Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Shakari Devi Shaktipeetham Srilanka | Temples Timings Accommodation Pooja Details


శంకరీదేవిశక్తీ పీఠము(ట్రింకోమలి,శ్రీలంక ):  
అష్టాదశ శక్తీ  పీఠాలలో ప్రథమంగా చెప్పబడినది శంఖరి శక్తిపీఠం. ఇది శ్రీలంకలో ట్రింకోమలి నగరంలో ఉంది. ట్రింకోమలి  అనగా  త్రిభుజ ఆకారంలో ఉన్న పర్వతాలు. ఇక్కడ  అమ్మవారి తొడభాగం పడిన స్థలంగా చెప్తారు . ప్రస్తుతం  ధ్వజస్తంభం   శిథిలమైనపటికి వాటిని మళ్ళి పునరుద్దరణ జరిపి అక్కడ నటరాజస్వామిని,శంఖరీదేవి విగ్రహాలను ప్రతిష్టించారు. ఇక్కడ  గుహలు ఈ  గుహలు పక్కన అవదంబరిచెట్టు ఉంది.ఈ చెట్టుకి భక్తులు తమ  కోరికలను కాగితాలలో రాసి చెట్టుకి కడతారు. హరిచంద్రుడు, చంద్రమతి వంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. తరువాత  గుహలలో గణపతి కొలువైఉన్నాడు. 
ప్రపంచంలో ఎక్కడ కనపడని శివలింగంలో పార్వతి దేవి కలిసిఉన్న శివలింగం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఒక్క శక్తిపీఠం మాత్రమే ఇతర దేశంలో శ్రీలంకలో ఉంది. మిగిలిన 17 శక్తీ పీఠాలు భారతదేశంలో ఉన్నాయి.
            ట్రింకోమలి నగరంలో కాళికాదేవి ఆలయం కూడా  గొప్పప్రసిద్ధి  చెందినది .  ఇక్కడ చూడదగిన వాటిలో బుద్ధస్థూప,స్పైసీగార్డెన్ బుద్ధటూత్ రిలిక్ టెంపుల్, ముతిమరిన్ అమ్మన్ కొవి,ఛైన్మయ మిషన్ ఆంజనేయ టెంపుల్, రావణాఫాల్స్, సీతాదేవి అగ్నిపరీక్షస్తలం వంటి స్థలాలను సందర్శించవచ్చు.

buddhastupa:
ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసిన స్థలం.
Spice Garden:
ఇక్కడ సంజీవనిపర్వతం  ముక్కపడినది అని చెప్తారు.ఇక్కడ  లవంగాల చెట్టు, మిరియాలుచెట్టు , యలికలచెట్టు ఎన్నో రకమైన చెట్లు కనిపిస్తాయి .
Buddhatooth relic temple: 
ఈ గుడికి చాల ఆవశ్యత ఉంది. వివిధ దేశాల  నుండి  భక్తులు ఇక్కడకు వచ్చి ఈ గుడిని సంధర్షించుకొంటారు.
chinmaya mission Anjaneya temple            
ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కారణం ఏమిటంటే ఇక్కడ ఆంజనేయస్వామి విశ్రాంతి తీసుకోనట్లుగా చెప్తుంటారు. 
Related Postings:

Tirumala Sapathagiri Magazine Free Download
Kashi Information in Telugu
Madurai Temple Information in Telugu

18 shaktipeethas,astadasa peethalu, shankari devi, srilanka shakti peetham, shankari devi temple informaiton in telugu, how to reach shankari devi peetham, shankari devi temple timings, shankari devi history, latest shankaridevi temple info, sri lanka shankaridevi shaktipeetham, sri lanka , sri lanka temples, srilanka,

Comments

Post a Comment