మేష రాశి వారి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - Mesha Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu

Mesha Rasi 2025-2026 మేష రాశి ఫలితాలు

మేష రాశి : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

“చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మేషరాశికి చెందినవారు.

ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7

మేషరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు సంవత్సరమంతయూ శు భాశుభ మిశ్రమ ఫలితములతో నుందురు. తలచిన కార్యములన్నియు ఆలస్యము మీద నెరవేరగలవు, బంధు, మిత్రవృద్ధి కలుగును. ఇంటియందు శుభకార్యములు నిలబాటు కలుగును. ప్రయత్నము మీద ధనవ్యయముతో పూర్తి కాగలవు. భూ,గృహనిర్మాణాది కార్యములు సాగదీత ధోరణిలో పూర్తికాగలవు. విద్యా, ఉద్యోగ విషయముల యందు అసంతృప్తి కలుగును. ప్రయత్నములు ఆశా జనకముగా నున్ననూ ఫలితములు ఆలస్యమగును. తరుచూ వాయిదాలు పడును. శరీర ఆరోగ్యం సామాన్యంగా నుండగలదు. అభివృద్ధి కార్యములు వాయిదాల మీద సానుకూలము కాగలవు. శతృపీడ తగ్గును. ధనవృద్ధి కలుగును కాని ధనవ్యయము అపరిమితముగా నుండ గలదు. మద్య, మద్య చికాకులు కలుగును. భర్త/భార్య/సంతానముతో మాట పట్టింపులు కలుగును. దూరదేశ ప్రయాణములు తీర్ధయాత్రలు చేయుదురు.

సంవత్సర ప్రారంభమునందు శుభా, శుభ మిశ్రమ ఫలితములతో నుండును. చేయు వృత్తివ్యాపార ఉద్యోగాదులయందు చికాకులు, మనశ్శాంతి లోపించుట, పైఅధికారుల వలన మాటలు పడుట, తక్కువ వారితో నిందలు పడుట జరుగును. ఆర్ధిక పరిస్థితి బాగున్ననూ అనవసర ఖర్చులు పెరుగుటతో ఆర్ధిక పరిస్ధితి అతలాకుతలమగును. హఠాత్తుగా అపరిమిత ధనవ్యయము మీదపడును. బంధు మిత్రాదులు కలిసిరాక అనుకున్న పనులు చేయుటలో ఇబ్బందులు పడుదురు. భూ, గృహ నిర్మాణాది కార్యములు వాయిదా పడును. ఇంటియందు వివాహాది శుభాకార్యములు నిలచి యుండును. శరీర ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టును. ,తరచుగా వైద్యాశాల దర్శనం చేయవలసి వచ్చును. ఔషధ సేవనం తప్పనిసరి. ముఖ్యమైన పనులు ప్రభుత్వ పరమైన అనుమతులు సాంకేతిక ఇబ్బందులతో ఆగిపోవును. బ్యాంకులావా దేవీలయందు మోసమునకు గురి అగుదురు. స్థిరచరాస్తులు కరిగిపోవును. నూతన వ్యక్తులు పరిచయం ఇబ్బందులు కలిగించును. నూతన ప్రయత్నములు చివరి వరకు వచ్చి ఆగిపోవును.

సంవత్సర మధ్యకాలము నందు కొంత అనుకూల పరిస్థితులు గోచరించును. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాదులయందు అనుకూలతలు గోచరించును. భక్తి, వైరాగ్యములు పెరుగును. తరుచుగా దేవాలయ సందర్శనలు తీర్ధయాత్రలు చేయుదురు. మానసిక ధైర్యము పెరుగును. శారీరక ఆరోగ్యము కలుగును. నూతన స్నేహము లాభించును. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడును. ఆగిన కార్యములు తిరిగి ప్రారంభమగును. అన్ని విషయములలో పురోగతి కలుగును. లాటరీల వంటి యందు విజయములు సాధించగలరు. చేసిన పనికి తగిన గుర్తింపు లభించును. ధనవ్యయము తగ్గును. నిలచిన ప్రభుత్వ అనుమతులు సత్వరము లభించి కొన్ని పనులు పూర్తికాగలవు. సంతాన లాభము కలుగును. భార్య/భర్త/ సంతాన సమస్యలు కొలిక్కి వచ్చును. అందరితో సఖ్యత ఏర్పడును. ఆరోగ్యము కుదుటపడుటచే మానసిక స్థైర్యము పెరుగును. అభివృద్ధికరమైన పనులు చేయుదురు. సంఘము నందు పేరు ప్రఖ్యాతులు పెరుగును.

సంవత్సరాంతమునందు కొంత పురోగతి సాధించగలరు. శుభాశుభ మిశ్రమ ఫలితము లతో ముందుకు సాగగలరు. ఆర్ధిక పరిస్థితి కుదుట పడును. శతృపీడ తగ్గును. ఋణములు తీరిపోవుటచే కొంత మానసిక ఉల్లాసము కలుగును. నూతన వ్యక్తుల స్నేహము లాభించును. దూరదేశ ప్రయాణముల, విదేశీ వ్యాపారమునకు అనుకూల కాలము. మధురమైన భోజన పదార్ధములు లభించును. నూతన వస్తు సముదాయము సమకూర్చుకొందురు. ధనాదాయము పెరుగును. ధర్మకార్యములు చేయుట వలనసంతోషము కలుగును. ఏలినాటిశని ప్రాంభంమగుటచే మానహాని, మనఃక్లేశము, వ్యవసాయనష్టము, అనారోగ్యము, అజీర్ణము, ఇంటియందు పోరు, దారిద్య్ర బాధ కలుగును.

విద్యార్ధులకు అనుకూల కాలము కాదు, రెండు ఛాన్సుల యందు నిరాశఎదురగును. జ్ఞాపకశక్తి తగ్గును.ర్యాంకుల పొగొట్టుకొందురు. నిరుద్యోగులకు ఆశాజనకముగా లేదు. ఉ ద్యోగ ప్రత్నములు వాయిదాపడును. చివరి నిమిషములో నిరాశ ఎదురగును. మరికొంత కాలము వేచి ఉండక తప్పదు. ఉద్యోగుల కు అనుకూల కాలము కాదు. పై అధికారుల వలన మాటలు పడక తప్పదు, చేసిన పనికి తగిన గుర్తింపులేకుండును. ప్రమోషన్లు నిలిచి ఉండును. వ్యాపారులకు శుభాశుభ మిశ్రమకాలం, నూతన ప్రయత్నముల వాయిదాపడును,లాభనష్టములు సమానంగా నుండును. కష్టము మీద ఫలితము కానవచ్చును. కార్మికులకు కఠినమైన శ్రమకాలము, శ్రమపెరుగును శ్రమకు తగిన గుర్తింపు, ఫలితము లేకుండును. అసంతృప్తితో నుండగలరు. గౌరవ మర్యాదలు తగ్గును. వ్యవసాయదారులకు లాభములు లేవు, నష్టశాతము తగ్గును. కఠిన శ్రమ మిగులును. ప్రకృతి వ్యతిరేకముగా నుండును. ప్రయత్నములు నిలచి ఉండును. ఆక్వా కల్చర్ రొయ్యలు, చేపలు ఉతృత్తిదారులకు నిరాశ ఎదురగును. నష్టములు చవిచూచెదరు. కవులు, కళాకారులకు నిరాశాజనకముగా నుండగలదు. సంఘ గౌరవము తగ్గును. తగిన ప్రొత్సాహములేక నిస్సత్తువతో నుండగలరు. సినిమారంగము వారికి అనుకూలము కాదు, నూతన ప్రయత్నము ఫలించవు. గుర్తింపు తగ్గును. రాజకీయ నాయకులకు పదవీగండములు తప్పవు. అనవసరములతో అపఖ్యాతి నొందెదరు. NRI లకు పూర్తి వ్యతిరేక కాలము. విదేశీ ప్రయాణములు వాయిదా పడును. స్పెక్యులేషన్ లాభించదు.

గ్రహశాంతి : ఈసంవత్సరమంతయూ రవి, గురు, శని, రాహు, కేతు గ్రహ శాంతి ఆచరించవలెను. నవగ్రహ పూజాక్రమము పరిశీలించండి.

అదృష్టసంఖ్య : '9', 1,2,3,4,7 మిత్ర సంఖ్యలు, 9,18,27 తేదీలు మంగళ, ఆది, సోమ, గురువారములు మంచివి.

అదృష్ట రత్నం : అశ్వని వైఢూర్యము, భరణి వజ్రము, కృత్తిక కెంపు, ధరించవలయును.

రుద్రాక్షధారణం : షణ్ముఖి, పంచదశముఖి, గౌరీశంకర, రుద్రాక్షలు ధరించవలయును.

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS