Kumba Rasi 2025-2026 కుంభ రాశి ఫలితాలు
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు
“గు, గే, గో, సా, సీ, సు, సే, సో, దా” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు కుంభరాశికి చెందినవారు.
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5
కుంభరాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ విశ్వావసు నామ సంవత్సర మంతయూ శుభా శుభ మిశ్రమ ఫలితములతో నుండును. ఏలినాటి శని ప్రభావముచే విపరీతమైన ధనక్షయము ఆర్థిక ఇబ్బందులు శారీరక మానసిక పీడ, ఒత్తిడి, శతృభయము కలుగును. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవుట, పరుష వాక్యములు విపరీతమైన కోపము తెగువ మానసిక అశాంతి సర్వులతో కలహములతో అనిశ్చితిగా నుందురు. కొన్ని కార్యముల యందు అధిక శ్రమతో విజయము పొందగలరు. భార్య/భర్త/సంతానము మధ్య కలహములు న్ననూ సానుకూల ధోరణి వ్యక్తమగును. రాజీ ధోరణితో ముందుకు పోగలరు. ప్రభుత్వ అనుమతులు నిలచి పోవుటచే కొన్ని కార్యములకు ప్రతిబంధకములు ఎదురగును. శు భకార్య నిర్వహణ వాయిదాలు పడును. చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల యందు ధనక్షయం కలుగును. శతృవుల వలన సమస్యలు ఉత్పన్నమగును.
సంవత్సర ప్రారంభమున అశాంతితో మానసిక అస్థిరత్వము కలిగి ఆందోళనకు గురి కాగలరు. అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టును. మంచికి పోతే చెడు ఎదురగును. బంధుమిత్రాదులు శతృభావముతో మెలగుదురు. మతిస్థిమితము కోల్పోవుటచే వృధా సంచారము చేయుదురు. పాప చింతన కలుగును. గురు, పండిత, దైవ దూషణ చేయుదురు. శరీరమున తేజస్సు తగ్గిపోవును. సంఘ గౌరవము తగ్గును. మీ ప్రాధాన్యత లేకనే ఇతరులు సంచరించెదరు. గాయములు పుండ్లు వంటి బాధలు కలుగును. జంతు విష కీటక భయము కలుగును. ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదములు చోటుచేసుకొనును.
సంవత్సర మధ్యమంబున అన్ని శక్తులు కూడదీసుకొని సర్వకార్య ప్రారంభములు చేయదురు. బంధు మిత్ర సహకారముతో అనూహ్యముగా పనులు చక్కబడును. మీ అభిప్రాయమునకు గుర్తింపు లభించును. ఆత్మ విశ్వాసము పెరుగును. శతృవులు తోక ముడిచెదరు. ఆరోగ్యము సహరించును. భార్య/భర్త/సంతానము మధ్య కలహములు నివారణ అగును. మీ శక్తికి మించిన పనులు చేయుటలో మీకు మీరే సాటి అనిపించుకొందురు. వివాహాది శుభకార్య ప్రయత్నములలో ముందడుగు పడును. ఋణములు తీరిపోవును.
సంవత్సరాంతము ధనవ్యయముతో ప్రారంభమగును. సకల కార్యములు అధిక ధన వ్యయము చేసిన మీదట పూర్తి కాగలవు. ఆదాయమునకు మించిన వ్యయము కలుగుటచే ఋణములు చేయక తప్పదు. మనోనిశ్చయముతో ముందుకు పోగలరు. మీ అభిప్రాయములను అందరూ గౌరవించి మన్నించెదరు. సంఘ గౌరవము పెరుగును. బంధుమిత్రాదుల సహకారముతో సమస్యలను అధిగమించగలరు. భార్య/భర్త/సంతానము మధ్య సఖ్యతతో సమస్యలు నివారణ అగును. అనారోగ్య సమస్యలు కలిగిననూ ఔషధ సేవనముతో అధిగమించి పురోగమించగలరు. అనవసర ప్రయాణములు కలిగి ధన నష్టములు కలుగును. తప్పుడు సమాచారముతో మోసపోవుదురు. విదేశీ ప్రయాణములు బెడిసి కొట్టును. చేతులు కాళ్ళు, వ్రేళ్ళ యందు అనారోగ్య బాధలు కలుగును. మంచి చెడులను విశ్లేషించి నిర్ణయము చేయగలరు. సంతానాభివృద్ధి కలుగును. మధ్యవర్తిత్వము అనుకూలించును.
విద్యార్దులకు వ్యతిరేకత ఉన్నట్లు అనిపించిన చివరికి విజయం సాధించెదరు. మందబుద్ధి కలుగును. మానసిక శారీరక ఒత్తిడి కలుగును. అనారోగ్య లోపములచే వెనుకబాటు కలగును. ర్యాంకులు తృటిలో తప్పిపోవును. నిరుద్యోగులకు ఆశ నిరాశల మద్య అవకాశములు దోబూచులాడును. చివరికి కొంత ఉపశమనముగా నుండును. ఆశించిన ఉద్యోగమునకు తక్కువ స్థాయి ఉద్యోగము తాత్కాలికముగా పొందగలరు. ఉద్యోగులకు తాత్కాలిక అభివృద్ధి కలుగును. నిరాశ ఎదురగును. బదిలీలు ప్రయోషన్లు విషయమై నిరాశ ఎదురు కాగలదు. కొన్ని ప్రయత్నములలో విజయం సాధించగలరు. వ్యాపారులకు మిశ్రమకాలము. ఆర్ధిక వృద్ధి బాగుండును. కాని వ్యాపారాభివృద్ధి కార్యములు వాయిదా పడును. కొన్ని వ్యాపారములు తగ్గించుకొనవలసి వచ్చును. నూతన ప్రాజెక్టుల విషయమై ఆచితూచి అడుగు వేయవలెను. కార్మికులకు సామాన్య కాలము. శ్రమ పెరుగును. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆదాయ వనరులు పెరిగిన ఖర్చు అపరితముగా నుండును. శక్తికి మించిన పనులు చేయుదురు. వ్యవసాయదారులకు మిశ్రమ కాలము. చీడపీడల సమస్యలు కలుగును. పశు గో క్షేత్ర వృద్ధి కలుగును. అపరితమైన ధనవ్యయము కలుగును. ఆక్వాకల్చర్ వారికి అపరిమితమైన 'ధనాదాయము దానికి తోడు అపరితమైన ఖర్చులు కలుగును. కవులు, కళాకారులు తగిన గుర్తింపు లభించగలదు. రాజ గౌరవము పొందగలరు. సన్మాన సత్కారములు పొందగలరు. సినిమారంగము వారికి శుభాశుభ మిశ్రమ కాలము. చేతినిండా పని ఉండును. గుర్తింపు లభించును. హిట్టు కొట్టుదురు. రాజకీయ నాయకులకు అనుకూల కాలము. ప్రజాప్రభుత్వ గుర్తింపుతో నూతన పదవీయోగం పొందగలరు. మీ నిర్ణయములతో ప్రజాచైతన్యం కలిగి మద్దతు లభించును. ఆరోగ్యము మందగించును. ఆదాయ వనరులు సామాన్యముగా నుండగలవు NRI లకు సామాన్యము. అదృష్టముదోబూచులాడును. మనో ధైర్యం తగ్గును. స్పెక్యులేషన్ విషయములో ఆచితూచి నిర్ణయములు చేయవలెను.
గ్రహశాంతి: ఈ సంవత్సరం రాహు, కేతు, గురు, శని, కుజ గ్రహశాంతులు ఆచరించవలెను. నవగ్రహశాంతి క్రమం పరిశీలించండి.
అదృష్ట సంఖ్య : ‘8' 5,6 మిత్ర సంఖ్యలు. ప్రతినెలా 8,17,26 తేదీలు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత శుభము.
అదృష్టరత్నం: ధనిష్ట-పగడం, శతభిషం-గోమేధికం, పూర్వాభాద్ర-పుష్యరాగం
రుద్రాక్షధారణం: సప్తముఖి, అష్టముఖి, షష్టదశముఖి, సప్తదశముఖి ధరించిన శుభం.
మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.
శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..
- మేషరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృషభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మిథునరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కర్కాటకరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- సింహరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కన్యరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- తులారాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- వృశ్చికరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- ధనుస్సురాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మకరరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- కుంభరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
- మీనరాశి 2025-2026 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం
Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు