సాధించగలరు. ఉద్యోగులు అత్యంత సౌఖ్యవంతముగా నుండును. పై అధికారుల గుర్తింపు లభించును. గౌరవ మర్యాదలు పొందెదురు. కోరినచోటికి బదిలీలు పొందగలరు. మీమాటకు విలువ పెరుగును. వ్యాపారులకు అనుకూలకాలము వ్యాపారాభి వృద్ధి కలగును. నూతన ప్రణాళికలు పట్టాలెక్కును కొత్త బ్రాంచీలు తెరుచుదురు. నూతన ఆవిష్కరణలుతో గుర్తింపు పొందెదరు. కార్మికులకు శ్రమతగ్గును, గుర్తింపు పెరుగును. యాజమాన్యముతో అనుకూలత పెరుగును. మంచి వాతావరణము లభించును. ధన వృద్ధికలుగును చేసిన పనికి తగిన గుర్తింపులభించును. వ్యవసాయదారులకు చీడపీడల భయము తగ్గి దిగుబడులు పెరుగును. తమ ఉత్పత్తులకు ధరలు పెరుగును. నూతన క్షేత్రాభివృద్ధి కలుగును. ఆక్వాకల్చర్ రైతులకు అనుకూల కాలము దిగుబడి పెరుగును. ధనవృద్ధి కలుగును. అనుకూల ఫలితములు ఉండును. కవులు, కళాకారులు అత్యంత శు భదాయకమైన కాలము ప్రభుత్వ గుర్తింపు లభించును. ప్రజా స్పందనతో గౌరవము లభించును. సినిమారంగము వారికి పురోగతి లభించును. నూతన ప్రాజెక్టులు పట్టాలెక్కును. హిట్లు సాధించెదరు. అవార్డులు, రివార్డులుతో ఉత్సాహముగా నుండెదరు. రాజకీయ నాయకులకు ఆదరణ పెరుగును ప్రజా, ప్రభుత్వ గుర్తింపు పొంది నూతన రాజకీయ పదవీయోగం సాధించెదరు. గౌరవ మర్యాదలు పెరుగును.

NRI లకు అనుకూల కాలము ఇంటా, బయట గుర్తింపు, గౌరవము పొంది ఆర్ధికముగా బలపడెదరు. విదేశీఛాన్సులు సత్వరము లభించును. స్పెక్యులేషన్ లాభించును.

గ్రహశాంతి : ఈసంవత్సరమంతయూ చంద్ర, బుధ, గురు, రాహు, కేతు గ్రహశాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి

అదృష్ట సంఖ్య : ‘6' 6,15,24 తేదీలు శుక్రవారం శుభం. 5,8 తేదీలు బుధవారం, శనివారం కలిపిన మరింత యోగప్రదం.

అదృష్ట రత్నం : కృత్తిక-కెంపు, రోహణి-ముత్యం, మృగశిర-పగడం ధరించవలయును.

రుద్రాక్షధారణం : పంచముఖి, చతుర్దశముఖి, ఏకవింశతి ముఖి (5,14,21 ముఖాలు)

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS